మా సావిత్రమ్మ..!

మా సావిత్రమ్మ..! 

.

“నవరసాలనూ రెండు నేత్రాలలో నింపుకున్న బంగారు బొమ్మ.., మా సావిత్రమ్మ..! నటనకు ప్రాణం పోస్తే సావిత్రి గారిలా ఉంటుంది. తెలుగుదనం తల ఎత్తి చూస్తే సావిత్రి గారి లాగే ఉంటుంది.జాలి, దయ, కరుణ అనే మూడింటికి త్రివేణి సంగమం మా సావిత్రమ్మ…” ఇప్పటికీ తెలుగు వారంతా అనుకునే మాటలు ఇవే తల్లీ!అప్పట్లో సావిత్రి గారి చీరకట్టు, వాణిశ్రీ కొప్పు, జమున గారి కాటుక లాంటివి బాగా ప్రఖ్యాతి గాంచిన మాటలు… కాని ఇప్పుడు ఆ చీరకట్టు చాలా బరువైపోయిందటమ్మా… బికినీలకి ఇచ్చే ప్రాధాన్యత నేటి కధానాయికలు చీరకట్టు కి ఇవ్వడం లేదు తల్లీ…ముద్దుగా బొద్దుగా ఉంటూనే మీరు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు, అలరించారు. ఈ రోజుల్లో తారలదరూ జీరో సైజ్ మోజులో పడి మరీ కరువు ప్రాంతపువాసుల్లా తయారౌతున్నారు. బాగా కొవ్వు పెరిగిపోయినా కూడా లైపోసెక్షన్ పేరుతో దాన్ని కరిగించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అతివ్రుష్టి, అణావ్రుష్టి అన్నట్టు ఉందమ్మా వీళ్ళ వరస… వీళ్ళకి మీలా క్రమబద్ధమైన అలవాట్లు కర్ర పుచ్చుకుని నేర్పడానికైనా ఒక్కసారి రావమ్మా…!

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!