ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి ?
ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి ? - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రామాయణం నుండి ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఒక్క వేదంలోంచే తెలుసుకోవాలి, ఎందుకంటే ధర్మం చెప్పడానికి ఇంకెవరికీ అధికారం లేదు, నేను ధర్మం చెప్తానండీ అంటే ఇంకెవరికీ అధికారం లేదు ధర్మం చెప్పడానికి నేను చెప్తానండీ ధర్మం అంటే లేదు వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. వేదం చెప్పింది ధర్మం అయితే వేదం చదివి తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఇవ్వాళ ఎంతమందికి ఉంటుంది. వేదంలో ధర్మం ఇలా ఉంది అని మనం ఎలా చెప్పగలం చెప్పలేం కాబట్టి ఋషులేం చేశారంటే స్మృతులు కింద తీసుకొచ్చారు. గౌతముడు ఒక స్మృతి రచన చేశాడు. దానిని గౌతమ స్మృతి అంటారు. యజ్ఞవల్కడు ఒక స్మృతి చేశాడు ʻయాజ్ఞవల్క స్మృతిʼ, అత్రి ఒక స్మృతి చేశాడు ʻఅత్రి స్మృతిʼ స్మృతులొచ్చాయి, స్మృతులేం చేస్తాయంటే వేదంలో ఉన్నటువంటి ధర్మ సూత్రములను క్రోడీకరించి వాటిని అందంగా ఒక పొందికతో తీసుకొస్తారు దానికి ʻస్మృతిʼ అని పేరు ʻశృతిʼ ʻస్మృతిʼ రెండు విరుద్ధంగా ఉండవు, శృతిని స్మృతి అనుసరిస్తుంది. శృతిని స్మృతి ఎక్కడైనా తిరస్కరిస్తే దాన్ని మనం పాటించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే అది ధర్మ వి...