.
భర్తృహరి వైరాగ్యశతకము ౨
.
ఆకలి ..ఎంత పని ఆయెన చేస్తుంది.
.
భ్రాన్తం దేశమనేకదుర్గవిషమం ప్రాప్తం న కిఞ్చిత్ఫలం
త్యక్త్వా జాతికులాభిమానముచితం సేవా కృతా నిష్ఫలా।
భుక్తం మానవివర్జితం పరగృహేష్వాశఙ్కయా కాకవత్
తృష్ణే జృమ్భసి పాపకర్మనిరతే నాద్యాపి సంతుష్యసి॥ ౨
.
ఆంధ్రీకరణ...ప్రచురించినది : రాఘవ
.
విసికితి దుర్గదుర్విషయవిభ్రమయుక్తిఁ గులాభిమానమున్
బసచెడ సేవ చేసితి విపన్నుఁడనై పరగేహసీమ వా।
యసము వలెన్ భుజించితిఁ బ్రయత్నము నిష్ఫలమై నశించె సం
తసపడ వుగ్రకర్మపిశునత్వము చూపెద వాశ యేటికిన్॥
.
తా. దుస్సంచారములైన ప్రదేశాలలో దేశాటన చేసాను కానీ ఫలితం శూన్యం.
జాత్యభిమానం కులాభిమానం వదిలి నిరుపయోగంగా (ధనికులు మొదలైనవారికి) సేవ
చేసాను. (ఆపదలో) బెదురుతూనే ఇతరుల ఇళ్ళలో గౌరవంలేకున్నా కాకిలా భోజనం
చేసాను. ఇన్ని కష్టాలు పడినా ఓ పాపిష్ఠపు తృష్ణా, ఇప్పటికీ తృప్తి కలగడం
లేదు. నీవు ఇంకా ఇంకా పెరుగుతూనే విజృంభిస్తూనే ఉన్నావు.
Comments
Post a Comment