🚩🚩వెండితెర శ్రీరామచంద్రులు!🚩🚩 (తెలుగు, తమిళ ప్రేక్షకులకు రాముడంటే ఎన్ టి ఆర్ నే.)
🚩🚩వెండితెర శ్రీరామచంద్రులు!🚩🚩 (తెలుగు, తమిళ ప్రేక్షకులకు రాముడంటే ఎన్ టి ఆర్ నే.) ‘శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు మరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.’’ -ఈ శ్లోకం, త్రేతాయుగ కథా నాయకుడు, అవతార పురుషుడు అయిన శ్రీరామచంద్రమూర్తి బాహ్య సౌందర్యాన్ని, అత్యంత శక్తివంతమైన, అంతర్గత లక్షణాలను వివరిస్తుంది. తెలుగు సినీ చరిత్రలో, ఆ శ్రీరామచంద్రుని పాత్రకు తమ అభినయం ద్వారా ప్రాణప్రతిష్ఠచేసిన మహానటుల అభినయాన్ని రేఖామాత్రంగా అవలోకిద్దాం.. ఆంధ్ర దేశంలో తొలి సినిమా ప్రదర్శనశాల విజయవాడలోని మారుతి టాకీస్ దాని యజమాని, పోతిన శ్రీనివాసరావు, 1933లో నిర్మించిన చిత్రం ‘పృథ్వీపుత్ర’. ఇందులో శ్రీరాముని పాత్రను ఈలపాట రఘురామయ్య పోషించారు. ఆయన అసలు పేరు ‘కల్యాణం వెంకట సుబ్బయ్య’. 8 సంవత్సరాల వయస్సులో ‘రామదాసు’ నాటకంలో బాలనటుడిగా...