మందర పాత్రలోకి ఆంతర్యం.!


మందర పాత్రలోకి ఆంతర్యం.!
( త్రేతాయుగంలో ఆస్తికి హక్కుకాలం పధ్నాలుగు సంవ త్సరాలు.)
మంధర స్వభావ సిద్ధంగా మిక్కిలి చాకచక్యంగా మాట్లాడగల శక్తి గలది. ఆమె భరతుని పట్టాభిషేకం కోరి కైకతో అయోధ్యకు రాలేదు. కైకతో మిక్కిలి చనువుగా మెలుగుతూ, ఆమెకు అవసరం వచ్చినప్పుడు సలహాల నిస్తూ, తన మాటను నెగ్గించుకొనే స్థాయికి ఎదిగింది. మంధర మనోవాం ఛితం రాముని అరణ్యవా సానికి పంపడం కూడా కాదు. అతడు పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలన చేయాలి గదా! ఇది లోక కల్యాణానికి ఏర్పాటు చేయబడి న భగవంతుని అవతార ప్రయోజ నం. అందువ లన ఆమె పధ్నాల్గు సంవత్సరాలే అరణ్యవాసాన్ని కోరమని సలహానిచ్చింది.
దుర్బోధ చేయడానికి రామాయణంలో మంధర పాత్ర మహా బాగా రాణించింది. భౌతికంగా ఆమె గూనిదెై నా చాలా తెలివితేటలుగలది. గొప్ప మాటకారి కైకేరుూదే వికి మేలు చేయడమే తన పనిగా పెట్టుకొం టుంది.
పురాణ కథల్లోని చాలా సందర్భాలను వివరంగా అర్థం చేసుకొని ఆంతర్యాన్ని అర్థం చేసుకోగల్గితే అవి ఆయా వ్యక్తుల జన్మల కు గల పరమార్థాన్ని, ప్రత్యేకతను తెలియజేసి, మానవ మనుగడ మహోన్నతికి ఉప కరిస్తుందనుటలో సందేహం లేదు..
ఆమెకు అతిగా కైకేయిని అభిమానించడం తప్ప మరేమీలేదు. ఆ అభిమానంతో తనేదో లబ్ధిపొందాలన్న కోరిక లేదు.
ఆమె రామావతార ప్రయోజన రూపమైన రావణ వధకు ఉపకరించుటకు సృష్టించ బడిన అప్సరస యొక్క మానవ రూపం. అయితే, ఆమె రాముని అరణ్యవాసం పధ్నాల్గు సంవత్సరాలుగా కోరమని కైకను ఎందుకు కోరింది? త్రేతాయుగంలో ఆస్తికి హక్కుకాలం పధ్నాలుగు సంవ త్సరాలని, ద్వాపరయుగంలో పదమూడు సంవత్స రాలని, కలియుగంలో పన్నెండు సంవత్సరాలని చెబుతారు. ఇది రాజ్యాధికారం నిర్ణయించవలసిన కాలవ్యవ ధిగా ఉండాలి గాని, మానవ కల్పితంగా ఉండ కూడదు. కావున, దీనిని మనం హక్కుకు సంబం ధించి నట్టిదిగా భావించరాదు.పద్నాల్గు సంవత్సరాలు భరతుడు రాజ్యాన్ని పాలిస్తే, ఆయన మంత్రులు, సామం తరాజుల పనిజేసే యంత్రాంగం ఆయనకే కట్టుబడి ఉంటారని, రాముడు తిరిగివచ్చి పరిపాలనను చేపట్టినా, క్రితం పరిపాలనలోని జనమంతా ఈయ నకు అనుకూలంగా ఉండరనే అభిప్రాయంతో దీర్ఘకాల వ్యవధితో అరణ్యవాసం కోరబడిందని కొందరంటారు.
ఏదీ ఏమైనా ఇవన్నీ వివిధ వర్గాల్లోన్న అభిప్రాయాలే గాని ఇతిహాసానికి సంబంధించిన శాస్త్ర విషయాలు గావు.రాముడు పద్నాల్గు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని కోరడంలో స్పష్టమైన ఆంతర్యం ఉంది. రామునిది మానవా వతారం. అతడు అరణ్యవాసం చేస్తూ, అనేక మంది మహ ర్షులను సేవిస్తూ వారి ఆసిస్సులను పొంది, మానవబలాన్ని, దెైవబలంగా రూపొందించుకోవాలి. అంత వ్యవధి ఉంటేగా ని, తానూ తపస్సు జేసి గొప్పశక్తిని పొంది దానిని దెైవశక్తిగా రూపొందించుకోవడానికి వీలుండదు. రావణా సురుడు వేల సంవ త్సరాలు తపస్సు చేసి మహాశక్తి సంపన్నుడెై అజేయు డెైనాడు.ఆయనకు మాన వావతారుని వల్లనే మరణం ఉందని బ్రహ్మ వరమిచ్చాడు. అట్టి వానిని సంహరించడం సులభం కాదు. భగవంతుడు విష్ణుమూర్తి అవతారంలో ఉన్నప్పుడు నేను మానవావతారుడనని రావణాసురునికి భావన కల్గినప్పుడే అతడు సంహరింపబడగలడని తెల్పియున్నాడు.
సీతామహాసాధ్విని రావణుడు లంకలో ఒక సంవత్సరకాలం పాటు ఉంచి నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకొ న్నాడు. ఈ కాలమంతా ఆమె ధ్యాసలోనే గడిపాడు. నిత్య శివారాధనకు సైతం విఘాతం కల్గించుకొన్నాడు. నవగ్రహాలను సైతం తన స్వాధీనంలో ఉంచుకొన్న దశ కంఠుడు సీతామహాతల్లిని వాంఛిస్తూ, తన బ్రహ్మ వంశానికే కళంకం వచ్చే విధంగా పరస్ర్తీ వ్యామోహితుడెై అధఃపతితుడయ్యాడు. రాముని ప్రస్తావన వచ్చి నప్పుడు, అతడు మానవుడు నన్నేమి చేయగలడన్న ధీమా వ్యక్తం జేసేవాడు.రావణునికి అంత్యకాలం సమీపించేదానికి జరుగవలసిన పనులన్నీ పూర్తికావాలి.
అందులకు కొంత వ్యవధి కావాలి. అది పద్నాల్గు సంవత్సరాలుగా భగవంతునిచే నిర్థారింపబడి కైక నోట పలికించింది. అంతేగాని మంధరకు గాని కైకకు గాని రామునిపెై కక్షకార్పణ్యాలు లేవు.ఇలా మంధర శ్రీరామవనవాసానికి ప్రధమ సోపానాలను నిర్మించి, రామావతార ప్రాశస్త్యానికి చేదోడు వాదోడెైంది. అందువలన ఆమె పాత్ర చిత్రణ దెైవఘటన. దానికి రామా యణంలో ప్రత్యేకస్థానం ఉంది. చాలా సంఘటనల్లో అల్ప పాత్రల సృష్టి ద్వారా అధిక ప్రయోజనాలు ఉంటాయన్న దానికి మంధర వృత్తాంతమే నిదర్శనం.
- అప్పాజీ

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.