రావిశాస్త్రి - కథల్లో కవిత్వమే రాస్త్రి!

రావిశాస్త్రి - కథల్లో కవిత్వమే రాస్త్రి!

కోర్టులో ఆవరించి ఉన్న చీకటి మెజిస్ట్రేటుగారి మనసునిండా అలముకుంది.

న్యాయం పేరుతో కోర్టులో జరుగుతున్న దురన్యాయాన్ని గురించి మథన పడతారు.

ప్లీడర్ల నల్లకోట్ల నిండా వికృతంగా క్రూరంగా చీకటి 

పోలీసువారి ఎర్ర టోపీల నిండా చారలు చారలుగా చీకటి

చుట్టూ పడున్న ఖాళీ సారా కుండలనిండా చల్లారని చీకటి 

ముద్దాయిల కళ్ళనిండా దీనంగా అజ్ఞానపు చీకటి

.

కోర్టులో చట్టాన్ని కాపాడే పేరుతో ప్లీడర్లు, పోలీసులు చేస్తున్న అన్యాయాలకు 

ప్రతీక ఇక్కడి చీకటి పదం.

పదే పదే చీకటి అనే పదం ఒక్కొక్క అర్థంలో ప్రయోగించబడింది. 

.

చివరకు నిరపరాధులైనా సాక్ష్యాలు బలంగా ఉండడంతో, 

కోర్టులోని న్యాయసూత్రాలు తెలియక నిరక్ష్యరాస్యులుగా ఉన్న 

అమాయకపు ముద్దాయిలను శిక్షించవలసి రావడం మెజిస్ట్రేటుగారిని భయపెడుతుంది. 

నామీద కొన్ని వేల పగలు లోకంలో కోటానుకోట్ల పగలు అనుకుంటాడు.

పగ అనగానే సంప్రదాయపు విశ్వాసం 

పాములు పగపడతాయని గుర్తువచ్చి 

చుట్టూ ఉన్న సారా ట్యూబులు పాముల్లా కనిపించాయి. 

పాముల్లా వాటి పడగల్లా ఏమిటి ఏమిటవి రోజూ ఇలాగే పాముల్లా 

సారూ ట్యూబులు మోటర్లవి, సైకిళ్ళవి, ఎర్రవి, నల్లవి అన్నిట్లోనూ సారా 

కోర్టుకొస్తే సారా 

కోర్టులో ఉన్నంతసేపూ సారా 

రోజూ దాదాపు ప్రతి కేసూ సారా.....

ఇలా సారా కేసులు తీర్పుల మధ్య నలిగిన మెజిస్ట్రేటుగారికి నిరపరాధులకి జైలు 

శిక్ష వేసి పాపం మూటకట్టుకుంటున్నాననే అపరాథ భావం కలిగింది. 

రావుగారి మెదడంతా చీకటి గదిలా ఉంది 

చీకటి గదిలో చీమల ఏడుపు వాటి గురించి తేళ్ళు, జెర్రులు 

నరకం ఎలా ఉంటుంది తేళ్ళతో, జెర్రులతో అతి చీకటిగా 

అక్కడ ఏముంటాయి పగపట్టిన చలిచీమలు .... 

రావుగారి మానసిక సంఘర్షణను ప్రతీకాత్మకంగా సూచించిన పదచిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. చీకటిగది జైలుని

, చీమల ఏడుపు అనే పదబంధం 

జైల్లోని ఖైదీల బాధని, తేళ్ళు, జెర్రులు పోలీసులు వార్డర్లని సూచిస్తాయి. 

చలిచీమల చేత చిక్కి పద్యం గుర్తు రావడంలో 

ఆ నిరపరాధులంతా కలిసి తనను చంపుతారేమోని రావుగారికి భయం వేసింది. 

.... రావుగారి మానసిక సంఘర్షణను ప్రతీకాత్మకంగా సూచించిన పదచిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. చీకటిగది జైలుని, చీమల ఏడుపు అనే పదబంధం జైల్లోని ఖైదీల బాధని, తేళ్ళు, జెర్రులు పోలీసులు వార్డర్లని సూచిస్తాయి. చలిచీమల చేత చిక్కి పద్యం గుర్తు రావడంలో ఆ నిరపరాధులంతా కలిసి తనను చంపుతారేమోని రావుగారికి భయం వేసింది. 

నా చేతులు నల్లని తాచులు

నా చేతుల మూతుల్లో ఐదేసి నాలుకలు అన్నేసి కోరలు

ఈ సిరాలో విషం నా కలంలో కాటు 

మెజిస్ట్రేటు పాత్రలో క్రమక్రమంగా కలిగే సంఘర్షణను 

కవితాత్మకమైన, ప్రతీకాత్మకమైన పదచిత్రాలతో వర్ణించారు రావిశాస్త్రి గారు .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!