ఊడుపుల పాట!
ఊడుపుల పాట! రాయినా శందనాలో ఓయిబామల్లాలా బామ లాల బావన్నిలాలా॥ రామలచ్చనుల్లాంటి రాజులు లేరు సీతమ్మలాంటి ఇల్లాలు లేదు ॥రాయి॥ పాడిపంటలు సల్లగుండాలి మా కూలిరైతుల కడుపు నిండాలి కామందులు సల్లగుండాలి దండిగ మాచేలు పండాలి ॥రాయి॥ ఉత్తర వచ్చె ఎత్తర గంప కాఱు మొయిలు ఆకాశమ్ము నిండె తొలకర్లో వర్షాలు కురువాలి ఎకరానికి బస్తాలు పండాలి ॥రాయి॥ నీరుపెట్టి దుక్కి దున్నాలి దుక్కిదున్ని మొక్క నాటాలి పక్కలిరిగే రాగుపండాలి పంట కరవులేకుండ మనముండాలి ॥రాయి॥ మా! రైతుబాబులు బాగుండాల ఆరి! పిల్లపాపలు సల్ల గుండాల ఆరి! ఆవుల్ని గోవుల్ని కాయాలి కాసినందుకు మాకు కానుకలియ్యాలి రాయినా శందనాలో ఓయి బామల్లాలా ॥రాయి॥ [ఊడ్పులు ఊడ్చేటప్పుడు పాడేపాట.]