పుట్టం బుట్ట శిరంబునన్ మొలవ .(పోతనామాత్యుడు.)

🌹🙏🏿శుభోదయం.🙏🏿🌹

🌺🌺

పుట్టం బుట్ట శిరంబునన్ మొలవ , నంభోయానపాత్రంబునన్

నెట్టం గల్గను , గాళి గొల్వను , బురాణింపన్ దొరంకొంటి మీ

దెట్టే వెంట జరింతు దత్సరణి నా కీవమ్మ ! యో యమ్మ ! మేల్

పట్టున్ నాకగుమమ్మ ! నమ్మితి జుమీ బ్రహ్మీ ! దయాంభోనిధీ.!

.

(పోతనామాత్యుడు.)

🌺🌺🌺🌺🌺

👉🏿భాగవతం ప్రార్థనా పద్యాలతో మొదలవుతుంది . 

సరస్వతీ మాత అనుగ్రహం కోరి పోతన రచించిన పద్యం . రమ్యం గా ఉంటుంది మరి చదవండి -పిల్లలతో చదివించండి . పుణ్యమూ , పురుషార్థమూ , చదువుల తల్లి అనుగ్రహమూ లభిస్తాయి .

👉🏿తలపై పుట్ట పెరిగింది వాల్మీకికి . ఆ వాల్మీకిగా నేను పుట్టలేదు .

వ్యాస భగవానుని లాగా పడవలో పుట్టలేదు .

కవికులతిలకుడై కాళిని కొల్చిన కాళిదాసునూ కాదు .

అయినా భాగవతాన్ని తెలుగు భాషలో రచించడానికి పూనుకున్నాను . అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాను .

నాకు మార్గాన్ని నిర్దేశించి , చేయూత నిచ్చి నడిపించవమ్మా .

నీవే తప్ప ఇతఃపరంబెరుగను తల్లీ . అనుగ్రహించవమ్మా . 

నిన్నే నమ్ముకున్నానమ్మా ! చదువుల తల్లి సరస్వతీ ! 

నను కరుణించవమ్మా ! బ్రాహ్మీ ! నీవు దయా సముద్రురాలవు కదమ్మా .

👉🏿పోతన భాగవత ప్రారంభంలో సరస్వతీ మాత దయాబిక్ష 

కోరుతూ కొన్ని పద్యాలు అమోఘంగా రచించాడు .

అందులో ” తల్లీ ,నిన్ను దలంచి ” , “క్షోణితలంబునన్ ” , 

శారద నీరదేందు ” , కాటుక కంటి నీరు ” లాంటి పద్యాలు 

విద్యార్థులకు ప్రేమతో నేర్పించేవారు గురువులు — 

మొన్న మొన్నటి వరకూ . ప్రస్తుతం అవి కనుమరుగవుతున్నాయి . మాతృమూర్తి కరుణించినవారి రచనలు కలకాలం నిలిచాయి .

పోతనే అందుకు ఉదాహరణ . 

చదువులు నిజంగా వంటి కబ్బాలంటే , చదువుల తల్లి కరుణ కావాలి . బిడ్డలందరికీ ఈ పద్యాలు నేర్పించి , వల్లె వేయించి సరస్వతీ మాత దయకు పాత్రులను చేయడం మన ధర్మం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!