Posts

Showing posts from March, 2014

మతం....... అధికారం.

Image
మతం....... అధికారం..@ Pothu Raju Perikala మతం అధికారం లో వున్నప్పుడు , అది స్వేచ్చా జీవులను హిమ్చించిన్ది.వారి నోళ్ళు నొక్కింది ,ఏ పిడి వాదము కూడా , ఈ దేశం లో శాఖా భేదాన్ని సైతం సహించిన దాకలాలు లేవు . అధికారం మతాన్ని ఆశ్రయించిన చారిత్రిక దశలో దౌస్త్యాలు చేయించింది మతం , చేచింది మతం అదుపాజ్ఞలలో వున్న అధికారం .. ఇది వాస్తవం . అధికారం తనంతట తాను , ఎలాటి శిక్షలను అమలు చేయదు -- దానికి మత ఆమోద ముద్ర కావాలి -- మతం చెప్పిన తీర్పు అధికారానికి శిక్షను వేచే శక్తిని ఇస్తుంది . సామాన్య జనాల నోళ్ళు దైవ భయం తో కుట్టేస్తుంది .... గత చరిత్ర , వర్తమానం మనకు కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్న సత్యం ఇదే ... --అందు వల్ల దౌష్ట్యం చేపించే మత తత్త్వం పోవాలి ... మతాన్ని అడ్డు పెట్టుకుని ద్రోహాలు చేచే అధికార తత్వమూ పోవాలి .. అంటే సిద్ధాంతాలు విసృతం కావాలి ..పాత దురభిప్రాయాలను నిర్ములిన్చుకుంటూ , సంఘ సిద్ధాంతాలతో ముందుకు కదలాలి ,,

మంచి గురువు.... వెర్రి బాగుల శిష్యుడు..

Image
వింజమూరి వారి వ్యాఖ్య ....మంచి గురువు.... వెర్రి బాగుల శిష్యుడు.. Vvs Sarma గారి వ్యాఖ్య .. ద్రోణుడు ఏకలవ్యుడు - వీరిని గురించి వింజమూరి వారి వ్యాఖ్య  మంచి గురువు.... వెర్రి బాగుల శిష్యుడు..  లోనే వక్ర భాష్యము ఉన్నది. ద్రోణుడు మంచి గురువా? ఎవరికి? అర్జునునికా? ఏకలవ్యునికా? ద్రోణుడి విలువిద్యా ప్రావీణ్యత గురించి ఎవరికీ అనుమానంలేదు. అర్జునునికి విలువిద్య నేర్పడమే కాక అతనిని మించినవాడు ఉండడని మాట ఇచ్చాడు. ఏకలవ్యుడు ద్రోణునే గురువుగా ఆరాధించి స్వయంకృషితో విలు విద్య నేర్చుకుని, తన విద్యను తాను ఆరాధించిన ద్రోణునికి ప్రదర్శించాడు. అంటే ఏకలవ్యుడు ఉత్తమ శిష్యుడు. ద్రోణుడు అతనికి మంచిగురువు కాలేక పోయాడు. అర్జునుని మించిన విలుకాడు తన యెదుటనే ఉన్నాడు. ఇది సహించలేక ద్రోణుడు నీచమైన అధర్మము చేశాడు. గురుదక్షిణగా అతని విద్యనే పరోక్షంగా కోరాడు. ఇంద్రుడు కర్ణునివద్ద కవచ కుండలములు దానం కోరినట్లే. ఇక్కడ కులాల ప్రసక్తి లేదు. శ్రీకృష్ణుని కథలో ఆయన అనేకులకు అనుగ్రహం చూపాడు. వారిలో బ్రాహ్మణుల సంఖ్య అతి తక్కువ. నాదృష్టిలో ఆకాలపు బ్రాహ్మణులు శ్రీకృష్ణావతారము వలన ప్రయోజనం పొందలేదు. ఏకలవ్యుడు,...

అందరికీ "జయ"నామ సంవత్సర శుభాకాంక్షలు! జయీభవ!

