🚩🚩 మా సినిమాలు.........బాపు గారి మాటలలో ...
♦’సీతమ్మ పెళ్ళి’ తర్వాత తీసిన ’బుల్లెట్’ తుస్సుమంది.
♦“కళ్యాణ తాంబూలం” పండలేదు. కానీ ఊటీలో తీసిన కొన్ని దృశ్యాలు చూసి ఒక ఎన్నారై ఇవి ఏ దేశంలో తీశారు అని అడిగారు. బయట మేం చేసిన సినిమాల్లో హరికృష్ణ గారు అన్ని విధాలా గొప్ప నిర్మాత.
♦ ’పెళ్ళిపుస్తకం’. రావి కొండలరావు గారు మిస్సమ్మ కథ తిరగేసి ఇచ్చారు. నంది అవార్డే కాక జనం కూడా రివార్డిచ్చారు. చాలా గొప్ప నటుడు రాజేంద్రప్రసాద్ – కొత్తనటి దివ్యవాణి.
♦కొంతభాగం మా మిత్రులు NCL రాజుగారి తోటలో తీశాం. రమణగారు అక్కడ చక్రాలు లేని రైలుపెట్టి ఉండడం చూసి గుమ్మడిగారి పాత్రకి చక్కని సీను రాశారు. సినిమాలో “అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటరు” అన్న డైలాగు చాలా ఇష్టం.
♦ఆరుద్రగారి “శ్రీరస్తు శుభమస్తు” పాట షూటింగుకి మా ఆర్టువారు కళ్యాణమండపం అద్దె, డెకొరేషన్సు, జూనియర్సు, వార కాస్ట్యూమ్సు లెక్కేసి పొడుగాటి జాబితా తెచ్చారు. వద్దనుకుని ఓ తమాషా చేశాం. ఓ గదిలో నాలుగిటుకలూ పుల్లలూ, కాస్తమంట, ముగ్గులు, నాలుగు అరటి పిలకలు, నాలుగు మామిడి రెమ్మలు, ఓ కొబ్బరి బొండాం, మంగళ సూత్రం, పుపు కలిపిన బియ్యం ఓ పళ్ళెం, రెండు కర్రలకి పూలదండలు అమర్చుకుని Tight Close shots తో ఓ పూటలో పాట ముగించేశాం. హీరో హీరోయిన్లు తప్ప జూనియర్సు లేరు. అక్షింతల వేసన చేతులు కూడా మా యూనిట్ వాళ్లవే!
♦క్లైమాక్సు రాసుకుని రమణగారు పద్మాలయ స్టూడియోస్ లో పెద్ద ఫ్లోరు బుక్ చేశారు. వేరే షూటింగులో ఉన్న సమయంలో క్రాంతి కుమార్ గారు ‘’సీతారామయ్య గారి మనుమరాలు’ (What a picture!) కి రెండు నెలలు అదే ఫ్లోర్ అడిగారని తెలిసింది. పద్మాలయ హనుమంతరావుగారు “చూస్తే ఇది పెద్ద గిరాకీ – కానీ రమణ గారికి మాటిచ్చాశానే” అని ఇరకాటంలో పడ్డారని తెలిసింది. రమణగారు వెంటనే తనంతటతనే ఆ ఫ్లోరు అక్కరలేదని కబురు చేసి NCL రాజు గారి తోటలో చక్రాలు లేని రైలు పెట్టి కీ పాయింటుగా పెట్టుకుని ….అంతా తిరగరాసి షూటింగు పూర్తి చేశారు.
❤1992 లో యన్.టి.రామారావు గారు పిలిచి ‘లవకుశ ‘ తీద్దామన్నారు. ‘మీకు మీరే పోటీ అవుతారు. పైగా పుల్లయ్యగారి లవకుశని మించి తీయడం అసాధ్యం’ అన్నాము.
❤ శ్రీనాధకవి జీవితం తీయమన్నారు. “శ్రీనాధుడు దివ్యంగా భోగాలనుభవించి చివరి రోజుల్లో చితికిపోయాడు.
తోటరాముడు రాజైతే జనం చూస్తారు గానీ వుల్టా అయితే రిస్కు కదా” అని రమణగారన్నా కూడా – యన్.టి.ఆర్. లాభనష్టాలు నాకక్కరలేదు. ఆ పాత్ర నటించాలనుంది అంతే అన్నారు. కొంచెం వయసు కనిపించినా అనితరసాధ్యంగా పోషించారు.
