Posts

Showing posts from October, 2019

🚩 చనిపోవడమంటే !!!

Image
🚩 చనిపోవడమంటే !!! 👏🏿👏🏿👏🏿👏🏿 చావుగురించి ఆలోచించడం, భయపడడం రెండూ వ్యర్ధమే! 👇💥👇 👉🏿ముందు చనిపోవడమంటే ఏమిటో తెలిస్తే, ఎక్కడికెడతామనే విషయం ఇట్టే అర్ధమౌతుంది. సమాజంలో "మరణం" అనే అంశంచుట్టూ రకరకాల అభూతకల్పనలు ప్రచారంలో వున్నాయి. స్వర్గం-నరకం, దేవుడు-దయ్యం, పాపం-పుణ్యం, ఆత్మ-పరమాత్మ ఇలాంటి పదాలన్నీ వొట్టి కల్పన! ఇదంతా మానవుడి ఊహే తప్ప, ఇలాంటివేవీ లేవు. ఉండటానికి అవకాశమేలేదు. మానవదేహం కూడా అచ్చంగా వొక మెషీన్ లాంటిది. లాంటిదేమిటి? మన దేహం అక్షరాలా వొక బయో మెషీన్. జీవక్రియలు ఆగిపోయినపుడు, ఇదీ పనిచేయడం మానేస్తుంది. దేహంనుండి బయటికొచ్చే ఆత్మల్లాంటివేవీ వుండవు. తరువాత మనకు తెలిసేది, తెలుసుకునేదీ ఏదీ వుండదు. బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోయినపుడు, ఇక మెమరీ కూడా బందే! ఇక దేహం కూడా మట్టిలో కలిసిపోతుంది. అంతటితొ కథ ముగుస్తుంది! కానీ, నిజానికి ప్రాణులకు మరణం వుండదు. ఎందుకంటే, ప్రతీ ప్రాణీ తనలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా తనలాంటి మరొజీవికి ప్రాణ ప్రతిష్టచేసి, తరువాత, నశించిపోతుంది. కాబట్టి, తల్లి

🚩తోలుబొమ్మలాట !🌹🌹

Image
🚩తోలుబొమ్మలాట !🌹🌹💥💥💥 తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా షృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది. తోలుబొమ్మలపై వాలిసుగ్రీవులు, రావణుడు, సీతారామలక్ష్మణులు, రాజులు, భటులు, మహాభారత వీరులు, మున్నగు వేషాలన్నియు వివిధ రంగులతో తీర్తురు. ప్రేక్షకులు బొమ్మల చూడగనే ఇది యీ వ్యక్తిని నిరూపించు బొమ్మ అని పోల్చుకొను సాంప్రాదాయ మేర్పడినది. ఈ బొమ్మలలోని వేషాలు పూర్వపు రాజులు రౌతులు మున్నగువారి వేషములను ఊహించుటకు తోడ్పడ వచ్చును. ఈ బొమ్మలాటలో మధ్య మధ్య హాస్యప్రదర్శనము చేయుదురు. అది చాలా అసభ్యముగా నుండును. సినిమా అసభ్యాలను నిషేధించే ప్రభుత్వము వీటిని తొలగించినదికాదు . తోలుబొమ్మలాటలో పాత్రలు తోలుబొమ్మలాట అంటే చా

🚩అహల్యా శాప విమోచనం.🙏🏿🙏🏿🌹

Image
🚩అహల్యా శాప విమోచనం.🙏🏿🙏🏿🌹 (బాలకాండ మందరమకరందం..సర్గ-49 💥💥 రాముడు విశ్వామిత్రుడితో,మిథిలా నగరానికి వెళ్తుండగా, ఆ నగరానికి సమీపంలో ఒక నిర్మానుష్యమైన ఆశ్రమము కనపడింది. అది చూసిన రాముడు విశ్వామిత్రుడితో "ఓ మహర్షి!ఈ ఆశ్రమము ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు . దీనికి కారణం ఏమిటి?" అని అడిగాడు. "ఓ రామా! ఇది గౌతమ మహర్షి ఆశ్రమము. ఆయన భార్య అహల్య. ఒకనాడు గౌతముడు లేని సమయంలో ఇంద్రుడు గౌతముని వేషంలో ఆశ్రమానికి వచ్చి, తన కామ కోరిక తీర్చాలని అహల్యను అడిగాడు. తన భర్త వేషంలో వచ్చింది దేవేంద్రుడని అని తెలుసుకున్నది అహల్య. అయినా దుర్బుద్ధితో ఇంద్రునితో రతిక్రీడకు అంగీకరించింది. అహల్యతో సంగమించిన ఇంద్రుడు ఎక్కడ గౌతముడు వచ్చి తనను చూస్తాడేమో అని త్వరత్వరగా ఆశ్రమం నుండి బయటకువచ్చాడు. ఇంతలో గౌతముడు దర్భలను, సమిధలను తీసుకొని ఆశ్రమానికి వచ్చాడు. తన వేషంలో ఉన్న ఇంద్రుడిని చూసాడు. జరిగిన విషయం గ్రహించాడు. "ఓ దుర్మతీ! నేను ఆశ్రమంలో లేని సమయంలో నా వేషంలో నా ఆశ్రమంలో ప్రవేశించి నా భార్యతో సంగమించినందుకు నీకెదే న

🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!!

Image
🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!! (టీకా ..భావం ) క కరిఁ దిగుచు మకరి సరసికిఁ గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్ గరికి మకరి మకరికిఁ గరి భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్. టీకా: కరిన్ = ఏనుగును; తిగుచున్ = లాగును; మకరి = మొసలి; సరసి = మడుగులోని; కిన్ = కి; కరి = ఏనుగు; దరి = ఒడ్డున; కిని = కి; మకరిన్ = మొసలిని; తిగుచున్ = లాగును; కరకరిన్ = క్రూరస్వభావము, పట్టుదల; పెరయన్ = అతిశయించగా; కరి = ఏనుగున; కిన్ = కు; మకరి = మొసలి; మకరి = మొసలి; కిన్ = కి; కరి = ఏనుగు; భరము = భారమైనది; అనుచున్ = అంటూ; అతల = పాతాళలోకపు; కుతల = భూలోక; భటుల్ = వీరులు; అరుదు = ఆశ్చర్య; పడన్ = పడగా. భావము: మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టు పైకి ఈడ్చింది. రెండు ద్వేషం పట్టుదలలు పెంచుకొన్నాయి. “మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగుని మొసలి తట్టుకోలేదు” అనుకుంటు పాతాళ, భూ లోకాల శూరులూ ఆశ్చర్య పోయారు. 🚩 శా. నానానేకపయూధముల్ వనములోనం బెద్దకాలంబు స న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే కీ

🚩శుభం .-గజేంద్ర మోక్షము.👏🏿👏🏿

Image
🚩శుభం .-గజేంద్ర మోక్షము.👏🏿👏🏿 💥💥💥 🚩త్రికూట పర్వతారణ్యములో ఒక గజరా జుండెను. అతనికి దశలక్ష భార్యలు గలరు .అతడొకనాడు భార్యలతో అడవిలో దిరుగుచు దాహమువేసి, ఒక చెరువులో దిగి నీళ్ళు ద్రావి, కరిణులతో జలక్రీడలకు దిగి, చెరువు నంతయు కలచివేసెను. ఆ చెరువులో పెద్దమొసలి యున్నది. అది వచ్చి గజరాజు కాలుపట్టుకొనేను. ఏనుగు విదిల్చి కొట్టెను. మొసలి మరల పట్టుకొని విడువలేదు. లోపలికి లాగుచుండెను. గజము ఒడ్డునకు లాగుచుండెను. పోరు ఘోరమయ్యెను. వేయి యేండ్లు గడిచేను. స్థానబలముచేత నీటిలోని మొసలి మరింత విజ్రు౦భి౦చెను.గజరాజునకు బలము సన్నగిల్లెను. మొసలిని గెలువగలనా లేదా యని సందేహము కలిగెను. రక్షించువా రెవ్వ రను కొనెను. పూర్వసుకృతము వలన భగవంతుడు తప్ప మరొకడు రక్షకుడు లేడను స్థిరబుద్ధి కలిగెను. అప్పుడు 💥శా|| లా వొక్కింతయు లేదు ధైర్యము విలోల౦బయ్యె ప్రాణ౦బులున్ ఠావుల్ దప్పెను, మూర్చ వచ్చే,తనువుం డస్సెన్ శ్రమం బయ్యెడిన్ నీవేతప్ప నిత:పరం బెరుగ, మన్నింప పందగుం దీనునిన్ రావే! యీశ్వర!కావవే వరద!సంరక్షింపు భద్రాత్మకా! అని మొరపెట్టుకొనెను. 💥💥💥