Image
అందరికీ "జయ"నామ సంవత్సర శుభాకాంక్షలు! జయీభవ! క్రొత్తదనాలు పూవులయి గుత్తులుగట్టి యుగాది పందిటన్ మత్తిలి నృత్తమాడినవి, మామిడికొమ్మలు కొత్తగా చివు ళ్ళెత్తి సుమించి కాచి ఫలియించెను, తీయని క్రొత్త కోరికల్ మెత్తని మన్మనః పథముమీది పదమ్ముల నూని సాగినన్ అని దాశరథివంటి నవకవి పులకించి పాడతాడు. దాశరథికి పూవులన్నిటిలోనూ మోదుగపూలంటే యిష్టం. "పల్లెపడుచు కచమ్ముల నుల్లసిల్లు మోదుగను మించినట్టి పువ్వేది జగతి!" అంటారాయన. అంతే కాదు, కోట్ల చిలుక ముక్కు లిట్లేకమైనట్లు కింశుకమ్ము లందగించె నేడు పేదవాని మదిని పెకలివచ్చిన ఆశ అరుణతరుణ మగుచు విరిసె ననగ అని కూడా అంటారు. కోట్ల చిలుకల ముక్కులు ఒక్కదగ్గర చేరినట్లు ఉన్నాయట ఆ కింశుకాలు. అక్కడితో ఆగిపోతే అది దాశరథి కవిత్వం అవ్వదు. విరగపూచిన ఆ మోదుగపూలు, పేదవాని మదిలోని ఆశ పైకి పెకలివచ్చిన తొలిసంధ్య వెలుగులా ఉన్నాయనడం ఆయనకే చెల్లింది! పేదతనమనే చీకటి పూర్తిగా తొలగిపోయే కొత్త ఉషస్సునీ ఉగాదినీ ఆకాంక్షిస్తాడు అభ్యుదయ కవి. అతని దృష్టిలో వసంతవిజయమంటే అదీ. ఏ పేరుతో వచ్చినా క్రొత్తదనాన్ని ఎప్పుడూ స్వాగతించాలని దాశరథి నిష్కర్షగా అంటార...

" నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు "

Image
" నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " . పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట. తరవాత్తరవాత - మొగుడి మాట పెళ్ళాం వింటుందట.  పోతే, ఆ తరవాత మాత్రం - ఆ ఇద్దరి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట." ఈ వినడం అన్నది చెవికి సంబంధించిన విషయం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే పోలా -  కొందరు భార్యలు - " నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " అన్న తృప్తిలో అన్ని అసంతృప్తులు మరచిపోతుంటారు.  మగవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మాట వినే పెళ్ళాం దొరికిందని బయట చెప్పుకుంటూ, మురిసి ముక్కచెక్కలవుతూ మగధీరులమని మీసం మెలేస్తుంటారు.

ఏన్ని అరాటాలు ...ఎన్ని ...పోరాటాలో...

Image
ఏన్ని అరాటాలు ...ఎన్ని ...పోరాటాలో... - మన పెద్దాలు భార్యాభర్త లా సంసారా భధ్యత లు ను జొడెడ్ల బండి తో పోల్చరూ .....ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు ....ఒకరి కి ఒకరు కట్టి కాలే వరకు ....వెనుక ముందు అంతే ...పాలు నుండీ పెరుగు తరువాత మజ్జిక ,వెన్న నుండి నేయి....మన జీవితం కుడా ఈ చిన్న కధ లోనే ఇమిడి ఉంది నిశితముగా పరిశీలిస్తే .. ఎలా అంటే మగవాడు మరిగిన పాలు చల్లరి గొరువెచ్చని .... పాలు లాంటి మగని కి తోడు అంటు మజ్జిక మగువ ను చేరిస్తే చక్కటి చిక్కటి గడ్డ పెరుగు లాంటి మంచి సంసారం మొదలైంది ఈ చక్కని చిక్కని సంసారం చిలికితేనే మజ్జిక ,వెన్న అనబడే చిట్టి పిల్లాలు ,సిరి సంపదలు .ఆ అలు మగలు కరిగి .. మధుర మైన నేతి గా మారి వారి ఆ నేతి తో పిల్లాలకూ బంగారూ భవిష్యత్తు తీర్చి దిద్ది .....కడకు కాటి కి ఆవిరి అయి ఈ లోకం నుండీ ఆవిరి గాల్లో కలిసి పోయి ఎగసి పోతారూ.....చూసారా...తరిచి..తెరచి చూస్తే ....జీవితం ఎంతా చిన్నాదో ....ఏన్ని అరాటాలు ...ఎన్ని ...పోరాటాలో.....కదా !

