Posts

Showing posts from May, 2019

🌺వడ్డాది వారి వయ్యారాలు 🌺

Image
శుభోదయం .🌹 🌺వడ్డాది వారి వయ్యారాలు 🌺 👉🏿ఒప్పుల కుప్ప వయ్యారి భామ అంటూ ఆడపిల్లలు నట్టింట్లో ఆడుతూ ఉంటె ఆ ముచ్చటే వేరు. 🌺🌺 ఒప్పులకుప్ప, వయ్యారిభామ సన్నబియ్యం, ఛాయపప్పు చిన్న మువ్వ, సన్నగాజు కొబ్బరు కోరు, బాదంపప్పు గూట్లో రూపాయి, మా బాబు సిపాయి 🌺🌺🌺🌺 ఒప్పులకుప్పా వయ్యరి భామ మినపా పప్పూ మెంతీ పిండి తాటీ బెల్లం తవ్వెడు నెయ్యు గుప్పెడు తింటే కులుకూలాడి 🌺🌺 నడుమ గట్టే నా మాట చిట్టి దూదూ పుల్లా దురాయ్ పుల్ల చూడకుండా జాడా తీయ్ ఊదకుండా పుల్లా తీయ్ 🌺🌺🌺🌺 దాగుడుమూతా దండాకోర్ పిల్లీ వచ్చే ఎలుకా భధ్రం ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

భగవాన్ శంకరులు-ఙిఙ్ఞాసామధనం.🌹

Image
భగవాన్ శంకరులు-ఙిఙ్ఞాసామధనం.🌹 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 మానవీయ మహాప్రస్థానములో విలువలు ఙిఙ్ఞాసావిష్కరణలు.  భగవాన్ శంకరులుఙిఙ్ఞాసామధనంలో అంత వరకు చేరనిలోతుకు చేరి తన మనో వికాసాన్ని మానవ మేధోపురోగతికితోడుచేశారు. అప్పటి అవిష్కరణలు మన (మానవ) జాతి గమనములో మైలురాళ్ళుమాత్రమే. గీత గోవిందంలో చెప్పినట్టు వ్యాకరణాన్ని వల్లెవేయడము పురోగమన గతి కాజాలదు. మన దృక్పధము నిరంతర పురోగామిత్వముకావలె నన్నదే మహానభావుల ఆశయము. సత్యసోధనలో మనిషికి యెదురయ్యే ప్రశ్నలకి జవాబులు మారుతూనే వుంటాయి. ఎందుకంటే సత్యము నిశ్చయంగా జటిలము. నిత్య నవ జాతము. పైగా బ్రహ్మ విద్య. గురుభావము గురుత్వ గరిమ నిత్యనిరవధిక సోధనలోనే అంతర్లీనంగా వుంటుంది. మన'ని మనము అవగాహన చేసుకుని అవిష్కృత సత్యములన చదువు సంస్కారముల ద్వారా పరివ్యాప్తి చేయడమే ఆచార్యుల ఆంతర్యము. సహ జీవన సౌరభంలో వినడమూ వినుకోవడమూ అనేవి నిత్య వ్యవహారాన్నీ సత్య వ్యవహారాన్నీ పొంతన చెయడములో ఒదిగి వుంటాయి. ఐహికాముష్మికసాధనసామర్థ్యం కలుగుతుంది. కనుక వీలయితే మూల శ్లోకాలతో , కనీసం ఈ తెలుగయినా రోజుకొకసారి చదివి మననం చేయాలి.  ప్రశ్నలన్నీ శిష్యుడు అడిగినవీ జవాబుల

ఒక వాస్తవంగా జరిగిన కథ.

Image
మిత్రులారా..... మంచి msg ఒక 2 నిమిషాలు కేటాయించి చదవండి..... 🙏🙏🙏🙏 ఇది ఒక వాస్తవంగా జరిగిన కథ....దయచేసి చదవగలరు...... " అక్కా! నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చేసే పని ఆపి వచ్చి ఇలా కూర్చో." చిన్నకోడలు , పెద్దకోడలితో అంది. " ఏమైంది? అలా దిగులుగా ఉన్నావు.విషయమేంటి? " అని అడిగింది పెద్దకోడలు. " ఏమీ లేదు. గుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి 5 సంవత్సరాలు అయింది. కదా! మామయ్యను అత్తగారే చూసుకునేవారు. ఇప్పుడు మనమే అన్నీ చేస్తున్నాము కదా! మనకు పిల్లలు , సంసారం ఉన్నాయి. మామగారిని ఎన్ని రోజులని చూడగలం.అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను>" అంది చిన్నకోడలు. " ఏంటది? " అని అడిగింది పెద్దకోడలు. " మనమిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో చేర్పిద్దాం. అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ వయస్సులో ప్రశాంతంగ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇళ్ళల్లో చెరొక ఇంట్లో మనం మన పిల్లలతో హయిగా ఉండవచ్చు." అంది చిన్నకోడలు. " దీనికి మన భర్తలు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకంలేదు." అంది పెద్దకోడలు. " మనం ఏదో ఒకటి చ

పుట్టం బుట్ట శిరంబునన్ మొలవ .(పోతనామాత్యుడు.)

