Posts

Showing posts from April, 2020

🚩మన విద్యా వ్యవస్థపై కరోనా ప్రభావం.!

Image
🚩మన విద్యా వ్యవస్థపై కరోనా ప్రభావం.! నేను నా ఐఐటి ట్యూషన్ తరగతులను ప్రారంభించాలి ..ఫేస్ బుక్ ద్వారా. నేను త్రివేండ్రం & బెంగళూరులో మ్యాథ్స్ & ఫిజిక్స్ కోసం తరగతులు భోధించాను నా 38 ఏళ్లలో నేను వేలాది మంది విద్యార్థులకు భోధించాను ... వారిలో చాలామంది యుఎస్ లో ఉన్నారు. .కొందరు ఇక్కడ I AS ఆఫీసర్స్ గా వున్నారు. త్రివేండ్రం వద్ద నేను ఐఐటి అప్పారావ్ అని పిలువబడ్డాను ఇప్పుడు మీరు నన్ను ఫేస్ బుక్ అప్పారావ్ అని పిలుస్తున్నారు. కరోనా తరువాత మన విద్యావ్యవస్థను మార్చాలి. ఇక నారాయణ .. విజ్ఞాన్ లాటి కార్పొరేట్ సంస్థలు తగ్గు తాయి. క్లాస్ వందల కొద్దీ విద్యార్థులను కుక్కడం పోవాలి .. మళ్ళీ ఒకరి నుండి ఒకరికి లేక ఆన్ లైన్ తరగతులు వస్తాయి. రిటైర్డ్ ఉపాధ్యాయులందరూఆన్ లైన్ కోచింగ్ తీసుకోవాలి. కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను మనం కోరుకోము. ప్రాథమిక సాధారణ నైపుణ్యాలు నేర్పించాలి. తప్పదు మన సిలబస్ ను కాటేసింది కరోనా !!

🚩అశ్వత్థామకు చిరంజీవిత్వం ఎలా వచ్చింది?

Image
🚩అశ్వత్థామకు చిరంజీవిత్వం ఎలా వచ్చింది? నిద్రిస్తున్న ఉప పాండవులను చంపినందుకు అతను శిక్ష అనుభవించాలి కదా? పైగా ఇప్పుడు చాలామంది తమ పిల్లలకు ఆ పేరు పెట్టుకుంటున్నారు. ఇదంతా ఎంతవరకూ సబబు? 🔻 చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు అండి. కానీ ఇంత పెద్ద సమాధానం రాస్తున్నందుకు క్షమించండి. అశ్వత్థామ అంటే అశ్వము(గుఱ్ఱము వంటి) సామర్థ్యం కలవాడు అని అర్థం. అయితే ముందుగా ఒక మాట. మహాభారతం లో ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగినప్పుడు ద్రౌపది సభలోనున్న పెద్దలందరినీ నిలదీస్తుంది అలాగే - భీష్మాచార్యుల వారిని అడుగుతుంది " ధర్మానికి ప్రతి రూపమయిన మీరు కూడా ఈ అధర్మాన్ని ఖండించి ఒక మానవతి శీలం కాపాడలేరా? పట్టమహిషిని బానిసని చేసి వివస్త్ర ని చేయటం ఏ ధర్మ శాస్త్రం సమర్థిస్తుంది?నాకు అన్యాయం జరగవలసిందేనా?" అని పలు రకాల ప్రశ్నలతో నిలదీస్తుంది. తల్లడిల్లిపోతున్న భీష్ముడు " చూడమ్మా ధర్మం చాలా సూక్ష్మమయినది.. ఒక సందర్భం లో ధర్మం అయినది వేరొక సందర్భం లో అధర్మం అవుతుంది, ఒక సందర్భం లో అధర్మం అయినది వేరొక సందర్భం లో ధర్మం అవుతుంది. ఈ ధర్మ సూక్ష్మములని వివరించటం బ్రహ్మ తరమూ కాదూ, బ్రహ్మ జ్ఞ...

