🚩 వేమన్న వేదం🌹🌹
🚩 వేమన్న వేదం🌹🌹 👉🏿🙏🏿🙏🏿 *సుగుణవంతురాలు సుదతియై యుండిన బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప స్వర్గమేటికయ్య సంసారి కింకను విశ్వదాభిరామ వినుర వేమ!* 👉🏿 భార్య అనుకూలవతి అయితే, కొడుకులు గుణవంతులైతే ఇంటిని మించిన స్వర్గం లేదు. సంసారాన్ని మించిన చక్కని యోగం మరొకటి లేదు. మన వేదాంతులు మంత్రయోగం, హఠయోగం, రాజయోగం, లయయోగం అనే నాలుగు యోగాలను చెప్పారు. వీటికి భిన్నమైన సంసారయోగాన్ని వేమన్నగారు బోధిస్తున్నారు. 👉🏿 “వెతలు దీర్చువాడు వేదాంతవేద్యుండు రతుల నేలువాడు రమణుడగును సతిని బెనగువాడు సంసార యోగిరా!” అని నిర్వచించారు. ఈ యోగం ముందు మిగతావి దిగదుడుపే; నిష్ప్రయోజనాలే !! యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులనే హఠయోగ సాధనాలలో, యమ నియమాలను తప్ప మిగతా వాటిని కసరత్తుగానే వేమన్నగారు భావించారు. “ఆసనము పన్ని అంగంబు బిగియించి యొడలు విరుచుకోనేడు యోగమెల్ల జెట్టిసాము కన్నా చింతాకు తక్కువ” అని నిస్సంకోచంగా నిందించారు. యోగులమని చెప్పుకొనే వాళ్ళలో సైతం భోగలాలసత్వం కనబడుతుందని చెబుతూ - “వేషభాష లెరి...