Posts

Showing posts from 2022

🌹🌹🌹🌹దొందూదొందే - సామెతకథ 🌹🌹🌹🌹

Image
🌹🌹🌹🌹దొందూదొందే - సామెతకథ 🌹🌹🌹🌹 ——————————//——————————— అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక నత్తి వాడుండేవాడు. అతన్ని అందరూ ఎగతాళి చేసేవారు. నత్తి కారణంగా అతనికి పెళ్ళి కాకుండా వుంది. చివరికి అతని తల్లితండ్రులు చాలా దూరంలో వున్న ఒక ఊరిలో అమ్మాయిని చూసి ఆ అమ్మాయితో తమ అబ్బాయికి పెళ్ళి చేశారు. పెళ్ళి జరుగుతున్నంతసేపూ ఇద్దరూ మాట్లాడకుండా కూచున్నారు. సిగ్గుపడుతున్నారని అందరూ అనుకున్నారు. 🌈 పెళ్ళి తంతు అంతా పూర్తి అయిన తర్వాత అబ్బాయినీ, అమ్మాయినీ పల్లకీలో ఎక్కించి అబ్బాయి ఊరికి పంపించారు. దారిలో వారికి పూచిన చింతచెట్ల వరస కనిపించింది. 👉నత్తివాడు సంతోషం పట్టలేక “ తింతలు తూతాయి” (చింతలు పూశాయి )అన్నాడట. 👉అది విని అమ్మాయి “ తూతే తెట్టు తుయ్యదా తాతే తెట్టు తాయదా “ (పూసే చెట్టు పుయ్యదా , కాసే చెట్టు కాయదా ) అన్నదట. 👉వారి వెనక వస్తున్నపురోహితుడు “ దొందూ దొందే “ (రెండూ రెండే) అని అన్నాడట. ఆ ముగ్గురు నత్తివాళ్ళను చూసి పల్లకీ బోయీలు నవ్వుకున్నారట..... అలాఅలా దొందూ దొందే అనే సామెత వాడుక లోనికి వచ్చింది........ 🌹🌹🌹🌹🌹————🌹🌹🌹——-🌹🌹🌹🌹

🔻మధ్య తరగతి మనో "గతం"

Image
  ( ఎవరో ఈల వేసి పిలిచినట్టు సెల్ ఫోను  మోగగానేఆయనకేసి చూశాను జాపుకున్న కాళ్ళకి పతంజలి నూని రాసుకుంటూ...  "పార్వతీ ! నీ కొడుకు నీ అకౌంటకి 2000 డాలర్లు పంపాడట ,  వ్వాట్సాప్ లో చెబుతున్నాడు" అన్నారు  మావారు శంకర ప్రసాదు గారు.  "డాలర్లలో చెప్పకండి, నాకర్ధమయ్యేట్టు రూపాయల్లో చెప్పండి" అన్నాను విసుగ్గా.  "2000 ని 74 తో గుణించు... రూపాయల్లో వస్తుంది " అన్నారు విద్యార్థికి లెక్క ఇస్తున్నట్టుగా  "ఆ గుణకారాలేవో  మీరే చెయ్యండి, లెక్కల మాష్టారు కదా ?" అన్నాను తెలివిగా . "లక్షా నలభై ఎనిమిది వేలవుతుంది" అని చెప్పేసి వ్వాట్సాప్ లోకి దూరిపోయారు యధాలాపంగా.  🚩 చెప్పొద్దూ... అమెరికా వెళ్ళినప్పుడల్లా ఏ మాల్ కి వెళ్లినా ధరలు చూసి వెంటనే 70 తో గుడించేదాన్ని,  నాకు ఏడో ఏకం బాగానే వచ్చు . రూపాయిల్లోకి మార్చాక గుండె గుభేల్మనేది . "ఇక్కడ రూపాయల్లో ఆలోచించ కూడదమ్మా" అనేవారు పిల్లలు. పుట్టుకతో వచ్చింది ఊరికినే పోతుందా ? 🚩 కరివేపాకు కట్ట 70 రూపాయలట ! అందుకే.. కూరల్లో,చారులో కొంచం తగ్గించే వేసేదాన్ని. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా ... ఎందుకో పాత జ్ఞాపకాలు వస్