👉🏿 అజరామర సూక్తి 🚩 (ఆది భిక్షవు -శివుడు .)


👉🏿 అజరామర సూక్తి 🚩

(ఆది భిక్షవు -శివుడు .)


💥


గృహం గృహమటన్ భిక్షుః శిక్షతే న తు యాచతే |


అదత్వా మాదృశో మా భూః దత్వా త్వం త్వాదృశో భవ ||


- అజ్ఞాత కవి


👉🏿ఇల్లిల్లూ భిక్షాటనతో యాచించే యాచకుడు ఏమని


సందేశ మిస్తున్నాడంటే ' మీరెప్పుడూ ఇచ్చేవారిగానే ఉండండి,


నా లాగా గ్రహీతగా మారిపోవద్దు.'

🌺


'చేతులకు తొడవు అనగా ఆభరణము దానము' అన్నది ఆర్యోక్తి.


ఇంకొక మాట కూడా వుంది


👉🏿"దరిద్రాయ కృతం దానం శూన్య లింగస్య పూజనం


అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞ సమం విధుః"


💥


👉🏿లేనివానికి ఇచ్చుట,


పూజలేక ఉండిపోయిన లింగమునకు పూజచేయుట ,


తల కొరివి పెట్టె వారసుడు లేని మృతునికి దహన సంస్కారము


చేయుట కోటి యజ్ఞములు చేసిన ఫలము నిస్తుంది అని.


👉🏿అసలు జీవన గమనమునకు ఇచ్చుట పుచ్చుకొనుట రెండు


చక్రాలు. ఇస్తేనే తీసుకొనుటకు అధికారమొస్తుంది.


ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆత్మ అంటే పరమాత్మనే కదా .


మరి పరమాత్మను సంతృప్తి పరిస్తే మనకు ఆనందాన్ని


ఆయన కలిగిస్తాడు. ఈ జీవన సత్య మొకటి గుర్తుంటే ప్రపంచము


సౌఖ్యము సౌభాగ్యముతో నిండిపోదా !


💥


👉🏿నకర్మణా, నప్రజయా, నధనేన, త్యాగైనైకానామృతత్వ


మానసుః- అని వేదవాక్యం!


👉🏿దానంగొప్పది. అది యమృతత్వమునకు దారిచూపును.


👉🏿ఇకభిక్షులవిషయం; వారు చేస్తున్నది భిక్షాటన కాదు.


మనకుపదేశంచేయటమే!


👉🏿యెవరికీ యింత పెట్టక నేనిలాగైనాను మీరు నావలెగావలదు.


నలుగుర కింతబెట్టి మీవలెనే సుఖసంపదలతో నానంగింపుఁడని


యాసందేశము!


చెవిని బెట్టుఁడు;


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!