"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" !
"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" ! . "అల్లసాని వాని అల్లిక జిగిబిగి" పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి. ఉలుకు పలుకు లేని రాతి ప్రతిమల రమణీమణుల ప్రబంధ నాయికా ప్రపంచంలో మాట పాట నేర్చిన వలపుల వయ్యారి వరూధిని. అవయవాలే తప్ప ఆత్మలు లేని కావ్య నాయికా లోకంలో ఇష్టాలు, కోరికలు, కోపాలు, తాపాలు, ప్రణయాలు, విహారాల అనుభూతులు విరబూసిన విరి మంజరి సజీవ సుందరి వరూధిని. ఆమె ప్రవహించే ఒక యౌవన ఝరి, దహించే ఒక ప్రణయ జ్వాల, మిరుమిట్లు కొలిపే ఒక సౌందర్య హేల, ఒక విరహ రాగం, ఒక వంచిత గీతం, ఒక విషాద గానం. ఆంధ్ర కవితా పితా మహుడు అల్లసాని అంతరంగంలో వికసించిన ఒక అపురూప భావనా మల్లిక. తెలుగు పంచ మహా కావ్యాలలో ప్రథమ ప్రబంధం మను చరిత్ర. మార్కండ ేయ పురాణంలోని ఒక చిన్న కథను తీసికొని తన అద్భుత కవితా ప్రావీణ్యంతో ఒక రసవత్కావ్యం సృష్టించి తెలుగు కవిత్వ ప్రేమికులకు వెల లేని మధురాతి మధురమైన కానుకనిచ్చాడు పెద్దన. ఒక వరణా తరంగిణిని, ఒక అరుణాస్పద పురాన్ని, ఒక ప్రవరుని ఒక వరూధినిని, ఒక...