🚩గుండమ్మ కథ- విమర్శలు - స్పందనలు .🌹

Image
🚩గుండమ్మ కథ- విమర్శలు - స్పందనలు .🌹 ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ విమర్శలు! సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయం ఉందనగానే, ఎల్వీ ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్ళివేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్-విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని, జమున పాత్ర చిత్రణ సరిగా లేదని మరికొందరు విమర్శించారు. చివరికి విజయా వారి నిర్మాణంలో మాయాబజార్ సహా పలు చిత్రాలు తీసిన దర్శకుడు కె.వి.రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు. ప్రివ్యూ తర్వాత నరసరాజుకు తన అభిప్రాయాన్ని చెప్తూ-"అదేం కథండీ! కృష్ణా, గుంటూరు జిల్లాల సంపన్న వర్గాల కథలా వుంది. చక్రపాణి గారే రాయగలరు అలాంటి కథలు. మీరు రాసిన డైలాగులు బాగున్నాయనుకోండి. ఒక్క డైలాగులతోనే పిక్చర్ నడుస్తూందా" అన్నారు. సినిమా విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నప్పుడు- విజయా వారి సినిమా, పెద్ద నటీనటులు నటించారు. మొదట్లో హౌస్ ఫుల్ అవుతాయి. పోగాపోగా చూద్దాం అనేవారు. సినిమా ఘన వి...

🚩అమరావతి కథలు -సత్యం శంకర మంచి.🌹 (1 నుండి 5 వరకు.)

Image
🚩అమరావతి కథలు -సత్యం శంకర మంచి.🌹 (1 నుండి 5 వరకు.) 1.వరద. ముఖ్య పాత్రలు-శాస్త్రిగారు, మాల సంగడు బాపు బొమ్మ-శాస్త్రిగారు చెయ్యి చాచటం, మాల సంగడు నెయ్యి వేస్తూండటం కథ: అమరావతిలో వరద వచ్చి అందరూ వీధిన పడిన సమయాన సమష్టి భోజనాలు కులాతీతంగా అందరూ కలసి వండుకుంటారు. వడ్డన సమయంలో, మాల సంగడు శాస్త్రిగారికి నెయ్యి వడ్డించటానికి సందేహిస్తే, శాస్త్రిగారే సంగణ్ణి పిలిచి " ఒరే సంగా! నీకు ఆకలేస్తుంది, నాకూ ఆకలేస్తుంది. ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపొదురా....వెయ్యరా" అని సంగడి చేత నెయ్యి వేయించుకుంటాడు. "వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే నాకు నమ్మకం లేదు! స్నానం చేసిన వొంటికి తెల్లారేప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లొ మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది" అన్న రచయిత ముక్తాయింపుతో కథ ముగుస్తుంది 2.సుడిగుండంలొ ముక్కుపుడక! ముఖ్య పాత్రలు ఎలికలాళ్ళు బాచిగాడు, సింగి; భూస్వామి భూమయ్య, అతని భార్య సూర్యకాంతం బాపు బొమ్మ- నీటి వలయాలు, అందులో సింగి చేతులో బిడ్డతో నుంచుని, బాచిగాడు ప...

🔻ఊర్మిళాదేవి కథ 🔻

Image
🔻ఊర్మిళాదేవి కథ 🔻 🚩రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి. ’14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే… ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,’ అని ఎవరో గుర్తుచేశారు. ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ”14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు. నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిదని తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,’ అని అడిగారు. ”మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,” అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక ఏడు రోజుల...

🍂☘️🚩కె. జె. ఏసుదాసు🚩☘️🍂

Image
🍂☘️🚩కె. జె. ఏసుదాసు🚩☘️🍂 కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ (జ. జనవరి 10, 1940) భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. అతను భారతీయ శాస్త్రీయ, భక్తి, సినిమా పాటలు పాడాడు. అతను తన ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేల పాటలను పాడాడు. అతనిని గాన గంధర్వన్ గా కూడా పిలుస్తారు. అతను అత్యంత బహుముఖ, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ గా పరిగణించబడ్డాడు. అతను భారతీయ భాషలలో పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప అన్ని భారతీయ భాషలలో కూడా పాటలు పాడాడు. అతను 1970, 1980 లలో అనేక మలయాళ చలనచిత్ర పాటలను కూడా కూర్చాడు. అతను ఉత్తమ పురుష నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారాలను ఎనిమిది సార్లు, దక్షిణాది పిలిం ఫేర్ పురస్కారాలను ఐదు సార్లు, ఉత్తమ నేపథ్య గాయకునిగా రాష్ట్ర పురస్కారాన్ని నలభై మూడు సార్లు అందుకున్నాడు. రాష్ట్ర పురస్కారాలను అందించే ప్రభుత్వాలలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగల్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అతను 1975లో పద్...