'జనాంతిక..

Image
శ్రీ మునిమాణిక్యం వారితో'జనాంతిక..(@ Sastry Tvs) అసలు ముందు 'జనాంతికం' అంటే చెప్పాలి కదా! ప్రాచీన నాటకాలకు కొన్ని సంప్రదాయాలు, పద్ధతులూ ఉన్నాయి.అవి,నాందీ ,ప్రస్తావన,జనాంతికం--- ఇలాంటివి కొన్ని ఉన్నాయి.ఆ రోజుల్లో రంగస్థలం మీద కొన్ని దృశ్యాలను ప్రదర్శించేవారు కాదు.ఉదాహరణకు --దహన సంస్కారాలు లాంటివి.మరికొన్నిటిని ప్రదర్శించటం కష్టం.కానీ,వాటి సంగతులు ప్రేక్షకులకు తెలియటం చాలా అవసరం.ఉదాహరణకు,సీతమ్మను రావణుడు ఆకాశ మార్గాన తీసుకొని వెళ్ళుతుంటాడు.జటాయువు అడ్డగించి భీకరపోరు చేస్తాడు.ఆఖరికి ఆ పక్షీంద్రుడు రెక్కలు తెగి భూమిమీద పడతాడు.ఈ దృశ్యం అంతా ప్రేక్షకులకు తెలియచేయవలసినదే! కానీ,రంగస్థలంమీద ఎలా ప్రదర్శించగలరు?అటువంటి సమయంలో,నాటక సూత్రధారులు,ఇద్దరు హాస్య పాత్రధారులను రంగస్థలంపైకి ప్రవేశపెట్టి వారితో గ్రామ్యభాషలో కొద్దిగా హాస్య సంభాషణలతో, ఇలా చెప్పిస్తారు.  మొదటి పాత్ర-అరే! బావ ఏందిరా అది,ఆకాశంలో పెద్ద శబ్దం వినిపిస్తుంది. రెండవ పాత్ర--ఏమీ లేదురా,నీకు ఈ మధ్య మీ ఆవిడ దెబ్బలకు ఏది విన్నా పెద్ద శబ్దంలాగే వినిపిస్తుంది. మొదటి పాత్ర--అక్కడికేదో,నీ భార్య పెద్ద పతివ్రత అయినట్లు. ...

"అమవస నిశి"

Image
(తెనాలి రామకృష్ణుడి విమర్శకు పాలైన "అమవస నిశి" పద్యం) కలనాటి ధనము లక్కర గలనాటికి దాచ కమల గర్భుని వశమా నెల నడిమి నాటి వెన్నెల యలవడునే గాదె బోయె నమవస నిశికిన్.

ఘటన (భర్తృహరి సుభాషితం)

Image
ఘటన (భర్తృహరి సుభాషితం) కొందరు ప్రతిభ లేకుండానే రాణిస్తారు. కొందరు ప్రతిభకు మించి ప్రకాశించుతారు. కొందరు అప్రతిహతమైన ప్రతిభ కలిగి కూడా విధి అన్న అగ్నికి ఆహుతియైపోతారు.భర్తృహరి ఈ విషయాన్ని బహు చక్కగా వివరించినాడు. గమనించండి . సంతప్తాయసి సంస్తితస్య పయసో నామాపి న శ్రూయతే ముక్తాకారతయా తదేవ నళినీ పత్రస్థితందృశ్యతే అంతస్సాగర శుక్తిమధ్య పతితం తన్మౌక్తికం జాయతే ప్రాయేణాధమ మధ్యమోత్తమజుషా మేవంవిదా వృత్తయః దీనికి ఏంగు లక్ష్మణకవి వారి తెలుగు సేత నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు, నా నీరమే ముత్యమట్లు నలినీదళ సంస్థితమై దనర్చు నా నీరమే శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచితప్రభన్ పౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి "శృంగార శాకుంతలము" నుండి వినాయక ప్రార్థన

