Posts

Showing posts from July, 2019

అరుదైన పద్యాలు!

Image
ఆడది అంటే లయం లయం..ఆ నీడంటేనే భయం భయం. అరుదైన పద్యాలు! ♦️🌹♦️ 1. ఒకతెకు జగములు వణకున్; అగడితమై ఇద్దరు కూడిన అంబులు ఇగురున్; ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా; పట్టపగలె చుక్కలు రాలున్ . భావము: ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. అంటే స్త్రీ చాలా శక్తివంతురాలని భావము. ♦️🌹♦️ 2. కవితా కన్య రసజ్ఞత కవి కన్నా రసజ్ఞుడెరుంగు గాని కవి కేమి ఎరుగు; నవ కోమలాంగి సురతము భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును? . భావము: కవిత యొక్క భావంలోని అందం అది వ్రాసిన కవికంటే దాన్ని ఆస్వాదించే రసజ్ఞులకే బాగా తెలుస్తుంది. అలాగే యవ్వన స్త్రీ యొక్క సొగసులు తండ్రి కంటే కూడా భర్తకే బాగా తెలుస్తుంది. ♦️🌹♦️ 3. పుస్తకం వనితా విత్తం పరహస్త గతం గతం; అధవా పున రాయాతి జీర్ణం, భ్రష్టాచ ఖండశః . భావము: పుస్తకం, స్త్రీ, డబ్బు పరాయి చేతుల్లోకి వెళ్ళితే తిరిగి రావు. ఒకవేళ తిరిగి వచ్చినా పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపోయి వస్తుంది, డబ్బు విడతలు విడతల...

నాటి పాతాళ లోకమే నేటి అమెరికా!

Image
➖➖➖➖➖➖➖➖ నాటి పాతాళ లోకమే నేటి అమెరికా! ➖➖➖➖➖➖➖➖ పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరిం చారు. 👉 సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. 👉 ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ రేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.) 👉 కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland) (సగర పుత్రులు బూడిద కుప్పలు గా మారిన ప్రదేశం) మరియు 👉 హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (...

💥శ్రీ తుమరాడ.సంగమేశ్వర శాస్త్రిగారు.💥

Image
💥శ్రీ తుమరాడ.సంగమేశ్వర శాస్త్రిగారు.💥 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏  👉🏿దాదాపు డబ్భై ఎనభై ఏళ్ళ క్రితం మాట పిఠాపురం రాజా వారి ఆహ్వానం మేరకు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ పిఠాపురం వొచ్చారు.రాజావారు విందూ గట్రాతో పాటు ఓ సాయంకాలం వీణాగాన సభ ఏర్పాటు చేసారు!! వేదిక మీదకి తెల్లనిమల్లు పంచె అంచు లాల్చీ పక్కజేబులో పెట్టుకుని, అరచేతి వెడల్పు జరీకండువా, ముఖంమీద గంధం ధరించి, పరిమళాలు వెదజల్లుతూ ఓ పుంభావ సరస్వతి వొచ్చి వీణ ముందు కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని వీణని ’అమ్మా’ అని కళ్ళకద్దుకుని ఆ తర్వాత వాయించడం మొదలెట్టాడు. అంతే హంసధ్వని,కాంభోజి, కమాస్ రాగధార ప్రవహిస్తోంది. శ్రోతలు పరవశులైపోతున్నారు. వెండిగడ్డంతో బంగారు ఛాయలో మెరిసిపోతున్న రవీంద్రుడి కళ్ళనుంచి అశ్రుధారలు.. పులకించిపోయాడు విశ్వకవి.కరువుదీర కావులించేసుకున్నాడు వైణికుణ్ణి ’స్వామీ మీరు నా గురువు’ అని దణ్ణం పెట్టేడు. ఆ పుంభావ సరస్వతి పేరు తుమరాడ సంగమేశ్వర శాస్త్రి. ’నేను యావద్భారత దేశం తిరిగి అనేకమంది మహావిద్వాంసుల సంగీతం విన్నాను.నాకు సంగీతం అంటే వెర్రి అని మీకు తెలుసుగా! ఒక్కొక్క విద్వాంసుడిలో ఒక్కొక్క ప్రతిభ ఉంది. ...

🌺గుమ్మడి వెంకటేశ్వర రావు 🌺

Image
🌺గుమ్మడి వెంకటేశ్వర రావు 🌺 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ఏం బ్రదర్....ఆ చేతికున్న ఉంగరం ఏమైంది?...నిన్న ఉంది. నేను చూచాను..... నందమూరి సున్నితంగానే అడిగినా...ఆ గంభీరమైన వాయిస్ వింటే...కొంచెం కంగారు పడ్తూ...అదీ...ఎక్కడో పోయినట్లుంది బ్రదర్....అంటూ సర్దుకుంటున్న ఆయన భుజాన చేయి వేసి... ఈ నెల్లో మీ సంపాదన ఎంత బ్రదర్. ఇంటికెంత పంపించారు! నెలకు పాతిక సంపాదించి...యాభై ఖర్చు చేస్తే....మరి ఉంగారాలుంటాయా! మన ఆదాయానికి తగ్గట్టే....ఖర్చు ఉండాలి బ్రదర్. హోటల్ కు రిక్షాలో పోవడమెందుకు!....నడిచి పోయి వస్తే....తిన్నది బాగా అరుగుతుంది కూడా. పెళ్ళైన మగవాడు....తనగురించి...తన సరదాల గురించే కాదు బ్రదర్...పొదుపు చేసి ఇల్లు గడపాలి. ఒక్కసారి ఈ అప్పులు....తాకట్టులూ అంటూ మొదలు పెట్తే...ఇక పురోగతి ఉండదు బ్రదర్.... ఎన్.టి.ఆర్.....చెప్పిన ఈ మాటలు...ఆ వ్యక్తికి గుణపాఠం నేర్పించిందంటే అతిశయోక్తి కాదు. ఆయన మరెవరో కాదు....తెరమీద....ఆ నందమూరికే...ఎన్నో చిత్రాలలో తండ్రి పాత్రలు వేసి....బుధ్ధులు...సుద్దులు...నేర్పించే....గుమ్మడి వెంకటేశ్వర రావు గారే! ********* రావికంపాడు లో పుట్టినా...స్కూలింగ్ కొల్...

🌹💥 నీలవేణి వెల జెప్ప శక్యమే! 💥🌹

Image
🌹💥 నీలవేణి వెల జెప్ప శక్యమే! 💥🌹 👉🏿శ్రవణానందం ' కావ్యంలో ఒక స్త్రీకి తిరుపతి వేంకట కవులు ఎంత విలువ కట్టారో చూడండి. 🦋🦋🦋🦋🦋🦋🦋🦋 సీllపలుకొక్కటియే సేయు పదివందల వరాలు వాలు చూపులు రెండు వేలు సేయు నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు విర్రవీగుట లారువేలు సేయు పదమొక్కటియె సేయు పదివేల వరహాలు లావణ్యమది యొక లక్ష సేయు బలుసోయగమె సేయు పది లక్షల వరాలు కులుకు నడక తీరు కోటి సేయు 🌺 ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!! 🌺🌺 . అసాధారణ కవితావేశ సంపన్నులైన శ్రీ తిరుపతి వేంకట కవులిరువురూ ఒకే కాంతను ఇంతగా మెచ్చుకున్నారూ అంటే ఆ కాంత ఏ కాంతయో? 🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋 (చిత్రం -వడ్డాది పాపయ్యగారు .)