🚩 కళాపూర్ణోదయం -8: మణిహారం.!🚩
🚩( జరిగిన కథ :-రెండు నెలల పాప మధురలాలస ఆశ్చర్యం కొలిపేటట్టు కళాపూర్ణుడి పుట్టుక వెనక వున్న జన్మజన్మల కథల్నీ వినిపిస్తోంది. అప్పుడు అలఘువ్రతుడితో అక్కడ వున్న నలుగురు పురోహితులూ అతని కొడుకులేనని చెప్తుంది. అతను నమ్మలేకపోతాడు. బట్టతలకీ మోకాలికీ ముడిపెట్టగలిగే ఈ కతలతల్లి అదెలా సాధ్యం చేస్తుందోనని ఆశ్చర్యపడతాడు. ఇక చదవండి.) 🚩 అలఘువ్రతుడి మాటలకు నవ్వుతూ, “అలా జరగటం తప్పదు” అన్నాడు కళాపూర్ణుడు. ఆ పాపని చూసి, “ఇతని పుట్టుపూర్వోత్తరాలు, ఇతనికి ప్రథమాగమాదులు ఎలా కొడుకులో మాకందరికీ వివరంగా చెప్పమ”ని అడిగాడు. “అలాగే!” అని ఆ పాప ఇలా చెప్పింది పాండ్యదేశంలో సోమశర్మ అనే అతను వుండేవాడు. అతని కొడుకు యజ్ఞశర్మ. ఎంత కష్టపడ్డా అతనికి వేదవిద్యలు ఒక్కముక్క ఒంటపట్టలేదని అతను బాధపడుతుంటే, అది మరిపించటానికి అతని తండ్రి నలుగురు గుణవతుల్ని తెచ్చి అతనికి పెళ్ళిచేశాడు. కోడళ్ళందరికీ ఎన్నో ఆభరణాలు, చీరలు, కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చాడు. చివరి దశలో అతను కొడుకుని పిలిచి, కోడళ్ళకు వినపడేట్టు చెప్పాడు “మన వంశాచారం అన్నదానం. ఎలాటి పరిస్థితుల్లోనైనా దాన్ని ఆపకుండా నడుపు. దాని వల్ల నీకు నాలుగు వేదాల వంటి కొడుకులు క...