శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏 🤲-తెలుగు లో వివరణ- (6)🤲
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏 🤲-తెలుగు లో వివరణ- (6)🤲 👉🏿"వేయి నామములు ప్రధాన వ్యాసం: విష్ణువు వేయి నామములు- 401-500. 🙏🏾 401) వీర: - పరాక్రమశాలియైనవాడు. 402) శక్తిమతాం శ్రేష్ఠ: - శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు. 403) ధర్మ: - ధర్మ స్వరూపుడు. 404) ధర్మ విదుత్తమ: - ధర్మము నెఱింగినవారిలో శ్రేష్ఠుడు. 405) వైకుంఠ: - సృష్ట్యారంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు. 406) పురుష: - ఈ సర్వముకంటే పూర్వమునుండువాడు. 407) ప్రాణ: - ప్రాణరూపమున చేష్ట కల్గించువాడు. 408) ప్రాణద: - ప్రాణమును ప్రసాదించువాడు. ప్రాణము లిచ్చువాడు. 409) ప్రణవ: - ఓంకార స్వరూపుడు. 410) పృథు: - ప్రపంచరూపమున విస్తరించినవాడు. 411) హిరణ్యగర్భ: - బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు. 412) శత్రుఘ్న: - శత్రువులను సంహరించువాడు. 413) వ్యాప్త: - సర్వత్ర వ్యాపించియున్నవాడు. 414) వాయు: - వాయురూపమున యుండి సకలమును పోషించువాడు. 415) అథోక్షజ: - స్వరూపస్థితి నుండి ఎన్నడును జాఱనివాడు. 416) ఋతు: - కాలరూపమై తెలియబడు ఋతువులై భాసించువాడు. 417) సుదర్శన: -