Posts

సతి దేవి ప్రాణ త్యాగం......పోతన భాగవత పద్యం.!

Image
సతి దేవి ప్రాణ త్యాగం......పోతన భాగవత పద్యం.! . తండ్రి అయిన దక్షప్రజాపతి దక్షయజ్ఞ సమయంలో ప్రవర్తించిన తీరును నిరసించి సతీదేవి పలికిన పలుకులు:  . జనుడజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు స య్యన వెళ్లించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్ ఘను నిందించిన నీ తనూభవ ననంగా నోర్వ నీ హేయ భా జనమైనట్టి శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాప్తించెదన్ . భావం:  మనిషి, తనకు తెలియకుండా తినకూడని పదార్థాలు తిన్నప్పుడు వెంటనే వాంతి చేసుకుని ఉదరాన్ని శుభ్రం చేసుకుంటాడు. చెడు స్వభావం కలిగిన నువ్వు, గొప్పవాడైన పరమశివుని నిందించిన కారణం చేత, నేను నీ కుమార్తెను అనిపించుకోవడాన్ని సహించలేను. అందువల్ల ఈ అసహ్యమైన శరీరాన్ని విడిచి, పవిత్రతను పొందుతాను.

దేవుడా ఓ .. FB దేవుడా …

Image
దేవుడా ఓ .. FB దేవుడా … నాకు రాయడానికి ” WALL” ఇచ్చావ్ ..  నొక్కడానికి ” LIKE “ఇచ్చావ్ ..  తోక లాగ ” TAG ” పెట్టావ్ .. నస పెట్టడానికి ” CHAT ” అన్నావ్ .  గొప్పలు చెప్పడానికి ” STATUS ” ఇచ్చావ్ …  అందం చూపడానికి ” PHOTOS ” ఇచ్చావ్ …  అల్లరి పిడుగుల కి ” GROUP “లు పెట్టావ్ .. క్లాసు లీడర్స్ కి ” PAGE “లు చూపెట్టావ్ . .  న…వ్వులు ” OPEN ” అన్నావ్ ..  నసుగుడు “SECRET ” అన్నావ్ ..  చాడీలు “SHARE ” చెయ్ అన్నావ్ ..  “APPLICATIONS ” తో మాయ చెయ్ అన్నావ్ ..  నోట్స్ రాయని నాతో , Facebook లో ” NOTES ” రాయిస్తున్నావ్ ..  నా ” POST ” లని అందరికీ చూపించి , నవ్వులు పూయిస్తున్నావ్ ..  అందుకే నువ్వు నాకు నచ్చావ్ … I like you somuch

పోతన - శ్రీమద్భాగవతం....... పంచమ స్కంధం..

Image
పోతన - శ్రీమద్భాగవతం....... పంచమ స్కంధం.. . బహుకుటుంబి యగుచు బహు ధనాపేక్షచే నెండమావుల గని యేగు మృగము కరణి బ్రేమ జేసి పరువులు వాఱుచు నొక్కచోట నిలువకుందురెపుడు . . ఈ మనుషులు తమతమ కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటారు . డబ్బు మీద వ్యామోహం పెంచుకుంటారు. లేళ్లు ఎండమావుల వెంట పరుగులు తీసే విధంగా కోరికలను నెరవేర్చుకోవాలనే అత్యాశతో మానవులు ఎక్కడా నిలకడగా ఉండక నిరంతరం పరుగులు పెడుతుంటారు. అల్పధనుడు విశ్రమాస్థానముల దృప్తి బొందకొరుల ధనము బొందగోరి యరిగి వారి వలన నవమానముల బొంది యధికమైన దుఃఖమనుభవించు . ధనం తక్కువగా ఉన్నవాడు, అంటే కొద్దిపాటి ఆస్తి మాత్రమే ఉన్నవాడు,  తనకు ఉన్న ధనం, గృహం, విశ్రాంతి మందిరాలతో తృప్తి చెందడు.  అంతటితో ఊరుకోక పక్క వారి ధనాన్ని కూడా పొందాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఇతరుల వలన అవమానాలు పొందుతాడు. అంతేకాక మరింత దుఃఖాన్ని అనుభవిస్తాడు. . అంతగొందఱల్ల నన్యోన్య విత్తాది వినిమయమున గడుబ్రవృద్ధమైన వైరములను బొంది పోరాట వొందుదు రాత్మ చింతలేక యనుదినంబు . . కొందరు డబ్బుకి సంబంధించిన లేదా ద్రవ్యానికి సంబంధించిన లావాదేవీల కారణంగా ఒకర...

ఎక్కడనో జనించి,పరమేశ్వరు డిచ్చిన గాలి పీల్చి,.....

Image
ఎక్కడనో జనించి,పరమేశ్వరు డిచ్చిన గాలి పీల్చి, వే రొక్కరి జోలికేగక, యెదో భుజియించి , సరోవరాలలో  గ్రుక్కెడు నీళ్ళు గ్రోలి, విను త్రోవల నేగెడు రాజహంసపై  రక్కసి బుద్ధి చెల్లునె? మరాళ మరాళ శరాగ్ను లోర్చునే? -- కరుణశ్రీ.  (“కరుణశ్రీ” అనే కావ్యం నుండి. హంసను గాయపరచిన దేవదత్తునితో సిద్ధార్థుడు)

వెంపటి చిన సత్యంగారు.

