కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !
శ్రీ కృష్ణ స్తోత్రము . శ్లో !! కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ ! నాసాగ్రే నవమౌక్తికం కర తలే వేణుం కరే కంకణమ్ ! సర్వాంగే హరి చందనం చ కలియన్ కంఠే చ ముక్తావళి ! గోప స్త్రీ పరివేష్టి తో వవిజయతే గోపాల చూడామణీః !! తా. లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్న వాడును , వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించిన వాడును , ముక్కునకు బులాకీగా మంచి ముత్యమును ధరించిన వాడును , చేతుల లో వేణువు గలవాడును , చేతులకు కంకణములు ధరించిన వాడును , దేహమందతటను హరిచందనము పూయ బడిన వాడును , కంఠమునందుముత్యాల హారమును ధరించిన వాడును , గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును , అగు గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు విజయమునుపొందు గాక !!
సంస్కృత మూలం:
ReplyDeleteనాహం భక్షితవాన్ అంబ
సర్వే మిథ్యాభిశంసినః
యది సత్య గిరస్తర్హి
సమక్షం పశ్యమె ముఖం
సినారె గారు ఈ పద్యాన్ని గురించి చక్కగా వివరించారు... పోతన మకరందాలో..మందారమకరందాలో అనుకుంటా..
ReplyDelete