శ్రీ రమణ మహర్షి .. ఆశ్రమము. !

శ్రీ రమణ మహర్షి .. ఆశ్రమము. !

.

శ్రీ రమణ మహర్షి : Sri Ramana Maharshi) (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. 

ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరు 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది 

తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు.బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి" గా ప్రకటించుకున్నారు.

రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవారు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడివడియున్ననూ అడిగినవారి మనస్థితిని బట్టి వారికి మార్గముల భక్తిని కూడా బోధించేవారు.

.

భగవాన్ గురించి చలం!

భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. 

ఆయన గంభీరత్వంలోనూ, లోకం మీద ఆయనకి వున్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం 

నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను వొప్పుకుంటాను.

నాకు స్త్రీ వుంది. మీకు దేవుడున్నాడు.స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని,

అంటే కీర్తీ, డబ్బూ కాదు- అంతకన్న శ్రేష్టమైనవి -జీవితం మీద ఆసక్తినీ-శక్తినీ-బతకడంలో ఆనందాన్నీ, (Grip on Life and Joy of Living) పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వెవేకవంతుణ్ణిగా తోస్తాను.

..

చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. 

రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి వున్నారు. ఆ తరువాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. 

దాని పేరే రమణస్థాన్.ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంతవరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు చాలా కొంచెం. చాలామంది కనపడరు.

భగవాన్ పోగానే తగాదాలు ఆశ్రమంలో! బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. 

లేచిపోతున్నారు.రౌడీలు, పోలీసు కాపలాలు - 

ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. 

కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది. ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో, కవి హృదయంలోనో, అట్లావుంది లోకం నాకు!

ఇప్పుడు ఆశ్రమం పిశాచం మల్లే, వొక కలమల్లే వుంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు.

చాలా వొంటరితనం. మా వాళ్ళు 15 రోజులకిందటే వెళ్ళిపోయినారు.

అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ వున్నారో తెలీదు. 

ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో! 

when you were in Thiruvannamalai go for a walk around the hill.

The Arunachala hill will gives the power to all the hill itself called 

( Tejolingam).Shankara charya we sat in the hill and done the mediatation around the hill.

if you can for a while into the hill you can catch the power.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!