ఒక రాజు, యేడుగురు కొడుకులు!

ఒక రాజు, యేడుగురు కొడుకులు!

,

అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండీవారు. ఒక రోజు ఆ యేడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్ళారు. యేడు చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన చేపలిని యెండబెట్టారు.

సాయంత్రానికి ఆరు చేపలు యెండాయి కాని, యేడొ చాప యెండలేదు. ఆ చేపను పట్టిన రజకుమారుడు చేపని “చేప చేప ఎందుకు యెండలెదు” అని అడిగాడు. ఆ చేప “గడ్డిమెటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది. ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప యెండకుండా యెందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు. గడ్డిమెటు అందీ “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని.

రాజకుమరుడు వెంటనే ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి యెందుకు మెయలేదు?” అని అడిగాడు. “నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది.

రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “యెందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు” అప్పుదు పాలెరాడు ఇల అన్నదు, “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని.

అమ్మ ని అడిగితే అమ్మ అందీ “ఆక్కడ పాప యెడుస్తొంది”

రాజకుమారుడు పాపని “పాప, పాప, యెందుకు యేడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు పెడుతూ చెప్పింది.

రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడు లాగ చీమ ని కూడ అడిగాడు “చీమ చీమ పాపని యెందుకు కుట్టావూ”

ఆప్పుదు చీమ అంది “నా పుట్టలో వేలు పెడితె నేను కుట్టనా” అని…

చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఈ కథ చెప్పేది. 

చాల కాలం ఇదొక మాములు కథ అనుకున్నను. పెద్దయ్యక మా పిల్లలకు ఈ కథ చెపుతున్నప్పుడు అర్ధం అయ్యంది. 

ఒకొక్క సారి చాల చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయని. 

చిన్న పాపను చీమ కుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనం లో యెండు చాప లేదు.

.

ఇది ఏంగ్లిష్ లో కూడ ఒక కవిత రూపం లో మనం వినే వుంటాము:

For want of a nail the shoe was lost.

For want of a shoe the horse was lost.

For want of a horse the rider was lost.

For want of a rider the message was lost.

For want of a message the battle was lost.

For want of a battle the kingdom was lost.

And all for the want of a horseshoe nail.

.......

మేకు లేక గుర్రపు లాడం పోయె.

లాడం లేక గుర్రం పోయె.

గుర్రం లేక బంటు పోయె.

బంటు లేక సందేశం పోయె.

సందేశం లేక యుధ్ధం పోయె.

యుద్ధం పోతే రాజ్యం పోయె.

అంతా చూస్తే మేకు లేక రాజ్యం పోయె.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!