🚩🚩గీతాంజలి కావ్యం.🚩🚩 (రవీంద్రనాథ్ ఠాగూర్.)

🚩🚩గీతాంజలి కావ్యం.🚩🚩

(రవీంద్రనాథ్ ఠాగూర్.)

✍️✍️

గీతాంజలి" రవీంద్రనాథ్ ఠాగూర్" రచించిన

ఒక బెంగాలీ పద్య కావ్యం. ప్రధానంగా ఈ కావ్యం వల్లనే రవీంద్రనాథ్ ఠాగూర్‌కు 1913లో నోబెల్ బహుమతి లభించింది..

✍️బెంగాలీ భాషలో వ్రాయబడిన మూల గ్రంథం గీతాంజలి 103/157 పద్యాల సంకలనం. ఇది 1910, ఆగష్టు 14న ప్రచురింపబడింది. ఇంగ్లీషు గీతాంజలి లేదా సాంగ్ ఆఫరింగ్స్ 103 ఆంగ్ల పద్యాల సంకలనం. రవీంద్రనాథ్ ఠాగూర్ తానే స్వయంగా బెంగాలీ పద్యాలను ఆంగ్లం లోనికి తర్జుమా చేశాడు.

.

✍️ఆ రోజుల్లో (1900-1913) భక్తి మార్గం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రకృతి ఆరాధన ద్వారా దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం ఈ కావ్యం ద్వారా చూపించాడు రచయిత. భక్తితో కూడిన దేశప్రేమ మనకు ఈ పద్యాలలో కనిపిస్తుంది.

✍️1913లో గీతాంజలి ఇంగ్లీషు అనువాదం కారణంగా రవీంద్రనాథ్ టాగూరు సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి ఐరోపా ఖండేతర వ్యక్తిగా నిలిచాడు..


✍️గీతాంజలి కావ్యంలోని మచ్చుకు కొన్ని కవితలు


🚩ప్రార్థన

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,

ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,

ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో,

సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం

విడిపోలేదో,

ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,

ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో,

ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం

ఇంకిపోకుండా వుంటుందో,

ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ

నీచే నడపబడుతుందో,

ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.🔻


🚩మరణం .

జీవితపు ఆఖరు మజిలీ,

ఓ నా మృత్యువా, వచ్చి నాతో ఊసులాడు.

ప్రతిదినం నేను నీ రాకకై ఎదురుచూస్తున్నా ప్రభూ,

నా జీవితపు ప్రమోదాలను జీవింపజేస్తూ.


 

నేను, నా సర్వస్వం, బహుశా నా ప్రేమ

రహస్య అగాధాల వరకు నీ వైపు ప్రవహించాయి.

ఒక్క నీ ఆఖరు వాలుచూపు..

నా జీవితం అంతా నీది.🔻


సుమాలు, సుమమాలలు వధువు కోసం సిద్ధం.

వివాహం తరువాత వధువు ఇంటిని విడిచి పయనం

తన ప్రభువును ఏకాంతపు రాత్రులలో కలవడం కోసం.

ఒక్క నిమిషం. కాసేపు నీ ప్రక్కన నన్నుకూర్చో నివ్వవూ?

పనులు తరువాత చేసుకుంటాను. నీ ముఖాన్ని ఒక్క మాటైనా చూడకపోతే, నా హృదయానికి శాంతీ, స్థిమితమూ ఉండవు. నాకు ఎంత చిన్న పని అయినా ఈదరాని మహాసముద్రంలా కనిపిస్తుంది.

కిటికీ దగ్గర కూర్చున్నాను. వేసవి వచ్చింది.

వేసవి నిశ్వాసలు వినవస్తున్నాయి. వికసిస్తున్న పూల పొదల వద్ద భ్రమరాలు రొద చేస్తూ తిరుగుతున్నాయి.

ప్రభూ! ఇది కాసేపు నీ ముఖం వైపే చూస్తూ ప్రశాంతంగా నీప్రక్కనే కూర్చుని, తీరికగా నా జీవన గీతాన్ని నీకు సమర్పించవలసిన సమయం.🔻

🚩జీవన జీవనమా!


నీ సజీవ స్పర్శ ఎల్లప్పుడూ నా శరీరంపై వుంటుందని తెలిసి, నా దేహాన్ని దేవాలయంలా పరిశుద్ధంగా వుంచుకోడానికి ప్రయత్నిస్తాను. అసత్యాన్ని మనసులో అడుగుపెట్టనివ్వక అల్లంత

దూరంలో వుంచుతాను. నా మనో మందిరంలో హేతు జ్యోతిని వెలిగించిన సత్యానివి నీవు.


 

నా హృదయాంతరంలో నీ పీఠం వున్నదని తెలిసి, దుష్టత్వాన్ని చేరనివ్వక నా హృదయాన్ని ఎల్లప్పుడూ నవవసంత ప్రేమారామంగా వుంచుకుంటాను.

నేను చేసే ప్రతి పనిలో నీవే ప్రతిఫలించాలని నా కోరిక. నీవు ప్రతిఫలిస్తే నాకు ఏ పని చేయాలన్నా శక్తి కలిగేది.🔻

నీవు పాడుతూ వున్నప్పుడు నేను వింటాను. నీవు ఎలా పాడుతున్నావో, ఏమి పాడుతున్నావో నాకు అవగతం కాదు. అయినా నిశ్శబ్దంగా ఆశ్చర్యంతో ఆ పాట వింటాను.

నీ గానజ్యోతి యీ ప్రపంచాన్నంతా దీప్తం చేస్తుంది.

పరమ పావనమైన నీ గానవాహిని రాళ్ళనూ, రప్పలనూ ఛేదించుకుని పరుగులు తీస్తూ ప్రవహించి పోతుంది.

నీ గానంలో శ్రుతి కలపాలని నా హృదయం అర్రులు చాస్తుంది. కాని ఎంత పెగల్చుకున్నా గొంతులో నుంచి వెలువడదు. మాట బయటకు వచ్చినా మాట పాటగా మారదు.

ఏం చేయాలో తోచక వెర్రిగా ఏడుస్తాను.

ప్రభూ నీవు నన్ను నీ గానాల వలలో బందీని చేశావు సుమా🔻

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!