ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి .!

ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి .!

.

ఈ శరీరానికి ఒక్కటే ప్రయోజనం!

‘బోధన’ను బయలు పరచడం

ఉపన్యాసాలు ఆపివేయడం తోటే

ఈ శరీరం మరణిస్తుంది.

-

తనను తాను సంరక్షించుకోవాలనుకోవడం,

మార్పులకు అవరోధం కలిగించాలనుకోవడం...

మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఓ ఆసక్తి.

జీవితంలో సరళమైన మార్పులు తీసుకువచ్చి

మనసుకు వయసు రాకుండా చూసుకోవచ్చు.

అందుకు విస్తృతమైన అవగాహన అవసరం.

.

"నా ప్రధాన లక్ష్యం ఒక్కటే_వ్యక్తి స్వేచ్చ .అన్ని భయాలనుండి,బంధాలనుండి మనిషిని విముక్తి చెయ్యాలి."

నేను ఎవరికీ గురువును కాను నాకెవరు అనుచ రులు లేరు.

.

ఆయన ఏ మతానికి,ప్రాంతానికి,దేశానికి చెందకుండా ,ఏ సంస్థను స్థాపించకుండా ,ఏ తత్వాన్ని ప్రచారం చేయకుండా ప్రపంచమంతా తిరుగుతూ తూర్పు,పశ్చిమ దేశాల్లో ,అన్ని కాలాల్లోని తత్వవే త్తల్లో గొప్ప స్థానం సంపాదించుకున్నారు.

.

*ప్రకృతి సృష్టించిన ఈ అందమైన భూమిని,పర్యావరణాన్ని ,ఇందులో నివసిస్తున్న మానవులను రక్షించుకోవాలని పిలుపిచ్చారు.

ఆయన బోధనల్లోని ముఖ్యాంశాలు.

*సత్యానికి మార్గం ,పథం అంటూ ఏమీ లేదు.

* అన్ని జీవనకళల్లోకి ధ్యానం ఉన్నతమైనది.

*అసలైన విప్లవం పేరు ప్రేమ.మనిషిలోను,సమాజం లోను మార్పు తీసుకు రాగలిగింది ప్రేమ.

*మనలో మానసిక విప్లవం రావాలి.గతాన్నిపూర్తిగా నాశనం చేయగల విప్లవం.

*జ్ఞానం వలన మనిషి సమస్యలు పరిష్కారం కావు.సమస్య పరిష్కారానికి వివేకం కావాలి.

*ప్రేమ నిండిన మనస్సులోనే సత్య దర్శనం అవుతుంది.

*హృదయం చెప్పింది వినండి.హృదయం చెప్పినట్లు చేయండి.వెలుగు మీలోనే వుంది.

*నిన్నునీవు గమనించు.అదే ధ్యానం.ధ్యానం అన్నది పరిపూర్ణ స్వేచ్చ.

*జీవించి ఉండగానే బంధాలన్నీ వదిలి మనసు శూన్యం అయితే ....మృత్యువు తర్వాత అదేకదా స్థితి.జీవిస్తూనే అలా మృత్యువును అనుభూతించడం గొప్ప అనుభవం.అదే సిసలైన ధ్యానం.

*ప్రేమ,అనురాగాలతో మనిషిలో మార్పు వస్తుంది.మనలో ద్వేషం వుంటే ఇవి ఏర్పడవు.

*మరో జన్మ లేదు.భూమి మీద పుట్టిన ప్రతి జీవి నశిస్తుంది.ఆ రహస్యం తెలుసుకోవడమే జ్ఞానం.

జీవించడం అంటే ప్రతిరోజు పెంచుకున్న అనుబంధాల్ని ఒక్కొక్కటిగా తెంచుకోవడం.

*వివేచనతో,విచక్షణతో,అవగాహనతో.చైతన్యంగా ,స్వేచ్చగా,వర్తమానం లో వినడం అనేది జీవితంలో అన్నింటి కన్నా ముఖ్యం.మనం ఏ పని చేసినా దానిని ప్రేమతో చేయాలి.

*సత్యం మీ నిత్య జీవితం లోని ప్రతి కదలిక లోను వున్నది.

*సత్యాన్వేషణమే నిజమైన విద్య.

*విద్య యొక్క కర్తవ్యం ప్రజ్ఞావంతులైన సమగ్ర మానవులను,పూర్ణ పురుషులను సృష్టించడం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!