Posts

🌹🌹🌹🌹దొందూదొందే - సామెతకథ 🌹🌹🌹🌹

Image
🌹🌹🌹🌹దొందూదొందే - సామెతకథ 🌹🌹🌹🌹 ——————————//——————————— అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక నత్తి వాడుండేవాడు. అతన్ని అందరూ ఎగతాళి చేసేవారు. నత్తి కారణంగా అతనికి పెళ్ళి కాకుండా వుంది. చివరికి అతని తల్లితండ్రులు చాలా దూరంలో వున్న ఒక ఊరిలో అమ్మాయిని చూసి ఆ అమ్మాయితో తమ అబ్బాయికి పెళ్ళి చేశారు. పెళ్ళి జరుగుతున్నంతసేపూ ఇద్దరూ మాట్లాడకుండా కూచున్నారు. సిగ్గుపడుతున్నారని అందరూ అనుకున్నారు. 🌈 పెళ్ళి తంతు అంతా పూర్తి అయిన తర్వాత అబ్బాయినీ, అమ్మాయినీ పల్లకీలో ఎక్కించి అబ్బాయి ఊరికి పంపించారు. దారిలో వారికి పూచిన చింతచెట్ల వరస కనిపించింది. 👉నత్తివాడు సంతోషం పట్టలేక “ తింతలు తూతాయి” (చింతలు పూశాయి )అన్నాడట. 👉అది విని అమ్మాయి “ తూతే తెట్టు తుయ్యదా తాతే తెట్టు తాయదా “ (పూసే చెట్టు పుయ్యదా , కాసే చెట్టు కాయదా ) అన్నదట. 👉వారి వెనక వస్తున్నపురోహితుడు “ దొందూ దొందే “ (రెండూ రెండే) అని అన్నాడట. ఆ ముగ్గురు నత్తివాళ్ళను చూసి పల్లకీ బోయీలు నవ్వుకున్నారట..... అలాఅలా దొందూ దొందే అనే సామెత వాడుక లోనికి వచ్చింది........ 🌹🌹🌹🌹🌹————🌹🌹🌹——-🌹🌹🌹🌹

🔻మధ్య తరగతి మనో "గతం"

Image
  ( ఎవరో ఈల వేసి పిలిచినట్టు సెల్ ఫోను  మోగగానేఆయనకేసి చూశాను జాపుకున్న కాళ్ళకి పతంజలి నూని రాసుకుంటూ...  "పార్వతీ ! నీ కొడుకు నీ అకౌంటకి 2000 డాలర్లు పంపాడట ,  వ్వాట్సాప్ లో చెబుతున్నాడు" అన్నారు  మావారు శంకర ప్రసాదు గారు.  "డాలర్లలో చెప్పకండి, నాకర్ధమయ్యేట్టు రూపాయల్లో చెప్పండి" అన్నాను విసుగ్గా.  "2000 ని 74 తో గుణించు... రూపాయల్లో వస్తుంది " అన్నారు విద్యార్థికి లెక్క ఇస్తున్నట్టుగా  "ఆ గుణకారాలేవో  మీరే చెయ్యండి, లెక్కల మాష్టారు కదా ?" అన్నాను తెలివిగా . "లక్షా నలభై ఎనిమిది వేలవుతుంది" అని చెప్పేసి వ్వాట్సాప్ లోకి దూరిపోయారు యధాలాపంగా.  🚩 చెప్పొద్దూ... అమెరికా వెళ్ళినప్పుడల్లా ఏ మాల్ కి వెళ్లినా ధరలు చూసి వెంటనే 70 తో గుడించేదాన్ని,  నాకు ఏడో ఏకం బాగానే వచ్చు . రూపాయిల్లోకి మార్చాక గుండె గుభేల్మనేది . "ఇక్కడ రూపాయల్లో ఆలోచించ కూడదమ్మా" అనేవారు పిల్లలు. పుట్టుకతో వచ్చింది ఊరికినే పోతుందా ? 🚩 కరివేపాకు కట్ట 70 రూపాయలట ! అందుకే.. కూరల్లో,చారులో కొంచం తగ్గించే వేసేదాన్ని. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా ... ఎందుకో పాత జ్ఞాపకాలు వస్...

