సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు !!

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు !!

పారే నది..... వీచే గాలి.... ఊగే చెట్టు.... ఉదయించే సూర్యుడు.... అనుకున్నది సాదించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా,, ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..

లే బయలుదేరు, నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల 

సంకెళ్ళను తెంచేసుకో,, పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు, 

నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్, 

నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో, 

నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్.., 

మళ్ళీ చెప్తున్నా కన్నీళ్ళు కారిస్తే కాదు 

చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..

** చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అర్జునుడి గాంఢీవం నుండి దూసుకుని వచ్చే అస్త్రాలు **

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!