❤ ప్రీవ్యూ వేసినప్పుడు కవిత వాసన ఎరగని ఒక ఇల్లాలు
“ఆ రోజులు అంత వైభవంగా వుండేవన్న మాట” అన్నారు
. కానీ సినిమా రిలీజయితే బాగుందా లేదా అని చూడ్డానికి కూడా జనం రాలేదు. యన్.టి.ఆర్ గారికి మాత్రం నచ్చింది. కౌగిలించుకుని భిజం తట్టారు. “కమర్షియల్ గా …అంత బా…” అని నసిగితే “అది మనకనవసరం బ్రదర్” అన్నారు.
❤రాముణ్ణి నమ్ముకుంటే అందరికీ మంచే జరుగుతుంది.
ఇరవై ఏళ్ళ క్రితం తీసిన ఆయన కథ “సంపూర్ణ రామాయణం” వట్టిపోని పాడి ఆవు. అయిదేళ్ళకోసారి అమ్మి లాభం పొందేవాళ్ళం.
❤ఆ మధ్య మా పార్ట్నర్స్ లో ఒకరు మాకు చెప్పకుండా రామాయణం సినిమాని మరో అయిదేళ్ళకి అమ్మేసి జేబులో వేసుకున్నాడు. రమణగారు ఆయన్ని నిలేస్తే – “అవును. తిన్నాను. ఏం జేస్తావ్? కోర్టుకెడితే వెళ్ళు. సివిలు కేసు హియరింగు కొచ్చేసరికి నువ్వైనా వుండవు. నేనైనా వుండను. ఈ లోగా మరిన్ని మాట్లు అమ్ముకుంటాను” అని హామీ ఇచ్చారు. అంటే – రాముడు పాపం ఆయనకు అవసరమైన సొమ్ము జతపరిచాడు. మాకు కోర్టు వ్యవహారాల గురించి జ్ఞానమూ ప్రసాదించాడు.
❤1993లో నాకిష్టమయిన ‘మిస్టర్ పెళ్ళాం’ తీశాం
. నా అభిమాన దర్శకుడు విశ్వనాథ గారు ” ఆ రాజేంద్రప్రసాద్
బాగా చేస్తాడండీ” అని మెచ్చుకున్న సినిమా.
బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డు, నేషనల్ అవార్డు కూడా వచ్చాయి.
❤ఆమనికి ఉత్తమ నటి అవార్డు వచ్చింది. నంది అవార్డుల ఫంక్షన్ కి వచ్చినపుడు గౌని మోద్రన్ హైర్ స్టైల్ లిప్ స్టిక్లతో వచ్చిన ఆమెని చూసి జ్యూరీలో ఒకరైన వాణిశ్రీ గారు – నువ్వు తెలుగు ఇల్లాలిగా వేషం పండించావని అవార్డి ఇస్తే ఇదేం వేషం తల్లీ” అని మందలించింది.
దీంట్లో ముఖ్యాంశం స్త్రీని కూడా పురుషులు తమతో సమానంగా చూడాలి అని. చివర బుద్ధి తెచ్చుకుని మొగాళ్ళందరూ వంగి పెళ్లాల కాళ్ళు పట్టుకుని కళ్ళకద్దుకుని – లాగేస్తారు. శిష్యా – ఇది అనంతం అంటూ.
❤ఆ తరవాత ‘రాంబంటు’. జీతం కూడా దక్కలేదు.
❤దేవుడు మేలు చేసి ఇప్పటి దాకా లాస్టుది ‘రాధా గోపాళం’ . మొగుడూ పెళ్ళాం సమానం కానీ మొగుడు కాస్త ఎక్కువ సమానం అన్నది ఇతివృత్తం – చాలా సరదా అయిన సినిమా. సరదాగా ఉండే శృంగారం ముగుడూ పెళ్ళాల మధ్యే అయినా పిల్లలున్న బ్రహ్మచారులు కొందరు కోప్పడ్డారు.
❤అవండీ 75 సంవత్సరాల తెలుగు చిత్ర యజ్ఞంలో మేము వ్రేల్చిన సమిధలు.
‘మేము ‘ అంటే …..
ఓ జమీందారీ గ్రామంలో ఓ రైతుకి ఒకే ఆవుండేదిట. నీదగ్గర పాడి ఎంత అని అడిగితే దొరగారివీ నావీ కలిపి వందా అనేవాట్ట. ‘మేమూ అంటే 99 ఆవులూ రమణ గారివి.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఎంత బాగా చెప్పారు బాపు!
ReplyDeleteHe is so modest!