కన్యాశుల్కం

Image
- 🌹🔻 1955 లో 22 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అవి మిస్సమ్మ, రేచుక్క, చెరపకురా చెడేవు, కన్యాశుల్కం, జయసింహ, సంతోషం , అర్ధాంగి, రోజులు మారాయి, అనార్కలి, సంతానం, వదిన, దొంగ రాముడు, శ్రీ జగన్నాధ మహాత్మ్యం, బంగారు పాప, బీదల ఆస్థి, ఆడ బిడ్డ, వదినగారి గాజులు, అంతే కావాలి, విజయ గౌరి, కన్యాదానం, శ్రీ కృష్ణ తులాభారం, పసుపు కుంకుమ. అభినవ ఆంధ్ర సాహితీ వైతాళికుడు, తెలుగు కథకు ఆద్యుడు గురజాడ అప్పారావు గారు (21-09-1862 & 30-11-1915)పూర్తిస్థాయి వాడుక భాషలో రాసిన తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’. ప్రపంచ నాటకాల్లో కన్యాశుల్కానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. ఒక సమకాలీన సాంఘిక సమస్యను తీసుకొని, సభ్యసమాజంలో ఎదురయ్యే సామాన్య జనం నుండి పాత్రలను తీసుకొని రాసిన నాటకమిది. ఇందులో ప్రతి పాత్ర తనదంటూ ఒక మరుపురాని హాస్యభరిత కావ్యాన్ని ఆవిష్కరించింది. బాల్యవివాహాలు, కన్యాశుల్కము వంటి సాంఘిక దురాచారాలు, హేయమైన మానవ నైజాల వంటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన నాటకం ‘కన్యాశుల్కము’. ఇంగ్లిషు, ఫ్రెంచి, రష్యన్‌, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో అనువాదానికి నోచుకున్న కన్యాశుల్కము, వి...

🚩🚩 మా సినిమాలు.........బాపు గారి మాటలలో ...

Image
♦’సీతమ్మ పెళ్ళి’ తర్వాత తీసిన ’బుల్లెట్’ తుస్సుమంది. ♦“కళ్యాణ తాంబూలం” పండలేదు. కానీ ఊటీలో తీసిన కొన్ని దృశ్యాలు చూసి ఒక ఎన్నారై ఇవి ఏ దేశంలో తీశారు అని అడిగారు. బయట మేం చేసిన సినిమాల్లో హరికృష్ణ గారు అన్ని విధాలా గొప్ప నిర్మాత. ♦ ’పెళ్ళిపుస్తకం’. రావి కొండలరావు గారు మిస్సమ్మ కథ తిరగేసి ఇచ్చారు. నంది అవార్డే కాక జనం కూడా రివార్డిచ్చారు. చాలా గొప్ప నటుడు రాజేంద్రప్రసాద్ – కొత్తనటి దివ్యవాణి. ♦కొంతభాగం మా మిత్రులు NCL రాజుగారి తోటలో తీశాం. రమణగారు అక్కడ చక్రాలు లేని రైలుపెట్టి ఉండడం చూసి గుమ్మడిగారి పాత్రకి చక్కని సీను రాశారు. సినిమాలో “అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటరు” అన్న డైలాగు చాలా ఇష్టం. ♦ఆరుద్రగారి “శ్రీరస్తు శుభమస్తు” పాట షూటింగుకి మా ఆర్టువారు కళ్యాణమండపం అద్దె, డెకొరేషన్సు, జూనియర్సు, వార కాస్ట్యూమ్సు లెక్కేసి పొడుగాటి జాబితా తెచ్చారు. వద్దనుకుని ఓ తమాషా చేశాం. ఓ గదిలో నాలుగిటుకలూ పుల్లలూ, కాస్తమంట, ముగ్గులు, నాలుగు అరటి పిలకలు, నాలుగు మామిడి రెమ్మలు, ఓ కొబ్బరి బొండాం, మంగళ సూత్రం, పుపు కలిపిన బియ్యం ఓ పళ్ళెం, రెండు కర్రలకి పూలదండలు అమర్చుకుని Tight Close shots తో ఓ పూటలో పాట ముగి...

🔴 -గరుత్మంతుడు -🔴

Image
♦ 🔴  -గరుత్మంతుడు -🔴 ♦కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకొంటాడు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువకు అండాలనుండి వాసుకి, ఆదిశేషుడు ఆదిగా గల వెయ్యి పాములు జన్మిస్తాయి.  ♦వినత అది చూసి తొందరపడి తన ఆండాన్ని చిదుపుతుంది. అందునుండి కాళ్లు లేకుండా, మొండెము మాత్రమే దేహముగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో నువ్వు సవతి మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసీగా ఉండు. రెండవ అండాన్ని భద్రంగా ఉంచు. అందునుండి జన్మించినవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు. సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్లిపోతాడు. ♦వినత తన రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటోంది. మరో 500 సంవత్సరాలు గడిచిన తర్వాత ...  ఆ అండం నుంచి  గరుత్మంతుడు ఉద్భవించి ఆకాశానికి ఎగిరి, భక్తిగా తల్లికి నమస్కరించాడు. వి...

