🚩గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన.🚩
🚩గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన.🚩 👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿💥👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿 తత్వవిచారణతో సద్యోఫలితం అందుకున్న వారిలో గజేంద్రుడు అగ్రగణ్యుడు. ఆయన లాగ తత్వవిచారాన్ని చేసి ఉన్న ఫళంగా పరమాత్మ సాక్షాత్కారం పొందినవారిలో మొదటివాడు. మిగతా అందరికి ఆదర్శప్రాయుడు. గజేంద్రుడి పేరుతో శ్రీ వ్యాసుల వారు, శ్రీ పోతన గారు మనకు తత్వవిచారాన్ని పరిచయం చేసి, ఏవిధంగా దాన్ని చేయాలి, ఎటువంటి ప్రశ్నలు వేసుకోవాలి, ఏవిధమైన జవాబులు రాబట్టుకోవాలి, మన ఆలోచనలని, భావాలని ఏవిధంగా మలచుకోవాలి, ఏవిధమైన భావపరంపరలతో ముందుకు సాగితే గమ్యమైన పరమాత్మను చేరుతాము అన్న విషయాలను చాలా చక్కగా తెలియ జేసారు. ఇప్పుడు మనం శ్రీమద్భాగవతంలో గజేంద్రుడు పేరుమీద వ్యాసులవారు, పోతనగారు మనకు ఇచ్చిన తత్వవిచార భాండాగారాన్ని ఒక క్రమంలో పరిశీలిద్దాం. వారిద్దరూ ఒకే భావాన్ని ఏవిధంగా వ్యక్త పరిచారు, వ్యాసులవారు చెప్పినవాటిలో పోతనగారు వేటిని చెప్పారు, వేటిని వదిలివేసారు, ఇంకా వేటిని చెప్పారు, వీటన్నిటిని కూడా పరిశీలించి, వారి దృక్పధాన్ని తెలుసుకొంటూ తత్వవిచారాన్ని మన మనస్సులలో నాటుకొనేటట్లు చేసుకొందాం. ముందరగా వ్యా...