🌹💥అడవి రాముడు 💥🌹
🌹💥అడవి రాముడు 💥🌹 -ఆడవి రాముడు సినిమా విశేషాలు . 23-04-2017 ఆంధ్ర జ్యోతి .(డా: రెంటాల జయదేవ్ గారు ) 1. బాక్సాఫీస్ రాముడు ఎన్టీయార్ సాధారణంగా ఒక గిరి గీసుకొని, సినిమాలు చేస్తుంటారు. మిగిలిన చాలామంది తారల లాగా ఆయన గనక గిరి దాటి నటిస్తే... ఇక ఆ సినిమా ఒక ప్రభంజనమే! - ప్రసిద్ధ దర్శక - నిర్మాత స్వర్గీయ బి.ఎన. రెడ్డి 1970ల తొలినాళ్ళలో ఎన్టీయార్ మీద ప్రత్యేక సంచిక వేస్తున్న ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అప్పట్లో బి.ఎన్.రెడ్డి ఈ మాటలు అన్నారు. ఆ తరువాత కొన్నేళ్ళకు...ఎన్టీయార్‌కు అయిదున్నర పదుల ఏళ్ళు మీద పడ్డాయి. కెరీర్ జోరుగా సాగుతున్నా... ఎక్కడో చిన్న స్తబ్ధత. నవరసాల్లో ఏదైనా పండించగల అభినయ ప్రతిభ... అపారమైన మాస్ ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఏది ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు? సరిగ్గా అదే టైమ్‌లో కేవలం మూడే సినిమాల అనుభవమున్న ఒక యువ దర్శకుడికి ఎన్టీయార్ సినిమా చేసే అరుదైన ఛాన్స్... ఇంకా చెప్పాలంటే అదృష్టం తలుపు తట్టింది. అంతే... అప్పటికి సరైన హిట్లు కూడా లేని ఆ యువకుడు బోలెడంత హోమ్ వర్క్ చేశాడు. ఒక స్టార్ హీరోక...