🚩 అంతా భ్రాంతియేనా! ....పార్వతికి నిరాశేనా? 💦
🚩 అంతా భ్రాంతియేనా! ....పార్వతికి నిరాశేనా? 💦 దేవదాసు పార్వతికి అన్యాయం చేశాడు. అందుకు దేవదాసుని నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవదాసుకి అసలు న్యాయం చెయ్యటం రాదు. తనకేం కావాలో దేవదాసుకే పెద్దగా ఐడియా ఉన్నట్లు తోచదు. పక్కింట్లో ఉంది, చూడ్డానికి బాగుంది, తను చెప్పినట్టల్లా వింటుందని పార్వతిని ఇష్టపడిపొయ్యాడు. ఇక్కడదాకా బానే ఉంది. . దేవదాసుకి వాస్తవిక దృక్పధం ఉన్నట్లు అనిపించదు. తనకన్నా తక్కువ స్టేటస్ పిల్లని పెళ్లి చేసుకోడానికి తండ్రి ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నాడు! పోనీ తండ్రిని ఎదిరించగల ధైర్యమన్నా ఉందా అంటే.. అదీ లేదాయె! డబ్బున్న కొంపలో పుట్టాడు. అల్లరిచిల్లరగా తిరిగాడు. సుఖవంతమైన జీవితం. ఈ బాపతు కుర్రాళ్ళకి బుర్ర తక్కువేమో! . ఇంత పిరికివాడూ.. పార్వతి దగ్గర అధార్టీ చెలాయిస్తుంటాడు. కోపం వచ్చి పార్వతి నుదుటిపై గాయం చేసిన అహంభావి. తండ్రి జమీందారు కావున భయం. పార్వతి పల్లెటూరి పేదరాలు కావున తేలిక భావం. కళ్ళముందు కనిపిస్తున్న కోహినూర్ వజ్రాన్ని కాలదన్నుకున్న అజ్ఞాని. . తప్పుల మీద తప్పులు చేసి.. బాధ మరచిపోవడానికి హాయిగా తాగ