🚩🚩-మహానుభావుడు బమ్మెర పోతన!-🚩🚩
🚩🚩-మహానుభావుడు బమ్మెర పోతన!-🚩🚩 #బమ్మెరపోతన సహజ పాండిత్యుడు, సద్గుణ సంపన్నుడు, వినయ విద్యా వివేక వినిర్మల త్రివేణీ సంగమ స్నాతుడు, శ్రీ రామ పాద సేవార్చనా దురంధరుడు ఐన బమ్మెర పోతన మహానుభావుడు సంస్కృతం లోని భాగవతమును తెలుగులోకి అనువదించినవాడు మాత్రమే కాదు..శ్రీ కృష్ణ లీలామృత భాగవతంను సంస్కృతం తరవాత దేశ భాషలలోనికి అనువదించడం ఈయనతోనే ప్రారంభం ఐంది. సంస్కృత భాగవతం తొలిగా తెలుగులోకి అనువదింప బడిన తర్వాతనే ఇతరదేశ భాషలలోకి అనువదించడం మహానుభావులు ఎందరో మొదలు బెట్టారు. భక్తి వేదాంత తత్త్వంలో ప్రసిద్ధుడు అగ్రగణ్యుడు అని భావింప బడేకృష్ణ చైతన్యులు వంగ దేశంలో క్రీ.శ.1485 నుండి 1533 వరకూ జీవించినవాడు.ఆసేతు హిమాచలం పర్యటించిన కృష్ణ చైతన్యుడు పోతన వారి భాగవతంచేత ముగ్దుడైనాడు. చైతన్యుడు తెలుగు దేశానికి వచ్చినట్లుగా గుర్తుగా మంగళగిరి లో ఆయన పాదుకలు చెక్కబడి వున్నాయి. ఆతర్వాతి వాడైన మరొక మహానుభావుడు వల్లభాచార్యుల వారు తెలుగు బ్రాహ్మణుడు, ప్రత్యక్షంగా పోతన భాగవతం చేత ప్రభావితుడుఐన వాడు. చత్ర పతి శివాజీ మహారాజు గురువు, శ్రీ రామ, ఆంజనేయ సాక్షాత్కారం పొందినమహా ఉపాసకుడు, సమర్ధ రామదాసు మహారాష్ట్ర నుండి ...