Image
జనని స్తన్యముఁ గ్రోలుచుం జరణ కంజాతంబునం గింకిణీ స్వన మింపారఁగఁ దల్లి మేన మృదుల స్పర్శంబుగాఁ దొండ మ ల్లన యాడించుచుఁ జొక్కు విఘ్నపతి యుల్లసంబుతో మంత్రి వె న్ననికిన్ మన్నన సొంపు మీఱ నొసఁగున్ భద్రంబు లెల్లప్పుడున్ పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి "శృంగార శాకుంతలము" నుండి వినాయక ప్రార్థన తల్లి పాలు త్రాగుచూ పాదపద్మములకు కట్టిన గజ్జెల మ్రోత ఆహ్లాదాన్ని గొలుపుతుండగా, తనతల్లి శరీరాన్ని మృదువుగా నిమురుతూ ఆనందించు విఘ్నపతి (వినాయకుడు ) మంత్రి వెన్ననికి భద్రము కల్పించుగాక ఈపద్యంలో సాధారణంగా తల్లి పాలుత్రాగే పిల్లలచేష్టలు మనంచూడవచ్చు. పాలుత్రాగుతు కాళ్లు ఆడించటం, చెతులతొ ఒళ్లుతడమటం అనేవి చిన్నపిల్లల చేష్టలు. అవే గణపతికి ఆపాదించి వర్ణించాడు కవి

ఆట గదరా నీకు అమ్మ తోడు

Image
ఆట గదరా నీకు అమ్మ తోడు ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా నీకు అమ్మతోడు ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గద జననాలు ఆట గద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆట గద సొంతాలు ఆట గద పంతాలు ఆట గద సొంతాలు ఆట గద పంతాలు ఆట గద అంతాలు ఆట నీకు ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా నీకు అమ్మతోడు ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా నలుపు ఆట గదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆట గదరా మన్ను ఆట గదరా మిన్ను ఆట గదరా మన్ను ఆట గదరా మిన్ను మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా నీకు అమ్మతోడు ఆట గదరా శివా ఆట గద కేశవ

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు - టీవీయస్.శాస్త్రి

Image
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు - టీవీయస్.శాస్త్రి amarajeevi shri Potti Sreeramulu ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీ రాములు. అంతకు ముందు శ్రీ స్వామి సీతారం 38 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మధ్యలోనే విరమించారు. 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం లేకపోవటం చాలా బాధాకరమైనది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం కూడా ఒక భాగంగా ఉండి తమిళుల పరిపాలనలో ఎన్నో బాధలు, ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆంధ్రులు అంతా ఏకమై స్వంత రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీ రాములు గారు,19 -10 -1952 న,మైలాపూరు,మద్రాసు లోని,స్వాతంత్ర్య సమరుడు శ్రీ బులుసు సాంబ మూర్తి గారి గృహంలో నిరసన వ్రతం ప్రారంభించారు.58 రోజులు తన ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించి,చివరకు, 16-12-1952 న అమరజీవి అయ్యాడు.ప్రత్యేక ఆంద్ర రాష్ట్ర ఉద్యమం 1910 లోనే ప్రారంభం అయింది.1913 లోనే,ప్రధమ ఆంద్ర మహాసభలు బాపట్లలో నిర్వహించారు.ఈ ఉద్యమంలో శ్రీ న్యాపతి సుబ్బారావు, శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య, శ్రీ అయ్యదేవర కాళేశ్వర ...

ఆంధ్రకవులు, వారిని ఉచితరీతిని సత్కరించిన మహారాజులు

Image
 కీ.శే.గాడేపల్లి కుక్కుటేశ్వరరావుగారు.... విషయము: ఆంధ్రకవులు, వారిని ఉచితరీతిని సత్కరించిన మహారాజులు  నన్నయభట్టు లేకున్నచో రాజరాజనరేంద్రుకీర్తి కృష్ణార్పణమ్ము,  తిక్కయజ్వయలేక తెలుగున మనుమసిద్ధినృపాలుపేరు సోదెకునురాదు, శ్రీనాధకవిరాజులేక వీరారెడ్డి,అవచితిప్పయ్య,విస్సన్న సున్న,  అలసానివారులేరా,కృష్ణరాయలప్రతిభకు కపిలదస్త్రాలె దిక్కు, చచ్చి,దుమ్మైననృపతుల చావనీక దుమ్ముపైనిన్ని యమృతబిందువులు చల్లి  తిరిగి బ్రదుకిచ్చి జగతి సుస్థిరులజేసె సుకవియను మేటియైంద్రజాలికుడొకండు

దుష్టసంహార ! నరసింహ దురితదూర !

