Posts

శ్రీ మాత్రే నమః.

Image
అమృతమధనం జరిగిన సమయంలో, అందులోనుంచి కల్పవృక్షం,కామధేనువు,పాంచజన్యం, పారిజాతం, ఉచ్చై శ్రావం, ఐరావతం, కౌస్తుభమణి, కాలకూటం, చంద్రుడు, లక్ష్మిదేవి ఉద్భవించడం జరిగింది.  వీళ్ళందరూ సోదరసోదరీ గణం కాబట్టి లక్ష్మీదేవికి వాళ్ళపోలికలు కొన్నివచ్చాయి. చంద్రుని నుంచి వక్రత్వం, ఉచ్చైశ్రవం నుంచి చంచలత్వం, విషం నుంచి మైకం, అమృతం నుంచి మదం, కౌస్తుభమణి నుంచి కాఠిన్యం లక్ష్మీదేవికి వచ్చాయి. అందుకే ఆమే ఎప్పుడు, ఎందుకు దూరంగా వెళ్ళుతుందో తెలియదు. అయితే విద్యాసంపన్నుల దగ్గర ఆమే ఎందుకు ఉందటం లేదన్నది ప్రశ్న. ఆ తల్లి వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నది నిఝం. భౌతికమైన ధనరూపంలో కాదు. ఎన్ని వేల కోట్ల రూపాయలను గుమ్మరించిన రాని ఆత్మ శాంతి, స్తిథప్రగ్న్యత రూపంలో ఆమే వారి మన్సుల్లో ఉంటుంది. అమ్మ మనలోనే ఉంది అన్న విషియం గ్రహించటానికి కూడా ఆవిడే శక్తి ఇవ్వాలి...! శ్రీ మాత్రే నమః.

కిటియై కౌగిట జేర్చెను,

Image
కిటియై కౌగిట జేర్చెను, వటుడై వర్ధిల్లి గొలిచె, వడి కృష్ణుండై ఇట పద చిహ్నములిడె, క్రిం దటి బామున నేమి నోచితమ్మ ధరిత్రీ?! (పోతన...)

లలనా! యేటికి తెల్లవాఱె?

Image
లలనా! యేటికి తెల్లవాఱె? రవి యేలాదోఁచెఁ బూర్వాద్రిపైఁ? గలకాలంబు నహంబుగాక నిశిగాఁ గల్పింపఁ డా బ్రహ్మ దా వలఱేఁడుం గృపలేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లోకదే; కలదే మాపటికాల మందు మనకుం గంజాక్షు సంభోగముల్. ఏమే చెలీ! అప్పుడే ఎందుకు తెల్లవారిపోయిందే! తూర్పుకొండమీద ఆ సూర్యుడు ఎందుకు పొద్దుపొడిచేసేడే బాబు! అవును పగళ్ళన్నవి లేకుండా ఎప్పటికి తెల్లవారని రాత్రిళ్ళుగా ఎందుకు చెయ్యడే ఈ బ్రహ్మదేవుడు! ఈ మన్మథుడేమో మరీ కరుణమాలిన వాడైపోయాడు; చిలకలను చూస్తే వారించేవాళ్ళే లేరు; ఇంకా ఎలాగమ్మా బతకటం! అసలు రాత్రి ఎప్పటికేనా అవుతుందా! ఆ కలువ కన్నుల కన్నయ్యతో కలిసే అదృష్టం లభిస్తుందంటావా! (పోతనామాత్యుడు.)

సుందరకాండ విశిష్టత:

Image
సుందరకాండ విశిష్టత:  ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ. ఇది రామాయణంలో ఐదవ కాండ. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. బ్రహ్మాండపురాణం ఈ కాండమును "సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః" అని, "బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి" అని, "అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్" అని ప్రశంసించింది. సుందరకాండకు ఆ పేరు ప్రతిపాదించడానికి అనేక కారణాలున్నాయి. తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ. భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు. అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము. హనుమ సీతారాములిరువురికి ఆనందం కల్గించి సుందరుడైనాడు. ఈ విధముగా పాత్రోచితరీతిలో సుందరకాడ శ్రీరాముని, సీత ...

"వేంకటేశ్వరా!"

