Posts

Showing posts from March, 2021

హిందు ధర్మం

Image
హిందు ధర్మం  మహా రాణా ప్రతాప్ గురించి మనకేవ్వరికి తెలియదు. కానీ ఒక్క సారి చదవండి. ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. విచిత్రంగా ప్రపంచంలోనే అత్యంత బలశాలి అయిన అమెరికా మెడలు వంచింది ఈ చిన్ని దేశం. ఈ రెండు దేశాల నడుమ కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆఖరికి అమెరికాని ఓడించింది వియత్నాం. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడిని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు. విలేకరి: ఇప్పటికీ అర్ధం కాని విషయమేమిటంటే,అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలవగలిగారు.? విలేకరి అడిగిన ఆ ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు ఇచ్చిన సమాధానం… ” అన్ని దేశాలలోకెల్ల అత్యంత శక్తివంతం అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు, శ్రేష్టుడు అయిన గొప్ప దేశభక్తిగల ఒక భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని వీరోచితగాథల నుండి, అతని జీవితం నుండి ప్రేరణ పొంది యుద్దనీతి ,ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్దంలో గెలిచాము. విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు? విలేఖరి ఇలా అడగగానే వియత్నాం అద్యక్షుడు వెంటనే నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు. ” అతడే… రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్” మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పేటప్పుడు అతని ...

🌼🌿దక్షిణ కైలాసం... శ్రీ కాళహస్తి!🌼🌿

Image
🌼🌿దక్షిణ కైలాసం... శ్రీ కాళహస్తి!🌼🌿  ఎన్నో క్షేత్రాలను దక్షిణ కాశీగా పిలుస్తున్నా దక్షిణ కైలాసంగా పేరుగాంచింది మాత్రం ఒక్క శ్రీకాళహస్తీశ్వరాలయమే. పంచభూత లింగాలలో ఒకటైన వాయు లింగం కొలువై ఉన్న ఈ ఆలయంలో అడుగు పెట్టినంతనే భక్తులకు ముక్తి లభిస్తుందంటారు. అంతేకాదు, సర్పదోష, రాహుకేతు గ్రహ దోష నివారణలకు దేశంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రమిది. న మఃశివాయలో... ‘న’ అంటే నభము (ఆకాశం), ‘మ’ మరుత్ (వాయువు), ‘శి’ శిఖి (అగ్ని), ‘వా’ వారి (జలం), ‘య’ అంటే యజ్ఞం (భూమి). ఈ అయిదింటికీ ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వపాపాలూ హరించిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాంటి పంచ భూతాత్మకుడైన పరమశివుడు వాయులింగం రూపంలో ఉద్భవించిన క్షేత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని కాళహస్తిలో ఉన్న శ్రీ కాళహస్తీశ్వరాలయం. మిగిలిన నాలుగూ ఫృథ్వీలింగం (కాంచీపురం), జలలింగం (జంబుకేశ్వరం), అగ్నిలింగం (తిరువణ్నామలై), ఆకాశలింగం (చిదంబరం) తమిళనాడులో ఉన్నాయి. కాళహస్తీశ్వరుడు వాయు లింగం రూపంలో ఉన్నాడనడానికి ప్రతీకగా గర్భాలయంలో లింగం పక్కన ఉన్న రెండు దీపాల్లో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంట...