Posts

బుడుగు ఆలోచనలు, అయోమయం.!

Image
బుడుగు ఆలోచనలు, అయోమయం.! . నా అంతవాడు నేను. నన్ను ఎవరూ కొట్టకూడదు. నేను నిఝంగా పెద్దవాడినే అనుకో. ఐతే వాళ్ళే నన్ను కుర్రకుంకా అంటారుగా. అందుకని కొట్టకూడదు. . సిగరెట్లు తెల్లగా ఉంటాయిలే. వీటిని బాబాయిలాంటి కుర్రవాళ్ళు కాలుస్తారు. .. మరి నేను పెద్దవాడినిగా. అందుకనే కాలవను. నేను ఇంఖా పెద్దవాణ్ణయ్యాకా జెటకా బండియేనా రైలింజనేనా తోలుతానుగా. అందుకని బీడీలు దాస్తాననుకో. అప్పుడు చెవులో పెట్టుకోవాలిగా. బీడీలు బామ్మ వత్తుల పెట్టెలో దాస్తే భద్రంగా ఉంటాయి... . అగరొత్తులు నల్లగా ఉంటాయి. వాటిని గోడమీద గుచ్చి కాలుస్తారు. సిగరెట్లేమో నోట్లో గుచ్చి కాలుస్తారు. ధైర్యం అంటే పోలీసుతో మాట్లాడ్డం. ధైర్యం అంటే సుబ్బలష్మితో మాట్లాడ్డం అని కూడా అర్ధం అట. ఇలా అని బాబాయి చెప్పాడు .. డికేష్టివురావు అంటే నాకు తెలీదు. బాబాయికీ తెలీదు. వాడికి కూడా తెలీదట. డికెష్టివురావుకు పెద్ద మీసాలున్నాయి. డికెష్టింగ్ చేసేప్పుడు అవి పెట్టుకోవాలట. అప్పుడు టుపాకీ కూడా పట్టుకోవాలట. బళ్ళోకెళ్ళకుండా ఉండాలంటే చొక్కా ఇప్పేసి ముందుగా ఎండలో నించోవాలి. అప్పుడు వీపుమీద పొట్టమీద జొరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేఠుకుని అమ...

తనికెళ్ళ భరణి మాటల్లో -భానుమతి.!

Image
తనికెళ్ళ భరణి మాటల్లో -భానుమతి ఆమెకూ సినిమాకూ 70 ఏళ్ల అనుబంధం..! చిన్న వయసులోనే వెండితెరపై వెలిగిపోయిందామె. నటన, గాత్రం, రచన, దర్శకత్వం.. సినిమా నిర్మాణం.. ఇలా ఒక్క రంగం కాదు.. ఒక విభాగమని కాదు.. ఆమె అడుగుపెట్టిన ప్రతిచోటా తనకంటూ ఓ ముద్ర వేసుకుంది. తెలుగునాటే కాదు.. తమిళనాడులోనూ ఆదరణ పొందింది. ఓ మధ్యతరగతి మహిళ ఇన్ని రంగాల్లో విజయబావుటాలు రెపరెపలాడించిందంటే ఎంత ధైర్యం కావాలి. ఎంత తెగువ కావాలి.. ఎన్ని కష్టాలకోర్చాలి.? అందుకే ఓ సందర్భంలో ఆమె నాకు రాళ్లూపూలూ రెండూ కొత్త కాదని గట్టిగా చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించిన నటి… ధీశాలి భానుమతి. తెలుగు చిత్రసీమ భాగ్యమతి! ఆమె బహుముఖ ప్రజ్ఞ… నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాటల్లో… దిషణాహంకారం - నీకలంకారం నీ పలుకుల నిండా కొరివికారం కోపం నీకు వజ్రాల ముక్కుపుడక సంగీత సాహిత్యాలు నీ చెవులకి లోలకులు నీ చూపు చురకత్తి- నీ నవ్వు పూలగుత్తి నువ్వు ఒక మతివి కావు శతమతివి చిత్రసీమకు నువ్వో భారమితివి కథానాయికల మార్గంలో నువ్వొక నూతన గతివి నువ్వు భద్రకాళిలా కనిపించే భారతివి నువ్వు పులి తోలు కప్పుకున్న గంగిగోవువి నువ్వు ఆడ...

