సుభద్రా కల్యాణము! (తాళ్లపాక తిమ్మక్క రచన.)

సుభద్రా కల్యాణము!

(తాళ్లపాక తిమ్మక్క రచన.)

నివ్వెర పడి యుండె - నెలత సుభద్ర

మరి యెన్నోరీతుల - మాయల తపసి

నెరవక తను జూడ - వెరగందె నబక్వ్ల

గ్రక్కున శ్రీ కృష్ణ - కడకు నేతెంచి

యెక్కడి యవి వరుం - డితడు వోయన్న

చూడ నయమి గాని - చూరకా డితడు

ఆడెడి మాటలి - ట్లని పల్క రాదు

సరస మాడగ వచ్చు - సారె నాతోను

సొంపు నొయ్యారంపు - చూపులే తరచు

ఇత్తరి నే భిక్ష - మిడి నత దాను

పొత్తువ భుజియింప - పొలతి రమ్మనెను

ఎంత జేసితిరి మీ - రిటువంటి వారి.

నంతఃపురమ్ములో - నర్యమా యుంచ

అన్న యీ సన్యాసి - ననుపుమా వేగ

ఎన్నిక బూజింప - నే దగవు గాదు

తన్ను జూడగ నిల్వ- తగవుగా దితడు

కటకట యిటువంటి - కపట సన్యాసి

నెటులవలె బూజింతు - నిందిరారమణ

అనిన నవ్వుచు గృష్ణు - డా యతీశ్వరుని

వినయమ్ముతో బిల్చి - వేడ్క నిట్లనెను

అయ్య మీపనులన్ని - ఆగడాలాయె


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!