🙏 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏
🙏 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏 🤲 జగత్ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమమ్ | స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః || 10 | 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲 విష్ణు సహస్రనామాలలో మొదటి నామం విశ్వం - వివరణ: 🤲 ౧. విశ్వము - జగము - గోచరాగోచరాత్మకమైన అనంత విశ్వము నారాయణుడే. మొదటి నామం విశ్వం. ప్రతివ్యక్తికీ మొదట గోచరించేది విశ్వమే. తొలుత కనబడే ఈవిశ్వమే విష్ణుని రూపమని గ్రహించాలని ఈ ప్రథమ నామం బోధిస్తోంది. ౨. విశ్వమునకు కారణమైనవాడు, కార్యమైనవాడు - అని మరొక అర్థం. పరబ్రహ్మకు భిన్నమైనది ఏదీలేదు. అందుకే విశ్వమే నారాయణుడు. "బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం: (ముండకోపనిషత్తు). "పురుష ఏవేదం విశ్వం" (ముండకోపనిషత్తు). "అంతర్బహిశ్చ తత్సర్వంవ్యాప్యనారాయణ స్థితః" లోపలా బయటా అంతటా వ్యాపించి నారాయణుడున్నాడు - అని నారాయాణ సూక్తం. ౩. ’విశతి’ - అంటే ’ప్రవేశించెను’ అని అర్థం. నారాయణుడు దేనియందు ప్రవేశించి ఉన్నాడో అది ’విశ్వం’. కనుక ’విశ్వ” అన్నమాటే”నారాయుడు ఇందులో ఉన్నాడు’అని ఎరుకపరుస్తోంది. "తత్ సృష్ట్యా తదేవాను ప్రావిశత్" దీనిని సృ...