🌹🌺 ముళ్ళపూడి వారి అనువాదాలు .🌺🌹

🌹🌺 ముళ్ళపూడి వారి అనువాదాలు .🌺🌹



నా చిన్నప్పుడు ,   నేను చదివిన మొదటి నవల ఆంధ్ర పత్రిక లో సీరియల్ గ వచ్చిన నవల స్కార్లెట్ పింపర్నల్. 

రాబిన్ హుడ్ తరహాలో ఎక్కడ అన్యాయం జరిగినా ఒక అజ్నాత వ్యక్తి వచ్చి కాపాడుతుంటాడు. తన గుర్తుగా scarlet pimparnal పూవు వదలి పెడుతుంటాడు. ఒక అమాయకుడు కూడా ఉంటాడు. పిరికివాడు. నాయకి అతడిని ఆట పట్టిస్తూ ఉంటుంది. నవల చివర్లో ఆ పిరికివాడే అజ్నాత వ్యక్తి అని తెలియడం thrilling గా ఉండేది. కొంచెం పెద్దయ్యాక ఎన్ టి ఆర్ , భానుమతి నటించిన అగ్గి రాముడు సినిమా చూసినపుడు నాకు scarlet pimparnal కధ గుర్తుకు వచ్చింది.


అలాగే Count of Monte Cristo by Alexander Dumas.


ఇంకొక నవల around the world in 80 days by Jules Verne. 80 రోజులలో భూ ప్రదక్షిణ పేరుతో ముళ్ళపూడి వెంకట రమణ గారి అనువాదం.‌ S పార్ధసారధి అన్న మారు పేరుతో. (21-12-1960 to 12-07-1961 ఆంధ్ర సచిత్ర వార పత్రికలలో)


మొన్న 1957 లో వచ్చిన English movie చూసేను. కొంచెం కష్టపడి ముళ్ళపూడి అనువాదపు నవల తెప్పించ గలిగేను, లోగిలి వారి ధర్మమా అని. మరొక రెండు రోజులు కాలక్షేపం.


లండన్ to సూయజ్ 7రోజులు

సూయజ్ to Bombay 13 రో

Bombay to Calcutta 3 days

Kalcutta to hongkong 13 days

Hongkong to Japan 6 days

Japan to sanfransisco 22 days

Sanfrancisco to newyork 7 days

Newyork to London 9 days.


Thrilling finish. చిన్నప్పుడైతే, తూర్పుకు అభిముఖంగా వెళ్ళడం, 360 degrees, 4 minutes gain per degree, net 24 hours gain..vaah.


*********** 

Around the world in 80 days (17-10-1956)


దర్శకుడు : Michael Anderson 

నిర్మాత : Michael Todd


కధ : Jules Verne in 1872


తారాగణం : David Niven as Phileas Fogg, Cantinflas as Passepartout, Shirley MacLaine as Princess Aouda, Robert Newton as Inspector Fix


ఈ సినిమా కధను ముళ్లపూడి వెంకటరమణ గారు ఎన్ పార్ధసారది అనే పేరుతో తర్జుమా చేసిన సీరీయల్ 80 రోజుల్లో భూప్రదక్షిణం గా 1961 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో వచ్చింది. మధ్యలో బాక్స్ ఐటంస్ పెట్టి ఆ సినిమా విశేషాలను చెప్పుకుంటూ వస్తారు.


ఇది కొంచెం సస్పెన్సు, మరికొంత రొమాన్సు కలగలిపిన కధ.


కధంతా 19 వ శతాబ్దం చివరి రోజుల్లో అంటే 1872 లో జరుగుతుంది. అప్పట్లో ఇన్ని ప్రయాణ సదుపాయాలు లేవు కదా. కధలోకి వెడితే అదో పెద్ద పేరున్న క్లబ్. పేరుకు అది రిఫార్మ్ క్లబ్. కానీ ఆ క్లబ్ లోనికి మహిళలను అస్సలు రానియ్యరు.


ఆ క్లబ్బులో ఒక సభ్యుడు Phileas Fogg . ఆ రోజే ఆయన తనకోసం ఓ కొత్త పనివాడిని ఉద్యోగంలోనికి తీసుకున్నాడు. అతని పేరు Passepartout . ఆ సయంత్రం పాగ్ క్లబ్ లోనికి వస్తాడు. అక్కడ అతని స్నేహితులు మరో ముగ్గురు ఉంటారు. ధామస్, శామ్యూల్, జాన్. నలుగురూ కబుర్లలో పడతారు.


