వలపు తేట !

వలపు తేట !


అనసూయ ,ప్రియంవద లు ఒకరికి మించిన వారిన్కొకరు , శకుంతల ప్రియ సఖులు. 

శ.శకుంతలా దుష్యంతుల ఆకార వికారాలను త్రుటి లో గ్రహించారు 

వారిద్దరూ .వలపు ల జ్వాల రగుల్తోందని తెలుసు కొన్నారు . 

శకుంతల తో వారు ”సఖీ శకున్తలే !యద్యత్రా దయ తాతః సన్నిహితో భవేత్ ”అన్నారు .

”నాన్న గారే వుంటే ఏం చేసే వారో ఇప్పుడు ”ఇది కదాగామనాన్ని వేగం చేసే మాట .

అంటే తండ్రి గారు చేయాల్సిన పని నువ్వే చేయాలి అని చెప్పకుండా

చెప్పటం .ఆమె లోపలి భావాన్ని వ్యక్తీకరించా టానికి తగిన మాట కూడా .

ఇద్దరి హృదయ భావాలను వెలికి తీసి,వలపు ను నాటి ,ప్రోది చేసే మాట .

శకుంతల కు చిరు కోపం వచ్చింది .

”వుంటే ఏం చేసే వారు “?అంది బుంగ మూతి పెట్టి .

సఖులు దేవాంతకులు కదా వెంటనే అందుకొన్నారు .’

ఇదం జీవిత సర్వస్వేనా వ్యతి దారో క్రుతార్దీ కరిష్యతి ”అన్నారు .

స్త్రీ సహజ మైన మాటలు ఇవి శకుంతలకు వచ్చిన కోపానికి

”మేమేం చేశామమ్మా అంత కోపం ”అన్నట్లు వుంది.

ఇంతకీ వాళ్ళ మాటల్లోని అర్ధం తెలుసోవాలి .”

నాన్న గారే వుంటే ,తమ జీవిత సర్వస్వాన్ని -

అంటే శకుంతలను అతిధి కి సమర్పించి వుండే వారు ”అని భావం .

ఆమెనే సమర్పించి వుండే వారు అని .లోని అర్ధం .

ఈ మాట ఆమె మనసు లోని కోరిక తీరే మాట .

ఆమె చెవులకు ఇంపైన మాట .

కర్ణ రసాయనం ప్రేయసీ ప్రియుల మనో గతాలను 

అతి స్వల్ప కాలం లో అవగతం చేసుకొన్న 

ఇష్ట సఖియలు వారిద్దరూ .సార్ధక నామ దేయులైనారు .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!