కలలోనే చూడాలేమో!

Image
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. . కలలోనే చూడాలేమో! . హరిదాసు పాటతో పోటి పడుతోన్న కోకిల కిలకిలలు... గువ్వల గుసగుసలు . ఇంటి ముందు కొలువయిన గొబ్బెమ్మల ముచ్చట్లు ... . నింగిపైని ఇంద్రధనుసును కిందకు దించిన ఇంటి ముందున రంగవల్లులు... . రేగి పండ్లతో అమ్మలు చేసే చంటి పిల్లల అభిషేకాలు.. .. కంటికెదురుకానీ! నేటి ఈ స్వప్నం... తిరిగి రానీ! మళ్లీ నాటి మన పల్లె సౌందర్యం,!.

కుర్ర దాని బుగ్గ లెర్ర బారె!

Image
కుర్ర దాని బుగ్గ లెర్ర బారె! . శ్రీ Venkata Subba Sahadevudu Gunda గారి అద్బుత పద్యం.! . మోపు నెత్తఁ బోయి మోకళ్లు సోకంగ! చూపుఁ జూపు చిలుక సుధలుఁ బొంగ! బావ సైగ లోని భావాలు గుచ్చంగ! కుర్ర దాని బుగ్గ లెర్ర బారె!

కుంతీదేవి.....దీవెన.!

Image
కుంతీదేవి.....దీవెన.! . సుభద్ర గర్భవతి గా ఉన్నప్పుడు కుంతీ దేవి కి నమస్కరిస్తే..  అవిడ ఏమన్నదో తెలుసునా.. . "భాగ్యవంతం ప్రసూయేధా మా శూరం మాచ పండితం. కూరాశ్చ కృతవిద్యాశ్చ మమ పుత్రా వసంగతా:" అన్నది. అంటే..  . అమ్మాయీ నీవైనా ఒక భాగ్యవంతుడైన కొడుకుని కను.. కానీ శూరుడూ..  పండితుడూ అయిన కొడుకుని కనవద్దు. ఇదేమి విపరీతపు కోరిక అంటావేమో.. నా కొడుకులకన్నా..శూరులు పండితులు ఉన్నారా? అయినా భాగ్యం లేక పోవడం వల్లనే కదా వారు అడవుల పాలయ్యారు. అందుచేత భాగ్యవంతుడైన కొడుకు పుట్టాలని కోరుకో తల్లీ అంది.

విషాదసుఖం!

Image
నాటి తుది సందె చీకటి కాటుకల విలీనమైపోవు రాజమార్గాన, నీవు కదలిపోతివి విషాదసుఖమ్ము గూర్చి విషాదసుఖం!  . . సగము నిద్దురలో క్రమ్ము స్వప్న మటుల ఆపుకోలేని మమత, ఘంటాపథమ్ము నడుమ పరువిడి, నిలబడినాడ నట్టె విషాదసుఖం! ఆ అనుభూతి కృష్ణశాస్త్రికి మాత్రమే తెలుసు. x

నువ్వు ఒప్పుకోవడానికి కాదు నేస్త౦ . . . ! ! !

Image
నువ్వు ఒప్పుకోవడానికి కాదు నేస్త౦ . . . ! ! ! ( స్త్రీ జీవితం) . నీకై నేనున్నానని, నీకోస౦ నే వస్తానని, నీతో నే వు౦టానని, నువ్విచ్చిన ఆ మాట ఓ నేస్త౦ ఏనాటి నీటి మూట.! నన్ను నమ్మి౦చడ౦ నీ నేర్పు, నిన్ను నమ్మడ౦ నా తప్పు, భగవ౦తుడు నాకిచ్చిన శాప౦ ఈ ఓర్పు.! అ౦త్య ప్రాసల ఆన౦ద౦ కాదిది, అతి(వ)వాదపు ఆలాపన కాదిది, అశ్రువులలో ఆవిరౌతున్న ఓ అతివ ఆవేదన ఇది.! . (మనకవితలు )