థామస్ ఫ్లానగన్, శామ్యూల్ ఫాలెంటిన్, జాన్ సల్లివన్లు, ఫాగ్తో పిచ్చాపాటీలో పడతారు.


ఆ రోజే లండన్ లో ఒక బ్యానులో ఓ దోపిడీ జరిగింది. కబుర్లన్నీ అటువైపు మళ్ళుతాయి. ఆ దోపిడీ దొంగ ఎవరో ఆ డబ్బుతో ప్రపంచంలో ఎక్కడికో చెక్కేసి ఉంటాడని అనుకుంటారు. మాటలు క్రమంగా ప్రపంచాన్ని చుట్టి రావడానికి ఎంత కాలం పడుతుంది అనే విషయం మీదకు వచ్చి చేరతాయి. తానైతే 80 రోజుల్లో భూ ప్రదక్షిణం చేసి రాగలనటాడు ఫాగ్. దాన్ని జాన్ ఒప్పుకోడు. మొత్తానికి పందెం అంటే పందెం అనుకుంటారు. తన యావదాస్తికీ సమానమైన 20 వేల పౌండ్లతో ఫాగ్ పందెం వేస్తాడు. ఆ రోజే బయలు దేరి , సరిగ్గా 80 రోజులనాటికి అదే సమయానికి తిరిగి చేరాలనేది పందెం.


అన్నమాట ప్రకారం ఫాగ్ తన కొత్త నౌకరు పాస్పార్త్ తో కలిసి బయలుదేరుతాడు. లండన్ లోని షేరింగ్ క్రాస్ స్టేషన్ దగ్గర రైలు ఎక్కుతారు. పందెం కట్టి ప్రపంచ యాత్రకు బయలుదేరటం వార్త అవుతుంది. అన్ని పత్రికలూ ఈ వార్తను ప్రచురిస్తాయి.


ఫాగ్ , పాస్పార్త్ లు మొదట సూయజ్ హార్బర్ దగ్గర దిగుతారు. లండన్ లో జరిగిన బ్యాంక్ దోపిడీ గురించి స్కాట్లండ్ యార్డ్ కు చెందిన ఇనస్పెక్టర్ ఫిక్స్ పరిశోధన ఆరంభిస్తాడు. అతనికి ఈ దోపిడీ చేసినవాడు ఫాగ్ అని అనుమానం. కానీ అరెస్టు చేయడానికి తగిన వారెంటు లేకపోవడంతో వారిని ఏమీ చేయలేక, వారికి తెలీకుండా తానూ వారిని వెంబడిస్తుంటాడు.


ఫాగ్, పాస్పార్త్ ఇద్దరూ బొంబాయి చేరుకుంటారు.


బొంబాయినుండి కలకత్తాకు వెళ్ళే దారిలో పట్టాలు పాడవడంతో 12 గంటలు అలహాబాద్ లో ఉండిపోవాల్సి వస్తుంది.


అదే సమయంలో సతీ సహగమనానికి గురవుతున్న ఆయుదా అనే రాకుమారిని రక్షిస్తారు. పాస్పార్త్ వేరే నేరం ఏదో చేసి కలకత్తాలో పోలీసులకు దొరికిపోతాడు. తగిన ఫైను కట్టి పాస్పార్త్ ను ఫాగ్ విడిపించుకుంటాడు.


హాంకాంగ్ వెళ్ళాలని నౌక ఎక్కితే అది తుఫాను కారణంగా 24 గంటలు ఆలస్యంగా హాంకాంగ్ చేరుతుంది. హాంకాంగ్ లో మత్తు మందులు తీసుకున్న నేరానికి పాస్పార్త్ ను పోలీసులు అరెస్టు చేసి ఒక స్టీమర్లో పడేస్తారు. ఈ సంగతి తెలియని ఫాగ్ ఒడ్డు మీద ఉండగానే స్టీమర్ కదిలి వెళ్ళిపోతుంది.


అయితే ఫాగ్ ను ఒక్లహామా మీదుగా శాన్ ఫ్రాన్సిస్కో చేరుస్తా దారిలోనే ఆ స్టీమరున్ ఎక్కిస్తాడు మరో వ్యక్తి.


శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్ వెళ్ళే రైలు మీద రెడ్ ఇండియన్లు దాడి చేస్తారు. ఆ విపత్తునుండి బయట పడి చివరికి న్యూ యార్కు నుంచి లివర్ పూల్ చేరతారు.