Image
దివ్య దంపతుల శృంగారాన్ని భక్తితో వర్ణించిన వారిలో అన్నమయ్య చాలా ప్రముఖంగా కనిపిస్తాడు. అలమేలుమంగా వేంకటేశ్వరుల శృంగారాన్ని తన సంకీర్తనలలో అతను పుష్కలంగా వర్ణించడం అందరికీ తెలిసిన విషయమే. సంకీర్తనలే కాకుండా, "వేంకటేశ్వరా!" అనే మకుటంతో ఒక శతకం కూడా రచించాడు అన్నమయ్య. ఈ శతకంలో కూడా వారిద్దరి శృంగార విలాసాలు రకరకాలుగా చిత్రించబడ్డాయి. అందులో ఒక సరసమనోజ్ఞమైన సన్నివేశాన్ని వర్ణించే పద్యం ఒకటి రుచి చూద్దాం: "అందవు, కోసి యిమ్ము విరు" లంచును జే రలమేలుమంగ ని  న్నుందగ గోర జెక్కులటు నొక్కిన నాకును నందవంచు న  య్యిందుముఖిం బ్రియంబలర నెత్తుచు పువ్వులు కోయజేయ ని  ష్యందమరందఘర్మరససంగతు లబ్బెను వేంకటేశ్వరా !  స్వామివారు తన సతితో కూడి ఉద్యానవనంలో విహరిస్తున్నారు కాబోలు. అక్కడ కొన్ని పూల చెట్లున్నాయి. ఆ పూలు కోసుకోవాలని అమ్మవారికి కోరిక పుట్టింది. కాని అవి ఎత్తుగా ఉన్నాయి. "ఆ పూలు నాకందవు, మీరు కోసిపెట్టం"డని గోముగా అడిగిందావిడ. అయ్యవారేమయినా తక్కువ తిన్నారా! నాక్కూడా అందవని చెప్పి, నువ్వే కోసుకోమని ఆమెని ప్రేమతో యెత్తుకున్నారు. ఆమె పూలు కోస్తూ ఉంటే, ఆ పూలన...

“వీణాపుస్తక పాణి”

Image
సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా ఉన్న కాళిదాసుకి “వీణాపుస్తక పాణి” ఎప్పుడు  పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమై పలకరిస్తుందిట. ఒకరోజు చదువుల తల్లి తన వద్దకి వచ్చినపుడు కాళిదాసు ఇలాప్రశ్నిస్తాడు? “అమ్మా! ఇప్పుడున్న కవి,పండితులలో కవి ఎవరు? పండితుడు ఎవరు?అని.” అపుడు సరస్వతి ఇలా అంటుంది.  “కవిర్దండీ కవిర్డండీ భావభూతిస్తు పండితః” అని శ్లోకపాదం చెప్పిందట. అనగా సంస్కృతంలో దశకుమార చరిత్రం అనే గొప్ప కావ్యాన్నివ్రాసిన దండి అనేవాడే మహాకవి అనుటలో సందేహం లేదు, అని తెలపడానికే రెండు పర్యాయాలు “కవిర్దండీ కవిర్దండీ” అనిపలికి, ఉత్తరరామ చరితం వంటి మహోన్నతమైన నాటకాలు వ్రాసిన భవభూతిని మహాపండితుడు అని వాగ్దేవి చెప్పిందట. అప్పుడు కాళిదాసుకి చాలకోపంవచ్చిందట. కారణం తనని కవి అనికాని,పండితుడని కాని గుర్తించలేదని. లోకంలో కవులు,పండితులేకదా! ఉండేది. తాను ఏ కోవకి చెందని వాడనా అని. వెంటనే “కోహం – -(తరువాతి పదం ఒక తిట్టు.అందుకని పేర్కొన లేదు.) ఓ – నేనెవరిని ? అని గట్టిగా అడిగేడట. పిల్లల కోపాన్ని తల్లి సహించి బుజ్జగిస్తుంది కదా! అందుకే వెంటనే అమ్మ --- “త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం న సంశయః.”  అన...

అనామిక ....

Image
కాళిదాస మహాకవి గొప్పతనం జగద్విదితం. అందుకే “కవికుల గురు: కాళిదాసః” అని  అందరిచే కీర్తించబడినాడు. ఇంకా కాళిదాసు గొప్పతనాన్ని తెలిపే ఒక చక్కని శ్లోకాన్ని  తెలుసు కొందాం.  “పురా కవీనాం గణన ప్రసంగే /  కనిష్టికా దిష్టిత కాళిదాసః// అద్యాపి తత్తుల్య కవేరభావాత్  అనామికా సార్థవతీ బభూవ //  “ పూర్వం కవులని గణన అనగా ఎవరు ముందు ఎవరు తరువాత అని లెక్కించడం  ప్రారంభించగా, చిటికిన వేలుని (ప్రధమ స్థానాన్ని) కాళిదాసు అధిరోహించెనట. తదుపరి  రెండవ స్ధానం కోసం (ఉంగరం వేలుకి “అనామిక” అని పేరు.) రెండవ వేలుని అధి రోహించడానికి ఇప్పటికీ కాళిదాసుతో సమానమైన కవి లేనందున ఆ రెండవవేలుకి  అనామిక అనేపేరు సార్థకమైంది.”