🚩గ జేంద్రమోక్షముయొక్క పరమార్ధం 🚩

Image
🚩గ జేంద్రమోక్షముయొక్క పరమార్ధం 🚩 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 భగవంతుని నమ్మిన వారి కెన్నడు కూడ నాశము లేదని చెప్పడమే భాగవతం యొక్క పరమార్ధం . “ నన్ను మఱువని వారిని నేను ఏనాడు మరువను. ‘నన్ను మఱచిన యెడలన్ మఱతును.’ ఈ సంగతి తెలుసుకొని ఇతరులను వేడకుండా నన్నే నమ్మి ప్రార్థించిన వారిని నేను తప్పక ఆదుకుంటాను. ‘యెఱిఁగి మొఱఁగక మఱవక మొఱ యిడిర యేని ’ వారిని కాపాడతానంటాడు పరమాత్మ. తనను మర్చిపోయిన వారిని తాను మర్చిపోతానని, తనను నమ్ముకున్న వారిని తాను ఆదుకుంటానని “ స్పష్టంగా చెప్పాడు శ్రీమహాలక్ష్మి తో శ్రీమహావిష్ణువు ఈ గజేంద్రమోక్షఘట్టం లో. (8-130). " నీవే తప్పనిత: పరంబెరుగన " నే ఆత్మసమర్పణ భక్తునిలో కలిగినప్పుడే భగవత్సాక్షాత్కారం జరిగేది. అదే విషయాన్ని గజేంద్రమోక్ష ఘట్టం మనకు సవివరంగా విశదీకరిస్తుంది . అంతేకాదు.భక్తుడు కర్మపరతంత్రుడై నిత్యకృత్యాలను నిర్వహించుకుంటూనే విష్ణువు ను సేవించగలగాలి. ఈ నియమాలను పాటిస్తే మెల్లగా పాపాలన్నీ నశించిపోతాయి. ప్రబలమైన విష్ణుభక్తి ఎప్పుడు నాశనము కాదు. ” ప్రబలమైన విష్ణుభక్తి

🚩గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన.🚩

Image
🚩గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన.🚩 👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿💥👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿 తత్వవిచారణతో సద్యోఫలితం అందుకున్న వారిలో గజేంద్రుడు అగ్రగణ్యుడు. ఆయన లాగ తత్వవిచారాన్ని చేసి ఉన్న ఫళంగా పరమాత్మ సాక్షాత్కారం పొందినవారిలో మొదటివాడు. మిగతా అందరికి ఆదర్శప్రాయుడు. గజేంద్రుడి పేరుతో శ్రీ వ్యాసుల వారు, శ్రీ పోతన గారు మనకు తత్వవిచారాన్ని పరిచయం చేసి, ఏవిధంగా దాన్ని చేయాలి, ఎటువంటి ప్రశ్నలు వేసుకోవాలి, ఏవిధమైన జవాబులు రాబట్టుకోవాలి, మన ఆలోచనలని, భావాలని ఏవిధంగా మలచుకోవాలి, ఏవిధమైన భావపరంపరలతో ముందుకు సాగితే గమ్యమైన పరమాత్మను చేరుతాము అన్న విషయాలను చాలా చక్కగా తెలియ జేసారు. ఇప్పుడు మనం శ్రీమద్భాగవతంలో గజేంద్రుడు పేరుమీద వ్యాసులవారు, పోతనగారు మనకు ఇచ్చిన తత్వవిచార భాండాగారాన్ని ఒక క్రమంలో పరిశీలిద్దాం. వారిద్దరూ ఒకే భావాన్ని ఏవిధంగా వ్యక్త పరిచారు, వ్యాసులవారు చెప్పినవాటిలో పోతనగారు వేటిని చెప్పారు, వేటిని వదిలివేసారు, ఇంకా వేటిని చెప్పారు, వీటన్నిటిని కూడా పరిశీలించి, వారి దృక్పధాన్ని తెలుసుకొంటూ తత్వవిచారాన్ని మన మనస్సులలో నాటుకొనేటట్లు చేసుకొందాం. ముందరగా వ్యా

🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!!

