మహాత్ముడు.!



మహాత్ముడు
(కరుణశ్రీ.గారి మహాత్ముడు.)
.
.నలువదికోట్ల తమ్ముల జీవితమ్ముల
కాయన మాట వేదాక్షరంబు.
భీరులనే కర్మవీరుల గావించు .
ఆయన పిలుపు శంఖారవంబు.
సత్యంబు శాంత్యహింసలకు స్వాగతమిచ్చె .
ఆయన బ్రతుకు మహా ప్రయాగ.
కొల్లాయితో పిచ్చి పుల్లాయి వలె నుండు .
ఆయన దీక్ష లోకైక రక్ష
.అతడొక పవిత్ర ధర్మ దేవాలయంబు.
అతడొక విచిత్ర విశ్వవిద్యాలయంబు.
ఆ మహాశక్తి అంత ఇంతంచు తూచ.జాల,
మతడొక పెద్ద హిమాలయంబు
(Realstic pencil drawing of Mahthma.)

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.