🚩డాక్టర్ -దేవుడు!

Image
 🚩డాక్టర్ -దేవుడు! ♦అసలే ఖాళీ రోడ్డు, పెద్ద ఎండ కూడా లేదు, పైగా చల్లని గాలి, వెనక్కాల గట్టిగా పట్టుక్కూచున్న భార్య, దాంతో తెగ స్పీడుగా డ్రైవ్ చేసుకుంటా వెళ్తున్నాడు హరికృష్ణ. ఆళ్ళ మావగారు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన లేటెస్టు మోడలు కవాసాకీ నింజా బైకు కొత్తల్లుడికి ఉగాది కానుకగా ఇచ్చేరు. ♦కాకినాడలోని మావగారింట్లో ఉదయాన్నే బండికి పూజ చేయించి, పచ్చడి తిని తల్లిదండ్రులు ఉండే పిఠాపురానికి బయల్దేరాడు. దేవరపల్లి వీధి దాటి కుంతీమాధవస్వామి గుడి దగ్గరకొచ్చేసరికి ఎక్కణ్ణుంచొచ్చిందో ఓ సూడిగేదె అడ్డొచ్చేసరికి సడన్ బ్రేకు వేసాడు హరికృష్ణ. దాంతో నూటిరవై కిలోమీటర్ల స్పీడులో వస్తున్న బండికాస్తా స్కిడ్డైపోయి భార్యాభర్తలిద్దరూ కిందడిపోయేరు. ఒళ్ళంతా గీరుకుపోయి ఒకటే రక్తం, చెయ్యిరిగిపోయిందంటూ ఆ హరికృష్ణ భార్య హరిత ఒకటే ఏడుపు. ♦రోడ్డు పక్కనే ఉన్న పాకల్లోంచొచ్చిన జనం వీళ్ళిద్దరినీ లేవదీసి బండిని పక్కన నిలబెట్టి, బొట్టు బీదరాజు గాడి ఆటోలో పక్కీధిలోనున్న వెంకట్రాజుగారాసుపత్రికి తీసుకెళ్లిపోయేరు. ♦బంగళా పెంకేసున్న ఆ చిన్న ఇంటి ముందు డాక్టర్ వెంకట్రాజు, ఆరెంపీ అని రాసుంది. అంత ఏడుపులోనూ ఆ బోర్డు చూసిన హరిత '...

మేఘ సందేశం 🚩 (మహాకవి కాళిదాసు!)

Image
🚩 👉🏿కాళిదాసు గురించి నేను చిన్నప్పుడు విన్న ఒక విషయం చెప్పాలి. అమ్మవారి కటాక్షం లభించడానికి ముందు కాళిదాసు అమయాకంగా ఉండేవాడట. అక్కినేని నటించిన కాళిదాసు సినిమాలో కూడా అదే చూపించారు. 👉🏿ఆ రోజుల్లో ఒక ఊరి పడచు అతన్ని చూసి అస్తి కస్చిత్ వాక్ విశేషః? అని అన్నదట. అంటే "అసలు నీకు కొంచెమైనా మాట్లాడగలిగే విషయం ఉందా" అని. 👉🏿కొన్నాళ్ళకు అమ్మవారి కరుణతో గతం అంతా మర్చిపోయి మహాకవి అయిపోయాడని ఐతిహ్యం. గతం మర్చిపోయినా కాని 👉🏿 'అస్తి, కస్చిత్, వాక్' అనే ఆ పడచు పలికిన ఆ మూడు పదాలు మస్తిష్కంలో ఉండిపోయాయట. ఏదైతెనేం..ఆ మూడు పదాలతో మూడు కావ్యాలు మొదలెట్టేసి రాసేసాడు. 👉🏿అస్తి...తో 'అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మా...' అంటూ కుమారసంభవం, 👉🏿'కస్చిత్..తో..'కస్చిత్ కాంతా విరహ గురుణా..' అంటూ మేఘ సందేశం, 👉🏿'వాక్' ..తో..'వాగర్ధావివ సంపృక్తౌ...' అంటూ రఘు వంశం రాసేసాడు. 👉🏿 నీకు మాటలొచ్చా? అన్న ప్రశ్నకు అమ్మవారు కాళిదాసు నాల్క పైన ఆ మూడు పదాలతో అజరామరమైన మూడు కావ్యాలే పలికించిందన్న విషయం చరిత్రకారులు ఒప్పుకోకపోయినా, భాషాభిమానులు, భక్తి పారాయణులు 'అ...