Image
బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని,మరణకాలమునందు మఱతు నేమో ? య వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమ చేత గంప ముద్భవమంది ,కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచు పిలుతునో శ్రమ చేత పిలవలేనో ? నాటికిపుడే చేసెద నామభజన దలచెదను జేరి వినవయ్య ! ధైర్యముగను ! భూషణ వికాస ! శ్రీధర్మపురి నివాస ! దుష్టసంహార ! నరసింహ దురితదూర ! స్వామీ చివరి రోజులలో నీ నామస్మరణ చేసుకోగలమో లేమో!ఆ రోజున ఎన్ని అడ్డంకులు వస్తాయో! ఆరోగ్యం సహకరించదు అందుకే ఈ రొజే నీ నమస్మరణ చెసుకుంటాము .చెవినొడ్డి వినవయ్యా !

ఇంగిలీషు బుడుగు

Image
ఇంగిలీషు బుడుగు  (ముళ్ళపూడి వారికి క్షమాపణలతో)  “ఒరేయ్ బుడుగు కన్నా. నేను నీ నాన్ననుకదా. నువ్వు అల్లరి చేస్తే నాకు కోపం రావాలి కదా. వచ్చి బెత్తంతో గాట్టిగా కొట్టాననుకో. నీకూ ఉక్రోషం రావాలి కదా. అప్పుడు ఏం చేస్తావురా?” “నువ్వు నాన్నగాడివికదా. కొట్టేస్తావ్. నేను చిన్న పెద్దోడిని కదా.నిన్నేమీ అనలేను కదా. అందుకని లెట్రిన్ లోకి వెళ్లి కమోడ్ శుభ్రం చేస్తాను.” “అదేమిటి? కమోడ్ కడిగితే నీ కోపం తగ్గుతుందా.యెలా?” “యెలా ఏమిటి యెలా. అదే మీ పెద్దోళ్ళకు మా చిన్నోళ్ళకు తేడా. నేను లెట్రిన్ కడిగేది నీ టూత్ బ్రష్ తో.” ఇది స్కూలు జోన్. చిన్నపిల్లలు రోడ్డు దాటుతుంటారు. వాహనాలు వేగంగా నడిపి మమ్మల్ని చంపకండి. టీచర్లు వచ్చేదాకా ఆగండి” బుడుగు స్కూల్లో అసెంబ్లీ జరుగుతోంది. పిల్లలు ఎవరిమట్టుకు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ప్రిన్సిపాల్ చెప్పేది ఎవరికీ వినబడడం లేదు. ఆయనకు చర్రున కోపం వచ్చింది. “ఏమిటిది ? ఇది స్కూలనుకున్నారా!మీ ఇల్లనుకున్నారా! వెధవలందరూ ఒకచోట చేరినట్టుంది. ఒకరి తరవాత ఒకరు మాట్లాడలేరా? ఆయ్!” అంటూ గయ్యిమన్నాడు. బుడుగు లేచి అన్నాడు. “సరే!ముందు మీరు మొదలు పెట్టండి” ...

మూతిబిగ ింపులు అలకలు పాతపడిన విదయలని

Image
మూతిబిగ ింపులు అలకలు పాతపడిన విదయలని మగువలెపుడూ మగవార ని చిరునవుుల గెలావాలని  తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి  యువకుల శాస ించుటకే  యువకుల శాస ించుటకే యువతులవతర ించిరని  తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి 

భాగవతము - రుక్మిణీ కల్యాణము

Image
భాగవతము - రుక్మిణీ కల్యాణము క. ఆ వనజగర్భు పంపున రైవతుఁడను రాజు దెచ్చి రామున కిచ్చెన్‌ రేవతి యనియెడు కన్యను భూవర! మును వింటి కాదె బుద్ధిం దెలియ\న్‌. 1 వ. తదనంతరంబున. 2 మ. ఖగనాథుం డమరేంద్రుఁ గెల్చి సుధ ము\న్‌ గైకొన్న చందంబున\న్‌ జగతీనాథులఁ జైద్య పక్షచరులన్‌ సాళ్వాదులం గెల్చి భ ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుత\న్‌ రాజీవగంధి\న్‌ రమా భగవత్యంశభవ\న్‌ మహాగుణమణి\న్‌ బాలామణి\న్‌ రుక్మిణి\న్‌. 3 వ. అనిన రా జిట్లనియె. మున్ను రాక్షస వివాహంబున స్వయంవరంబునకు వచ్చి, హరి రుక్మిణిం గొనిపోయె నని పలికితివి. కృష్ణుం డొక్కరుం డెవ్విధంబున సాళ్వాదులం జయించి, తన పురంబునకుం జనియె? అదియునుం గాక. 4 శా. కల్యాణాత్మక మైన విష్ణుకథ లాకర్ణింపుచు\న్‌ ముక్త వై కల్యుం డెవ్వఁడు తృప్తు డౌ, నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా కల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే రుక్మిణీ కల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడి\న్‌. 5 క. భూషణములు సెవులకు బుధ తోషణము లనేక జన్మ దురితౌఘ విని శ్శోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణ భాషణముల్‌. 6 వ. అని, రా జడిగిన శుకుం డిట్లనియె. 7...

