కన్యాశుల్కం
- 🌹🔻 1955 లో 22 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అవి మిస్సమ్మ, రేచుక్క, చెరపకురా చెడేవు, కన్యాశుల్కం, జయసింహ, సంతోషం , అర్ధాంగి, రోజులు మారాయి, అనార్కలి, సంతానం, వదిన, దొంగ రాముడు, శ్రీ జగన్నాధ మహాత్మ్యం, బంగారు పాప, బీదల ఆస్థి, ఆడ బిడ్డ, వదినగారి గాజులు, అంతే కావాలి, విజయ గౌరి, కన్యాదానం, శ్రీ కృష్ణ తులాభారం, పసుపు కుంకుమ. అభినవ ఆంధ్ర సాహితీ వైతాళికుడు, తెలుగు కథకు ఆద్యుడు గురజాడ అప్పారావు గారు (21-09-1862 & 30-11-1915)పూర్తిస్థాయి వాడుక భాషలో రాసిన తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’. ప్రపంచ నాటకాల్లో కన్యాశుల్కానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. ఒక సమకాలీన సాంఘిక సమస్యను తీసుకొని, సభ్యసమాజంలో ఎదురయ్యే సామాన్య జనం నుండి పాత్రలను తీసుకొని రాసిన నాటకమిది. ఇందులో ప్రతి పాత్ర తనదంటూ ఒక మరుపురాని హాస్యభరిత కావ్యాన్ని ఆవిష్కరించింది. బాల్యవివాహాలు, కన్యాశుల్కము వంటి సాంఘిక దురాచారాలు, హేయమైన మానవ నైజాల వంటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన నాటకం ‘కన్యాశుల్కము’. ఇంగ్లిషు, ఫ్రెంచి, రష్యన్, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో అనువాదానికి నోచుకున్న కన్యాశుల్కము, వి