Image
🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!!👉🏿 కరి దిగుచు మకరి సరసికి కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ !! 👉🏿 నానానేకప యూధముల్ వనము లోనన్ పెద్ద కాలంబు స న్మానింపన్ దశ లక్ష కోటి కరిణీ నాధుండ నై యుండి మ ద్దానాంభః పరిపుష్ట చందన లతాంతచ్చాయ లందుండ లే కీ నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా !! 👉🏿 కలడందురు దీనుల యెడ కలడందురు భక్త యోగి గణముల పాలం గలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో !! 👉🏿 లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !! 👉🏿 ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై? ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !! 👉🏿 లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ న

🚩 తిరు క్షవరం ..😅

Image
🚩 తిరు క్షవరం ..😅 (Courtesy -Sri Satyanand Pydipalli..) పేస్ బుక్ మా ఫ్రెండ్ గాడి పాలిట ... డైరీ ,ఫోటో ఆల్బం ,పద్దుల బుక్ ,పోస్ట్ కార్డు , టెలిగ్రాం ,వెస్ట్ బాస్కెట్ , స్టోర్ రూమ్ ....అన్నీను . ఏ విషయమైనా -అది ఎలాంటిదయినా అర్జెంటు గా పేస్ బుక్ లో గోడ మీద పెట్టకపోతే మనశాంతి ఉండదు వాడికి. తినే తిండి , తొడిగే చొక్కా , ,తొక్కిన పేడ ,దూకిన గోడ ,తీసిన పేలు ,గోకిన కాలు ....ఒకటని లేదు ..తను చేసే ప్రతి పనికి రాని పని తెలుసుకోడానికి ప్రపంచం పని గట్టుకుని ఎదురు చూస్తోందని ప్రగాఢ నమ్మకం మా ఫ్రెండ్ గాడికి . " ఈ రోజు తిరుపతి కి కుటుంబం మొత్తం ఇంటికి తాళం పెట్టి కట్టకట్టుకు పోతున్నాం ..రెండు రోజులు కొండ మీద కొత్త గుండు తో వుంటా ..ఇవిగో టిక్కెట్లు .." అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి (నమ్మమేమో అన్నట్టు ఫ్లైట్ టిక్కెట్లు ,కాటేజ్ -దర్శనాలకి రెకమెండేషన్ లెటర్స్ అన్ని మొహం మీద పెట్టుకుని సెల్ఫీ తీసి కూడా పెట్టి )పోయాడు . ఇక మొదలైనది -గంటకో పోస్టు ... .ఎయిర్ పోర్ట్ లో సెండ్ అఫ్ ఫోటో వీడేదో చంద్రయాన్ లో పైకి పోతోన్నట్టు కాగలించుకు కన్నీళ్లు పెట్టుకు పంపే చుట్టాలు -ఓదార్చే వీ

🚩 కళాపూర్ణోదయం -8: మణిహారం.!

Image
🚩 కళాపూర్ణోదయం -8: మణిహారం.! (రచన: శ్రీ కె. వి. ఎస్. రామారావు గారు .. వారికీ కృతజ్ఞతో ..) 👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿......... ( జరిగిన కథ :-రెండు నెలల పాప మధురలాలస ఆశ్చర్యం కొలిపేటట్టు కళాపూర్ణుడి పుట్టుక వెనక వున్న జన్మజన్మల కథల్నీ వినిపిస్తోంది. అప్పుడు అలఘువ్రతుడితో అక్కడ వున్న నలుగురు పురోహితులూ అతని కొడుకులేనని చెప్తుంది. అతను నమ్మలేకపోతాడు. బట్టతలకీ మోకాలికీ ముడిపెట్టగలిగే ఈ కతలతల్లి అదెలా సాధ్యం చేస్తుందోనని ఆశ్చర్యపడతాడు. ఇక చదవండి.) 🚩 అలఘువ్రతుడి మాటలకు నవ్వుతూ, “అలా జరగటం తప్పదు” అన్నాడు కళాపూర్ణుడు. ఆ పాపని చూసి, “ఇతని పుట్టుపూర్వోత్తరాలు, ఇతనికి ప్రథమాగమాదులు ఎలా కొడుకులో మాకందరికీ వివరంగా చెప్పమ”ని అడిగాడు. “అలాగే!” అని ఆ పాప ఇలా చెప్పింది పాండ్యదేశంలో సోమశర్మ అనే అతను వుండేవాడు. అతని కొడుకు యజ్ఞశర్మ. ఎంత కష్టపడ్డా అతనికి వేదవిద్యలు ఒక్కముక్క ఒంటపట్టలేదని అతను బాధపడుతుంటే, అది మరిపించటానికి అతని తండ్రి నలుగురు గుణవతుల్ని తెచ్చి అతనికి పెళ్ళిచేశాడు. కోడళ్ళందరికీ ఎన్నో ఆభరణాలు, చీరలు, కావలసిన సదుపాయాలన్నీ సమకూర్