Image
🌹🙏🏿శుభోదయం.🙏🏿🌹 🌺🌺 పుట్టం బుట్ట శిరంబునన్ మొలవ , నంభోయానపాత్రంబునన్ నెట్టం గల్గను , గాళి గొల్వను , బురాణింపన్ దొరంకొంటి మీ దెట్టే వెంట జరింతు దత్సరణి నా కీవమ్మ ! యో యమ్మ ! మేల్ పట్టున్ నాకగుమమ్మ ! నమ్మితి జుమీ బ్రహ్మీ ! దయాంభోనిధీ.! . (పోతనామాత్యుడు.) 🌺🌺🌺🌺🌺 👉🏿భాగవతం ప్రార్థనా పద్యాలతో మొదలవుతుంది .  సరస్వతీ మాత అనుగ్రహం కోరి పోతన రచించిన పద్యం . రమ్యం గా ఉంటుంది మరి చదవండి -పిల్లలతో చదివించండి . పుణ్యమూ , పురుషార్థమూ , చదువుల తల్లి అనుగ్రహమూ లభిస్తాయి . 👉🏿తలపై పుట్ట పెరిగింది వాల్మీకికి . ఆ వాల్మీకిగా నేను పుట్టలేదు . వ్యాస భగవానుని లాగా పడవలో పుట్టలేదు . కవికులతిలకుడై కాళిని కొల్చిన కాళిదాసునూ కాదు . అయినా భాగవతాన్ని తెలుగు భాషలో రచించడానికి పూనుకున్నాను . అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాను . నాకు మార్గాన్ని నిర్దేశించి , చేయూత నిచ్చి నడిపించవమ్మా . నీవే తప్ప ఇతఃపరంబెరుగను తల్లీ . అనుగ్రహించవమ్మా .  నిన్నే నమ్ముకున్నానమ్మా ! చదువుల తల్లి సరస్వతీ !  నను కరుణించవమ్మా ! బ్రాహ్మీ ! నీవు దయా సముద్రురాలవు కదమ్మా .

🌹💥 శ్రీరామచంద్రుడు పోషించిన -నవరసాలు💥🌹

Image
🌹💥 శ్రీరామచంద్రుడు పోషించిన -నవరసాలు💥🌹 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 👉🏿కావ్యం లో నవరసాలకూ సమాన ప్రాతినిధ్యం వుండాలి అది అప్పుడే పాఠక హృదయాలను ఆకట్టుకుంటుంది. ఇది రామాయణం లో వివిధ ఘట్టాల నేపధ్యంతో శ్రీరాముడు నవరసాలూ పోషించి నట్లు వివరిస్తుంది. నవరసాలతో అల్లిన సీస మాలిక ఇది. కడునొప్పు జానకీ కళ్యాణ శుభలగ్న  కాలోత్సవంబు శృంగార రసము  పట్టాభిషేక సంభ్రమ వేళ ముని వృత్తి జనుమన్న  జనుటయే శాంత రసము తను నరమాత్రునిగా దలచు తాటకనేయు  నట్టపహాసస్ఫూర్తి హాస్యరసము, పాదరేణువు సోకి పాషాణ మెలమి పొలతి యై  నిల్చుటద్భుత రసంబు  మాయా మృగంబైన మారీచు కనుగొని భయ దాస్త్ర మేయుట భయరసంబు  కడగి వారిధి మీద గదిసి లక్ష్మణు చేతి విల్లందుకొను వేళ వీర రసము తన బాణ హతి బడ్డ దైత్యుల వికృతాంగ  భావంబు జూడ భీభత్సరసము రాణివాస ద్రోహి రావణాసురు బట్టి  రణ వీధి ద్రుంచుట రౌద్రరసము  అల విభీషణుని లంకాధిపు జేయుచో  రూడికి నెక్కు కారుణ్య రసము నవరసంబులు నీయెడ నాటు కొనియె  దశరథేశ్వర పుత్ర! సీతా కళత్ర  తారక బ్రహ్మ! కౌసల్య తనయ! రాజ  రాజ దేవేంద్ర! పట్టాభి రామచంద్ర! 1).