ఒక పిలుపులో పిలిచితే – శ్రీరంగం గోపాలరత్నం – స్టేజ్ సాంగ్
ఒక పిలుపులో పిలిచితే – శ్రీరంగం గోపాలరత్నం – స్టేజ్ సాంగ్
http://www.4shared.com/mp3/ruyIkhOzba/OKA_PILUPULO.html
శ్రీ వేంకటేశ్వర వైభవం సినిమాలో గోపాలరత్నం గారు పాడిన “ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట” అనే పాట మనందరికీ పరిచయమే. ఆవిడ స్టేజ్ మీద పాడుతుండగా రికార్డు చేసినట్లున్న ఈ పాటను H. M. G. Murthy గారు www.sangeethapriya.org లోకి అప్లోడ్ చేశారు. ఈ పాటకు సంబంధించిన క్రెడిట్ అంతా కూడా వారికే చెందుతుంది. సినిమా కోసం పాడిన పాట ఫాస్ట్ గాను, ఈ పాట స్లో గాను ఉండటం గమనిస్తారు. ఈ పాటకు డైరెక్ట్ లింక్ ఇవ్వటం కుదరదు గాబట్టి ఈ పాటను కింద పోస్ట్ చేస్తున్నాను. ఎటువంటి అభ్యంతరాలున్నా తొలగించబడుతుంది. ఈ పాటను చాలా మంది విని వుండరని పోస్ట్ చెయ్యటం జరిగింది.
ఈ గీతాన్ని రచించినది ఏడిద కామేశ్వరరావు. తిరుమల తిరుపతి దేవస్థానం 60లలో నిర్మించిన "శ్రీ వేంకటేశ్వర వైభవం" డాక్యుమెంటరీ చిత్రంలో ఈ పాటని ఉపయోగించారు. ఇది ప్రముఖ కర్ణాటక, లలిత సంగీత గాయని కుమారి శ్రీరంగం గోపాలరత్నం గానం చేయగా బాగా ప్రజాదరణ పొందింది.
రాగం: మోహన (హిందూస్తానీ: భూపాలీ) తాళం: తిశ్రగతి (హిందూస్తానీ: దాద్రా)
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట
నా పలుకులో కులుకుతావట
ఆపదమొక్కులస్వామీ నీ సన్నిధె నా పెన్నిధి||
కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ
కొండచేరవచ్చితిని అండచేర్చి కాపాడరా||
అభయహస్తమున్నదట అభయమూర్తినీవెయట
అభయదానమిచ్చి నాకు భవతరణపధమ్ము చూపు||
వడ్డికాసువాడవట వడ్డీవడ్డీ గుంజుదువట
అసలులేనివారమయ్య వెతలుబాపికావవయ్య||
http://www.4shared.com/mp3/ruyIkhOzba/OKA_PILUPULO.html
Comments
Post a Comment