Posts

Showing posts from August, 2019

🚩అవ్వ తప్పిపోయింది

Image
🚩అవ్వ తప్పిపోయింది (క్లాసిక్ కథ--సేకరణ : సాక్షి.) 😃😀😃 మా అవ్వనెరగరూ మీరూ, అవ్వని… హయ్యొ! మా ఊళ్లో ఆవిణ్ని ఎరగనివాళ్లు లేరే! అసలు ఊరంతా అవ్వ అనే పిలుస్తారావిణ్ని. కొద్దిమంది ‘సుబ్బమ్మ గారూ’ అని కూడా అంటారు. ఆవిడకి కోపం వచ్చినపుడు ‘‘ఆ ఆ ఆ, ఎవర్రా అవ్వ! నువ్వు నాకేవవుతావురా చస్తే దెయ్యవవుతావు గాని’’ అని గద్దిస్తుంది. అప్పుడు చటుక్కున సర్దుకుని ‘సుబ్బమ్మగారూ’ అంటారు. ఒక్కొక్కప్పుడు, ‘సుబ్బమ్మ గారూ’ అని పిలిస్తే ‘‘హారి గాడిదా! వేలెడంత లేవు, బొడ్డుకోసి పేరెడతావురా నాకూ!’’ అని దులిపేస్తుంది. వెంటనే దిద్దుకుని ‘అవ్వగారూ’ అంటారు. ఏవయితేనేం… అందరికీ ఇష్టవే, అవ్వంటే. అవును. అందరికీ ఇష్టవే మరి! వాళ్లకేం పోయింది ఇష్టం గాక, ఎప్పుడో కనిపిస్తుంది వాళ్లకి. కనిపించినప్పుడు ఎంచక్కా కుశల ప్రశ్నలూ అవీ వేస్తుంది. సాతల్తో సాతాళించి కబుర్లూ కథలూ చెపుతుంది. మాంచి ఫారమ్‌లో ఉంటే – అంటే ఒడుపులో ఉంటే పాటలు పాడుతుంది. పావు పాటా అవీ. ఆ కాస్సేపూ వాళ్లకి కులాసాగా ఉంటుంది. వింటారు పోతారు. వాళ్లకేం! రాత్రీ పగలూ ఆవిడతో ఇంట్లో ఉండేవాళ్లం. మేం వేగలేక చస్తున్నాం గాని! అన్నట్టు – అవ్వంటే మీరెర