ఎవరునేర్పారమ్మ ఈ జాతికి -గౌరవమ్మిమ్మని స్త్రీజాతికి

Image
ఎవరునేర్పారమ్మ ఈ జాతికి -గౌరవమ్మిమ్మని స్త్రీజాతికి !3-4-2010.నేను హరద్వారలో కుంభమేళాకి వెళ్లేను.ఉదయం 5గంటలకే ఘాట్లన్నీ క్రిక్క్కిరిసి యున్నాయి.నా భార్య, స్నేహితులు గంగలో స్నానానికి సమాయక్తమౌతున్నారు.నాచేతిలో కెమేరాతో చుట్టూ కలయజూస్తున్నాను.ఈ దృశ్యం నాకంటబడింది.తోందరలో నా వేలు కూడా పోటోకి అడ్డుపడింది. మనుధర్మశాస్త్రము-3వ అధ్యాయం-56వ శ్లోకం యత్ర నార్యాస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతాః|  యత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్రాఫలాః క్రియాః ||  ఎచ్చట స్త్రీలు పూజింపహడతారో అచ్చట దేవతలు ప్రీతి జెందుతారు.ఎచ్చట వారు గౌరవింపబడరో అచ్చటచేసే కార్యాలన్నీకూడా నిష్ఫలములౌతాయి.సనాతన ధ్మర్మంలో మన ఋషులు మన సమాజంలోస్త్రీకి కల్పించిన ఉత్కృష్ట స్థానమది.ఆమె వలనే సంతానోత్పత్తి,ఆమెవలనే కులానికి గారవం.ఆమె వలనే గోత్రాభివృద్ది.మనపురాణాలుకూడా స్త్రీకిగల ప్రముఖ్యాన్ని దేవతల భార్యల ద్వారా తెలియజేసారు.బ్రహ్మ సరస్వతిని ముఖమందు,విష్ణువు వక్షస్థలమందు,భోళాశంకరుడైతే నేనోసగం నువ్వోసగం అని తనలో అర్ధభాగాన్నిచ్చేడు.గంగని కూడా నెత్తిమీద పెట్టుకున్నాడు.భారతనారి పేర్లు స్త్రీదేవతామూర్తుల పేర్లు,పతివ్రతల పే...

గృహ లక్ష్మి.......(ఓల్గా)...

Image
గృహ లక్ష్మి.......(ఓల్గా)... రుబ్బుడు పొత్రంలా  తల తిరుగుతూనే వున్నా ఆలోచనల పప్పు మెదగదు ఇంగువ వాసనలో మునిగి తేలే ముక్కు ఊపిరి పీల్చుకోవడం మర్చి పోతుంది చెతుల చీపురుకట్టలు ఎడతెరిపి లేకండా సూన్యంలో దేవుతూనే ఉంటాయి కలల అలల తుంపరలు  హృదయపు పెనంపై చుయ్యిమంటూనే ఉంటాయి  రోకటి బండ కింద పచ్చడి, పచ్చడవుతూనే ఉంటుంది నడుం బండకేసి బాదినా కాటుక కంటినీట జడించినా మనసుల మురికి వదలనే వదలదు ఆసులో కండెంలా నిత్యం కదుల్తూనే చలనం ఎరుగని కాళ్ళు పిల్లర్స్‌లా ఉన్నచోటనే పాతుకు పోతాయి అలుగ్గుడ్డల పీతిబట్టల పరిమళంలో పునీతమవుతున్నా జీవితం ఎందుకో ఎప్పుడూ  కాటు వాసనే వేస్తుంటుంది

