యేదో మీసరదా కోసం!

యేదో మీసరదా కోసం!

.

ఒక మహనీయుడుకొన్ని సంవత్సరాలక్తితమే 

నేటి యువత పోకడ లెలా ఉంటాయో కనిపెట్టి పద్యాలు వ్రాశారు..

.

.

సీ

" సందులో స్టాండింగు , సతులకై వెయిటింగు ,

మోడరన్ డ్రెస్సింగు , ఫోజ్ గివింగు ;

సిగరెట్సు స్మోకింగు , సినిమాస్కు గోయింగు ,

ఫ్రెండ్సతో మూవింగు వాండరింగు;

ఇరిటేటు మైండింగు, హిప్పీసు కట్టింగు ,

రెకులెస్సు టాకింగు , రీజనింగు ;

కోయిన్సు స్పెండింగు , గుడ్నాట్టు హియరింగు ,

రెఛడుగా హెడ్ స్ట్రాంగు రిప్లయింగు ;

గీ

" విలను ఫోజింగు , తండ్రికి వేవరింగు ,

తల్లి ఫియరింగు , కార్య సాధన నథింగు,

భవ్య వైఖరి , తమ్ముళ్ళు ఫాలొయింగు ,

రాంగు గోయింగు ఈ మోడరన్ లివింగు !

.

అర్ధాలు సులభంగా తెలుస్తూనే ఉన్నాయి కదా!

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!