Image
వెంపటి చిన సత్యంగారు. . వెంపటి చిన సత్యం గారికి కూచిపూడి అన్నా, కూచిపూడి వారన్నా ప్రాణం. మద్రాస్ వెళ్ళినా కూచిపూడి కోసం తహ తహలాడేవారు. కూచిపూడి డాన్సు పైకి వస్తే తన వాళ్ళంతా బాగు పడతారని ముప్ఫయి ఏళ్లుగా తపన పడుతూ వచ్చారు. ఈవేళ కూచిపూడికి అంతర్జాతీయ ప్రాముఖ్యం వచ్చింది. కూచిపూడి భాగవతులుగా వొకప్పుడు గర్భ దారిద్ర్యం అనుభవించిన వారంతా ఈవేళ కూచిపూడి డాన్సు మాస్టర్లు గా పేరు పొందారు.  చిన్న సత్యం గారు మద్రాస్ వెళ్ళే సమయానికి అక్కడ వేదాంతం రాఘవయ్య, వెంపటి పెద్ద సత్యం, పసుమర్తి కృష్ణ మూర్తి వంటి కూచిపూడి వాస్తవ్యులు సినిమా రంగంలో ఉన్నత స్థితిలో వున్నారు. పేరుతో పాటు డబ్బుకూడా సంపాదించుకొన్నారు.  అయినా వాళ్ళెవరికీ పట్టలేదు, కూచిపూడి గురించి కాని కూచిపూడి నృత్యం గురించి కాని. చిన్న సత్యం వొక్కరే నిలబడ్డారు.  తన స్కూల్ కి కూచిపూడి ఆర్ట్ అకాడెమి అని పేరు పెట్టుకొన్నారు. అది ఎందరికి నాట్య బిక్ష పెట్టిందంటే, ఇప్పుడు కేవలం డాన్సు మీద ఆధార పడ్డ వాళ్ళయినా, సినిమా వాళ్లయినా సరే, ప్రతివారూ తాము కూచిపూడి ఆర్ట్ అకాడెమి చిన్న సత్యం గారి శిష్యులమని చెప్పుకునే వారే.. x

వికటకవి..

Image
వికటకవి.. తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. . ఒకమారు అల్లసాని పెద్దన వారు ఒక కవితలో "అమావాశ్యనిశి" ని ఛందస్సు కోసం "అమవసనిసి" అని వాడగా దానికి రామలింగకవి చెప్పిన అద్భుతమైన చాటువు, ఎమి తిని సెపితివి కపితము బెమ పడి వెరి పుఛ్చ కాయ మరి తిని సెపితో ఉమెతకయలు తిని సెపితో అమవస నిసి యనుచు నేడు అలసని పెదనా || ఇక్కడ "అలసని" అని హేళన చేస్తూ, అమవసనిసి అనేది స్వచ్ఛత లేని పదం అని కవీంద్రులు ఘాటుగానే సెలవిచ్చారు. కావలి తిమ్మడు మరొకమారు వాకిటి కావలి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పథకం వేసి వాకిటి కావలి తిమ్మా ! ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా ! నీకిదె పద్యము కొమ్మా ! నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !! అంటూ చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి తిరుమలరాయల గురించి రాయల సోదరులైన తిరుమలరాయలు తనపై కవిత చెప్పుమని అష్టదిగ్గజములని అర్ధింపగా, అందవిహీనుడు, ఒంటి కన్ను వాడైన తిరుమలరాయల గూర్చి యేమి కవిత్వం చెప్పాలి అని సంశయంలో ఉండగా, రామకృష్ణ కవి ఇలా స్తుతించాడు. అన్నాతి గూడ...

స్త్రీ స్వాతంత్ర్యము --

Image
స్త్రీ స్వాతంత్ర్యము -- . (సాక్షి వ్యాసాలు శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు.) . పదాలు గుప్పించడంలోను, ఒకమాటకు పది మాటలు వాడి వ్యంగ్యాన్ని, వర్ణనను, హాస్యాన్ని రంగరించడంలోను జంఘాలశాస్త్రి ఉద్ధండుడు. మహిళలంతా ఓచోట గుమికూడితే ఎలా ఉంటుందో చెప్పడంలో జంఘాలశాస్త్రి ఇలా రెచ్చిపోయాడు. -- 'ఎక్కడ వినిన గాజుల గలగల, అందెల ఝణఝణ , కాంచీఘంటికల గణగణ, ఎక్కడజూచిన జెక్కుటద్దముల తళతళ, గుబ్బిగుబ్బిల పెళఫెళ, తారాహారముల మిలమిల, వేణీభారముల జలజల, ముద్దుమొగాముల కలకల, ఎక్కడకు బోయిన నగరు ధూపముల గమగమ, చందన చర్చల ఘుమఘుమ, మృగమదలేపముల ఘుమఘుమ... --- కొర్నాటి చీరలవారు, బనారసుకోకలవారు, బరంపురపు పీతాంబరములవారు, సన్నకుసుంబాచీరలవారు, గోచికట్లవారు, గూడకట్లవారు, చుట్టుత్రిప్పులవారు, మేలిముసుగులవారు, వ్రేలుముళ్ళవారు, జడచుట్లవారు, వంకకొప్పులవారు ...