మది లోన మధుర భావం...పలికెను మోహనరాగం!


 

.

మది లోన మధుర భావం...పలికెను మోహనరాగం!

.

వలచే కోమలి వయ్యారాలకు –

తలచే మనసున తీయ దనాలకు కలవా విలువలు సెలవీయా ?

.

పై మెరుగులకే భ్రమ పడకయ్యా –మనసే మాయని సొగసయ్యా –

గుణమే తరగని గుణమయ్యా
.ప్రేమించిన అమ్మాయి ని చిగురాకులలో చిలకమ్మ తో పోల్చటం భలే తమాషా గా ఉంది .తన మనసులో ఉన్నది చిన్న మాటే –దాన్ని వినమని బతిమాలుతున్నాడు .వింటే సరిగ్గా స్పందిస్తున్దని ఆశ, ఆరాటం అత గాడికి .

ఆమె కూడా పల్లె టూరిదే .కాయా, కసరూ అమ్ముకోనేదే .అయినా ఆమె భావమూ అతి సున్నితం గా ఉండటమే సముద్రాల చూపిన ప్రత్యేకత .ప్రియుడిని మరు మల్లెలలో మామయ్యా అంది అంతే లలితం గా .ఆ చెప్పే మంచి మాటేదో సెలవీవయ్యా అని భలేగా అడిగింది .’సెలవీయటం ‘’సముద్రాల ఎంచుకొని వేసిన ‘యాప్ట్ పదం ‘’.అప్పుడాయుకుడికి ఆ మంచిమాటేమిటో సెలవిస్తాడు .ఆమె చిరు నవ్వుకు పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు సరికావు పొమ్మన్నాడు .ఆమె కు ఇది గొప్ప అభి నందన .అంత సున్నితం గానూ చెప్పాడు. కాదు చెప్పించాడు రచయిత .ఇక్కడ నాయికా నాయకుల అభినయమూ అద్భుతం గా ఉండేట్లు టీర్చి దిద్దాడు తన దర్శక ప్రతిభ తో కెవి రెడ్డి .ఆమె దాన్ని తేలిగ్గానే తీసుకోంది.ఎవరో అన్న ఈ మాటను నువ్వు తీసుకొని నాకు ఆపాదిన్చావు .అందులో భావాన్ని బానే అందుకొని నాకు అతికిన్చావు .నీ నోటితో ఇలాంటి కమ్మని మాట వినటం ఇంపుగా సొంపుగా ఏంతోరుచిగా ఉన్నట్లు ఉంది అందామె .

ఎప్పుడూ మనసులో మధురం గా తలచుకొంటూ ,వలచే కోమలి వయ్యారాలకు ,తలచే మనసున తియ్యదనాలకు విలువలు కట్టటం సరికాదు అసలు కట్టలేము అన్నాడు గడుసు కుర్రాడు దొంగ రాముడు .

ఆమె ఒక ఆకు ఎక్కువే చదివింది .పై మెరుగులకు భ్రమసి పోవటం చేటు తెస్తుంది .మనసు మాయని సొగసు కనుక గుణమే ప్రధానం .అది తరగని నిధి .దానికే విలువ ఎక్కువ అని జీవిత సత్యాన్ని కాచి వడ బోసి నట్లు సెలవిచ్చింది .ఇద్దరూ హాయిగా నవ్వుకుంటారు .అతడు కొద్ది రోజుల్లో నేరస్తుడు అనే ముద్ర వేయిచుకో బోతాడు అనే సూచన కూడా ఇందులో కనీ పిస్తుంది. రాబోయే కధకు సూచ్యార్ధ సూచన ఆమె వాడిన మాట .ఇన్ని విషయాలను సముద్రాల అతి సున్నిత పదజాలం తో ,సందర్భోచితం గా ఒక పల్లె టూరి యువ జంట పై రాసి వారి మనసులలోని భావాలను ,ఆంతర్యాలను మహా నేర్పుగా వెలువరించారు .ఈ పాటకు అంతకు మంచిన స్వరం తో, బాణీ తో ,రాగ బంధం గా మధురం గా గా మనసులకు గిలిగింతలు పెట్టేట్లు హాయిని కూర్చేట్లు పెండ్యాల స్వరకల్పన చేశారు. అంత కమ్మగా జిక్కీ ,ఘంటసాలలు పాడి దానికి అమరత్వం కల్గించారు .మధ్యలో వచ్చే ‘’ఓఓ లు ఉఊలు ,ఆ ఆ లు ‘’మాధుర్యాన్ని పెంచి వీనులకు విందు కూర్చి లలితా మనోహరత్వానికి ఆభరణం అయ్యాయి .ఈ మొత్తాన్ని అతి సహజం గా ఆకర్షణీయం గా ,వారి నిండు మనసుల కు ,ప్రేమ వలపుకు హృదయపు లోతులకు దర్పణం గా సెల్యులాయిడ్ పై చిత్రీకరించి సుమధుర కావ్యం గా ఈ పాటను చిత్రీకరించారు కే వి.రెడ్ది. అందరూ అందరే. అందుకే పండింది .మనసు నిండింది .అభినందనల నందుకొంది ఈ పాట. అందుకే నాకు గీతా మకరందం అయింది .
https://www.youtube.com/watch?v=5vVCeDXPygE

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!