నానాటి బదుకు నాటకము,,,,,

అన్నమయ్య కీర్తన.!

.

నానాటి బదుకు .........

(రాగం:ముఖారి ) (తాళం : )

నానాటి బదుకు నాటకము

కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము పోవుటయు నిజము

నట్టనడిమి పని నాటకము

యెట్ట నెదుట గల దీ ప్రపంచము

కట్ట గడపటిది కైవల్యము

కుడిచే దన్నము కోక చుట్టెడిది

నడ మంత్రపు పని నాటకము

వొడి గట్టుకొనిన వుభయ కర్మములు

గడి దాటినపుడె కైవల్యము

తెగదు పాపము తీరదు పుణ్యము

నగి నగి కాలము నాటకము

యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక

గగనము మీదిది కైవల్యము

.

ఈ పదములోని కోక చుట్టుకోవడము, ఒడి నింపుకోవడము వంటి పదాల వాడుక వల్ల ఇది ఎవరో స్త్రీకి భోధిస్తూ చెప్పిన హితములాగా కనిపిస్తుంది

.

నాటకము అంటే అన్నమయ్య గారి ఉద్దేశ్యము మాయ లేదా మిథ్య అనా? 

కానీ అన్నమయ్య వైష్ణవుడు, వీరు శంకరుల సర్వం మిథ్య అనే బావామును పూర్తిగా విమర్శిస్తారు, ఇదే విషయంపై అన్నమయ్య పాటలు కూడా ఉన్నాయి,

.

కనుక నేను పూర్తిగా ఈ విషయములో ఓ నిర్ణయమునకు రాలేకపోతున్నాను

అదే కాకుండా మిథ్య అంటే మనము జీవితాన్ని ఎలా వస్తే అలా తీసుకోవాలి,

"నాటకము" అంటే "సూత్రదారి" (లేదా డైరెక్టరు) చెప్పినట్లు నటించాలి, 

అనగా ఆ "నటనసూత్రదారి" అయిన దేవదేవుడు చెప్పినట్లు నటించాలి 

అని వారి ఉద్దేశ్యము అయిఉండవచ్చు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!