ప్రాతః ద్యూత ప్రసంగేన/

Image
పైకి తప్పుగా కనిపించినా లోపల ఎంత గొప్ప అర్థాన్నిదాచుకొని ఉందో  చాటు శ్లోకం. ------- -  ‘విద్వాన్’తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు.... “ ప్రాతః ద్యూత ప్రసంగేన/ మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతాం/ నక్తం చొరప్రసంగేన/ కాలో గచ్ఛతి ధీమతః//”  అర్థం. ప్రాతః = ఉదయంపూట. ద్యూత ప్రసంగేనా = జ్యూదం గురించి మాటాడుకొంటూ. మధ్యాహ్నే = మధ్యాహ్నసమయంలో. స్త్రీ ప్రసంగాతాం = స్త్రీ గురించి మాటాడుతూ  నక్తం =రాత్రుళ్ళు. చోరప్రసంగేన = దొంగల గురించి ప్రసంగిస్తూ. ధీమతః= బుద్ధిమంతులు (లేక పెద్దలు.) కాలో గచ్ఛతి= కాలాన్ని గడుపుతారు. ఏ మాశ్చర్యం! బుద్ధిమంతులు, ఉదయం జూదం గురించి, మధ్యాహ్నం స్త్రీని గూర్చి, రాత్రి దొంగలను గూర్చి మాటాడుకొంటూ కాలం గడుపుతారట!  పై వాటిని గూర్చి చర్చించుకొనే వారు బుద్ధిమంతులు ఎలా అవుతారు. చాల విచిత్రంకదా!  ( క్రింది వివరణ చదవకుండా కొంచం ఆలోచించి ఈ చాటువులో విశేషం ఏమిటో తెలుసుకొందుకు ప్రయత్నించండి.తెలియ లేదా అయితే.)  ఇప్పుడు విశేషార్థం చూడండి. “ కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముఖ్య కారణం శకుని మాయాజ్యూదమేకదా! ఆకథ మహాభారతం లో ఉంది కనుక ‘ద్యూ...

“భ్రాత్రుహంతా పితృహంతా/

Image
పైకి నిందలా కనపడిన లోపల అంటే అంతరార్థం చూస్తే స్తుతి కనపడుతుంది.  అటువంటి చాటువులని ఇప్పుడు చూద్దాం. “భ్రాత్రుహంతా పితృహంతా/ మాతృహంతా చ యః పుమాన్/ త్రయేతే చ మహాభక్తాః / ఏతేషాంచ నమామ్యహం//” భ్రాత్రుహంతా = అన్నని చంపించినవాడు. పితృ హంతా = తండ్రిని చంపించిన వాడు. మాతృ హంతాచ = తల్లిని చంపినవాడు. యః పుమాన్ = ఎవరైతే ఉన్నారో  త్రయేతేచ = ఆ ముగ్గురు. మహాభక్తా: = గొప్ప భక్తులు. ఏతేషాం చ = ఆ ముగ్గురికి. నమామ్యహం = నమస్కరించుచున్నాను. అని అర్థం. “అన్నని,తండ్రిని, తల్లిని చంపినవారు మహాభక్తులు ఎలావుతారు? వారుపాపాత్ములు కదా! మరి వారికి నమస్కరించడం ఏమిటి?” ఇది పైకి కనపడేభావం. కాని అంతరార్థం పరిశీలిస్తే “అన్నని చంపిచినవాడు ‘విభీషణుడు’ రామునిచేత పాపాత్ముడైన రావణుని చంపించి లోక కల్యాణానికి కారణమైన మహాభక్తుడు.” ఇక తండ్రిని చంపించిన వాడు. ‘ ప్రహ్లాదుడు.’ లోక కంటకుడైన హిరణ్య కశిపుని నరసింహస్వామిచేత సంహరింపజేసిన పరమ భక్తుడు ప్రహ్లాదుడు. తల్లిని చంపినవాడు ‘పరశురాముడు.’ తండ్రి జమదగ్ని ఆజ్ఞను అనుసరించి తల్లి (రేణుకాదేవి)ని చంపి, తండ్రి వరం కోరుకోమనగా తల్లిని బ్రతికించమ...

