Posts

Showing posts from December, 2019

గరికపాటి వరలక్ష్మి(జి.వరలక్ష్మి) (27-09-926 & 26-11-2006) గారి విశేషాలు:-

Image
గరికపాటి వరలక్ష్మి(జి.వరలక్ష్మి) (27-09-926 & 26-11-2006) గారి విశేషాలు:- (Anappindi Suryalakshmi Kameswara Rao) ఆంధ్రప్రదేశ్‌ ఒంగోలులో 1926లో జన్మించిన వరలక్ష్మి తన పదకొండవ ఏటనే నాటకల్లో నటించాలన్న ఉత్సాహంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా పారిపోయారు. ఆ రోజుల్లో తుంగల చలపతి, దాసరి కోటిరత్నం ఇద్దరూ ప్రసిద్ధ రంగస్థల నటులు. ''రంగూన్‌ రౌడీ, సక్కుబాయి'' చిత్రాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్న సందర్భం అది. వారి ప్రభావం జి. వరలక్ష్మి మీద పడింది. తన పన్నెండవ ఏటనే బారిస్టరు పార్వతీశం, బొండాం పెళ్లి చిత్రాల్లో నటించారు. హెచ్‌.ఎమ్‌.రెడ్డి, రఘుపతి ప్రకాశ్‌ ఈమెను ప్రోత్సహించారు. అప్పట్లో నౌషద్‌ గారి పాటలంటే పడిచచ్చేవాళ్ళు. జి. వరలక్ష్మి 'నౌషద్‌' ట్రూపులో చేరి పాటలు పాడేసి గొప్ప గాయనీమణి అయిపోవాలన్న కలలు కనేది. అనుకున్నదే తడవుగా బొంబాయి వెళ్ళిపోయింది. అతి చిన్న వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశం... పైగా తప్పొప్పులు చేప్పేవాళ్ళు ఎవరూ లేరు. తన మనసులో మెదిలే ఏ పనైనా దూకుడుగా చేసెయ్యడం... ఎదురు దెబ్బ తగిలితే రాటుదేలడం... ఇదే నేర్చుకుంది. అయితే దేవుడిచ్చిన గొప్పవరం తె...

మను చరిత్ర - ఒక ఆలోచన!

Image
మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy) శ్రీ సరస్వత్యై నమః ఆరజ నీరజ ప్రతిమమైన ముఖంబున పండు వెన్నియల్ చారుతర ప్రచారగతి సాప్తపదీనత జూపి సుస్మితో దార సుధాతరంగిణి విధంబున నర్తన సేయ సత్కృపా శారద; శారదా జనని సన్మతి యేలుత  నిల్చి ఈసభన్ తల్లి దండ్రులకు, గురుపరంపరకు, సభా సదులకు నమస్సులు. ప్రబంధ సాహిత్యంలో మను చరిత్రకు సమున్నత స్థానం ఉంది. కృతి కర్తగా అల్లసాని వారికి అలాగే కృతి భర్తగా కృష్ణరాయలకు ఆ కావ్యం అజరామర కీర్తి ప్రతిష్ఠలను అందించింది. మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ కథను వర్ణనా చాతుర్యంతో మహాప్రబంధంగా తీర్చి దిద్దిన మహాకవి అల్లసాని. అల్లసాని వారు తన గురువు శఠగోపయతి వద్ద "అజప" దీక్ష తీసుకున్నవాడు. ఇది ఎవరి కథ: ఈ ప్రభంధం స్వారోచిష మను సంభవాన్ని గూర్చి చెప్పబడింది. స్వారోచిషుడు రెండవ మనువు కాగామొత్తంగా 14 మంది మనువులు ఉన్నారు. 1) స్వాయంభువు, 2) స్వారోచిషుడు 3) ఉత్తముడు 4) తామసుడు 5) రైవతుడు 6) చాక్షసుడు 7) వైవస్వతుడు 8) సూర్య సావర్ణి. ఇతడే బలి చక్రవర్తి 9) మేరు సావర్ణి 10) కక్ష్య సావర్ణి 11) రుద్ర సావర్ణి 12) ఇంద్ర సావ...