ఈ సమయానికి ఇనస్పెక్టర్ ఫిక్స్ చేతికి వారంట్ అందటంతో ఫాగ్ ను ఫిక్స్ అరెస్టు చేయిస్తాడు. ఆ గండం దాటుకుని ఒక హాట్ ఏయిర్ బెలూన్ లో లండన్ చేరుకుంటాడు ఫాగ్.


కానీ అనుకున్న 80 రోజుల గడువు దాటిపోయిందని నిరాశ చెందుతాడు. నిజానికి ఆయన లండన్ నుంచి తన ప్రయాణం ఆరంభించి తూర్పువైపునుంచి పశ్చిమంగా ప్రయాణించడం తో ఆయనకు ఒక రోజు కలసి వస్తుంది. ఆ విషయాన్ని ఫాగ్ గమనించడు. ఫాగ్ వచ్చాడని స్నేహితులు అతడిని అభినందించడానికి వస్తారు. దానితో తాను గడువుకు ఒక రోజు ముందే లండన్ చేరుకున్నాడని గుర్తించడం తో ఫాగ్ సంబరపడి పోతాడు.


పందెం గెలవడంతో పాటు సతీ సహగమనం నుంచి రక్షించిన రాకుమారి ఆయుదాను పెళ్ళి చేసుకుని, రిఫార్మ్ క్లబ్ లోనికి అడుగు పెట్టిన మొదటి మహిళ గా ఆయుద చరిత్ర సృష్టిస్తుంది.


అసలు ఫ్రెంచ్ రచయిత అయిన జ్యూల్స్ వెర్న్ రాసిన అరౌండ్ ద వరల్డ్ నవల మీద మైకేల్ టాడ్ కు ఎప్పటినుంచో దృష్టి ఉంది. 1946 లో Orson Welles చేత (citizen kane నిర్మాత) రేడియో నాటకం గా తీయించారు. ఆ తరువాత 70 ఎం ఎం లో సినిమాగా తీయాలనుకున్నారు. పెద్ద తారాగణం తో భారీ చిత్రాన్ని మొదలు పెట్టారు. ఇదే మొదటి 70 ఎం ఎం సినిమాగా రికార్డుకెక్కింది.


David Niven ను ఫాగ్ పాత్రకు, పాస్పార్త్ పాత్రకు కమేడియన్ గా ఎంతో పేరున్న Cantinflas ను తీసుకున్నారు. ఆ తరువాత Noël Coward ను తీసుకుని ఆయన పేరు చెబుతూ Frank Sinatra వంటి మొత్తం 44 మంది సీఎనియే నటీ నటుల చేత ఏవేవో పాత్రలలో నటింప చేసి సినిమా విలువను పెంచే ప్రయత్నం చేశారు. భారతీయ రాకుమారి ఆయుదా పాత్ర కోసం Shirley MacLaine ను తీసుకున్నారు.


1955 లో షూటింగ్ మొదలయ్యింది. మొత్తం 13 దేశాల్లో, సుమారు 70 వేలమంది చిన్నా పెద్దా ఆర్టిస్టులతో, 8 వేల జంతువులతో తీసేరు. 1955 డిసెంబరుకు సినిమా పూర్తి అయింది.


ప్రపంచం మొత్తం మీద 70 ఎం ఎం లో తీసిన తొలి చిత్రం ఇదే. పారిస్ లో పోలీసుల బెడద ఎక్కువ కావడం తో కూరగాయల బుట్టలో కెమెరా పెట్టి అక్కడివారికి తెలియకుండా షూటింగ్ తీసారు. మొదట అనుకున్న 30 లక్షల దాలర్ల బద్ఝెట్ కు రెట్టింపు ఖర్చు అయ్యింది. అయితేనేం టాడ్ గొప్ప సినిమా తీసారనే పేరు వచ్చింది. 10 రెట్ల ఆదాయం వచ్చింది.


కానీ సినిమా విడుదలైన కొన్నాళ్ళకే ఒక విమాన ప్రమాదంలో మైకేల్ టాడ్ మరణించారు. అతని భార్య ప్రముఖ నటి ఎలిజబేత్ టేలర్ ఆ తర్వాత ఈ సినిమాకు రెండు పాటలు పాడిన Edwin John Fisher ను వివాహమాడారు.


అరౌండ్ ద వర్ల్డ్ చిత్రానికి కాసులతో పాటు , ఉత్తమ చిత్రం మొదలైన 6 ఆస్కార్ అవార్డులు లభించాయి.


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!