జై శ్రీరామా 🚩జై శ్రీరామా 🚩జై శ్రీరామా 🚩 పరమపావన!

జై శ్రీరామా 🚩జై శ్రీరామా 🚩జై శ్రీరామా 🚩 పరమపావన! (పోతన విరచిత శ్రీమత్తెలుగుభాగవత తృతీయ స్కంధాంత ప్రార్థన.) -త. 💥"పరమపావన! విశ్వభావన! బాంధవప్రకరావనా! శరధిశోషణ! సత్యభాషణ! సత్కృపామయ భూషణా! దురితతారణ! సృష్టికారణ! దుష్టలోక విదారణా! ధరణిపాలన! ధర్మశీలన! దైత్యమర్దన ఖేలనా! 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥 👉👉 శ్రీరామచంద్రప్రభు! నీవు పరమపావనుడవు. విశ్వభావనుడవు. బంధుజనావనుడవు. సముద్రజలాలను శోషింపజేసిన వాడవు. సత్యభాషణుడవు, అపారదయాగుణ భూషణుడవు. దురితాలను గట్టెక్కించే వాడవు. జగత్ సృష్టికి కారణభూతుడవు. దుష్టులను చీల్చి చెండాడు వాడవు. మహారాజవు. ధర్మాన్ని పాలించేవాడవు. రాక్షసులను నిర్మూలించే వాడవు. . 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