విశిష్ట అంతరిక్ష శాస్త్రవేత్త - పద్మశ్రీ డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్

Image
విశిష్ట అంతరిక్ష శాస్త్రవేత్త - పద్మశ్రీ డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్ పల్లెటూరు నుంచి ప్రస్తానం చేసి, రాకెట్లను ప్రయోగించి, వాటి స్థితి గతులను నియంత్రించి, దిశామార్గం చూపి వాటిని భ్రమణ కక్షలో ప్రవేశ పెట్టి ఉపగ్రహ కమ్యునికేషన్స్ కి ఆద్యం పోసి, భారత దేశం ప్రప్రధమ ఎస్ ఎల్ వి - రాకెట్ వెహికిల్ సిస్టం దగ్గర నుండి, నేటి చంద్రయాన్, మంగల్యాన్ వ్యోమ నౌకా - ఉపగ్రహాలని నడిపించిన భారతీయుడు, తెలుగు వాడు, విశిష్ట అంతరిక్ష శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్ గారు. శాస్త్రవేత్తగా తన ప్రయాణం మొదలు పెట్టి ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు శ్రీహరికోటలోని 'షార్ ' కేంద్రంలో పనిచేసి, సంచాలకుడిగా ఎదిగి భారత దేశ ప్రయోజనాలను, అంతరిక్ష లక్షాలను సాధిస్తున్న సుప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త. రాకెట్ ఉపరితలం ఒదిలి, చంద్ర కక్ష, అంగారక కక్ష ఎలా చేరాలో నిశితంగా రూపకల్పన చేసి దాన్ని అమలులో పెట్టి, నియంత్రిస్తూ, గగనాంతరాళలో విహరింప చేస్తున్నారూ అంటే వారి ప్రజ్ఞా పాటవాలు ఏపాటివో, వారి శాస్త్రీయ నైపుణ్యత ఎంత శ్రేష్టమైనదో వేరే చెప్పనక్కర లేదు. వారు సాధించిన అసామాన్య ఫలితాలు వారి దీక్షా దక్షతలకు ఎంత పరి...

తెలుగు పత్రికలు : మహిళా సంపాదకులు....- రచన : - డా. శిరీష ఈడ్పుగంటి.

Image
తెలుగు పత్రికలు : మహిళా సంపాదకులు....- రచన :  - డా. శిరీష ఈడ్పుగంటి. తెలుగులో పత్రిక అనేది ఆధునిక సాహిత్య ప్రక్రియల వలె పాశ్చాత్య ప్రభావంతో వచ్చిన సారస్వత ప్రక్రియ. పత్రిక అనే పేరు పత్రం నుండి వచ్చింది. శబ్దరత్నాకర నిఘంటువులో పత్రికకు అర్థం "వ్యవహారము యొక్క చెల్లుబడికై యొకరొకరు వ్రాసికొనెడి పత్రము” అని ఉంది. పత్రం అనే ఆరోపం దగ్గర "వ్యవహారము యొక్క చెల్లుబడికై యొకరొకరు వ్రాసికొనెడి ఆకు”అని ఇచ్చారు. అదనంగా వార్తాపత్రిక అనే అర్థం కూడా ఇచ్చారు. తరువాత యాభైసంవత్సరాలకు వెలువడ్డ సూర్యరాయాంధ్ర నిఘంటువులో కూడా పత్రిక అంటే "వ్రాతకు ఆధారమగు తాటియాకు, కాగితము, వ్యవహారమున పరస్పరము వ్రాసికొనెడి పత్ర,ము అని వివరణ ఉంది. ’లేఖ అనే అర్థంలో పత్రిక అనేపదం మొట్టమొదటసారి ప్రభావతీప్రద్యుమ్నములో కనబడింది. ప్రభావతి పంపిన పత్రిక తీసుకుని శుచిముఖి ప్రద్యుమ్నుడికి చేర్చే సందర్భంలో తెలుస్తుంది’ (రామచంద్ర 1989:1). మద్రాసులో తెలుగు ముద్రాక్షరశాలలు వచ్చిన తర్వాత పత్రికలు రావడం మొదలైంది. ఆ రోజులలో తాళపత్ర గ్రంథాల సేకరణ, ప్రచురణలు ఒక్కసారిగా మొదలైనాయి. ఆనాటి పత్రికలు సహజంగానే భాషా, సాహిత్య, సాంస్కృతి...