ఆరున్నొక్క రాగం ఆదితాళం !

ఆరున్నొక్క రాగం ఆదితాళం !

😪😪😪😪😪😪😪😪😪😪😪


👉అల్లసాని పెద్దన్న అల్లిబిల్లిగా ఏడ్చాడు..

ముక్కు తిమ్మన్న ముద్దు ముద్దుగా ఏడ్చాడు...


భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడు’


అన్న ఛలోక్తి సాహిత్య లోకంలో సుప్రసిద్ధమైంది. 

.

వరూధిని వంటి గంధర్వాంగన కోరి వ(రి)స్తే ప్రవరాఖ్యుడు కాదు పొమ్మన్నాడు. ఆవిడకు కోపం రాదు మరీ! 

వచ్చింది. కానీ, ప్రవరుడు ఆ కోపాన్నీ పట్టించుకోలేదన్న ఉక్రోషంతో ‘నన్ను తోసినప్పుడు నీ చేతి గోళ్ళు ఎక్కడెక్కడ గాయపరిచాయో చూడు... అంటూ ఆ పాటలగంధి వేదన నెపంబిడి ఏడ్చింది’ అని చెప్పాడు అల్లసాని పెద్దన్న. కనుకనే ‘వరూధినిది తెచ్చిపెట్టుకున్న దుఃఖం!’ అన్నారు తాపీ ధర్మారావు. 

.

👉నంది తిమ్మన్న సత్యభామది మరోరకం దుఃఖం. తనను కాదని సవతికి మొగుడు పెద్దపీట వేశాడు. పారిజాతాన్ని రుక్మిణి జడలో తురిమాడు. దాంతో సత్య ‘ఈసునపుట్టి డెందమున హెచ్చిన కోపదవానలంబుచే గాసిలి ఏడ్చింది.’ 

.

👉వసురాజును వలచి విరహ తాపంతో సతమతమవుతున్న గిరికపై నిండు పున్నమి వెన్నెల దాడి చేసింది. అది అన్యాయం కాదు మరీ! ‘ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్‌ (తాళ)లేక రాకా నిశారాజ శ్రీసఖమైన మోమున, పటాగ్రం(చీర కొంగులాంటి బట్ట) ఒత్తి, ఎల్గెత్తి ఆ రాజీవానన యేడ్చె...’ అని మనలాగే భట్టుమూర్తీ బాధపడ్డాడు. 

.

తేడా ఎక్కడొచ్చిందంటే-


వరూధిని ‘కలస్వనంబుతో’ (తీయని కంఠధ్వనితో) ఏడ్చింది.


సత్యభామ ‘బాలపల్లవగ్రాస కషాయకంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనితో’ ఏడ్చింది.


గిరిక కాంభోజిరాగాన్ని ఎంచుకొని మరీ ‘స్వరసం’గా ఏడ్చిందట.


‘కిన్నర వధూరాజత్‌ కరాంభోజ కాంభోజీమేళ 

విపంచికా రవ సుధాపురంబు తోరంబుగన్‌’ 

అన్నాడు- సంగీతజ్ఞుడు కూడా అయిన భట్టుమూర్తి అనే రామరాజభూషణుడు.


ఎంతకాదన్నా ఆడవారి నోట ఆరున్నొక్క రాగం పలికించడంలో మగవారికి అదోరకమైన ‘తుత్తి’ దక్కుతోందనిపిస్తోంది.

ఉత్పల వంటి సంప్రదాయ కవి సైతం

.

‘ఆమె ముక్కు ఎప్పుడును జిర్రున చీదినట్లు లేదు... 

హస్తమున సూదిమందు ఎక్కినట్లు లేదు’ 

.

అని ‘స్వప్నాల దుప్పటి’ చాటున బెంగపెట్టుకున్నారంటే


ఏమనుకోవాలి?

సున్నిత మనస్కులై ఎదుటివారిని ఏడిపించాలన్న బుద్ధి


ఏ కోశానా లేని కృష్ణశాస్త్రి వంటి కవులు


‘నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు


నితాంత దుఃఖంపు నిధులు కలవు’ 

.

అని తమ వెతల సంపదలు చూసుకుని సంతృప్తిపడతారు.


వారిని చూసి తిలక్‌ వంటి కవులు


‘మల్లెపూలపై పరుంటాడు... మంచి గంధం పూసుకుంటాడు... మరెందుకో ఏడుస్తాడు’ 

అంటూ ముక్కున వేలేసుకుంటారు. 

రాయప్రోలు వంటివారైతే

‘ఈ తృణకంకణంబు భరియింపుము... నీ ప్రణయ బాష్పజలాంజలి నింతయిచ్చి ఏ రీతిని వాడకుండ అలరింపుము’ అంటూ స్త్రీల కన్నీటిని అర్థిస్తారు.

ఇదంతా భావకవుల బేల ధోరణి.

ప్రబంధ కవులకు అలా బాహాటంగా ఏడ్చేందుకు మొహం చెల్లలేదు.

తమ నాయికలనే ఏదో వంకతో ‘వాటినీ ఏడుపులనే అంటారా?’ అని సందేహం వచ్చేలా ఏడిపించి తృప్తిపడ్డారు,

ఆ పెద్దమనిషి చేత అందుకే మాట పడ్డారు.

.

‘ఆ సంగతలా ఉంచండి, తనకోసం కన్నీరు పెట్టే స్త్రీ ఉండటం పురుషుడి భాగ్యమని గుర్తించండి’ అని శ్రీశ్రీ తేల్చి చెప్పారు. 

‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమె కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన... అంతకన్నా మహాభాగ్యం ఏముంది?’ అని సూటిగా ప్రశ్నించారు. 

కన్నీటిలో కరంటు లాంటిదేదో ఉందన్నది నిజం.

‘ఏడిచి ఎన్నాళ్ళయినదీ ఎద! అశ్రులు కనుమోసులందు ఓడిచి ఎన్నినాళ్ళు అయినదోయి’ అని కవులు కలవరపడటంలో అర్థం ఉందనిపిస్తుంది.

కాకపోతే హాయిగా స్వయంగా ఏడవాలే తప్ప ఎదుటివారిని ఏడిపించడం దోషమని మన పెద్దల తీర్మానం!

‘కలకంఠి కంట కన్నీరొలికితే సిరి యింట నిలవనంటుంది’ అనే భావనను స్థిరపరచడంలో అర్థం అదే. 

లేకుంటే ‘బాలానాం రోదనం బలం’ అన్న నోటితోనే ‘అతివలకూ ఏడుపు బలవర్థకం’ అనేవారేగా!


అయినవాళ్ళు దూరం అయినప్పుడు మనిషి భావోద్వేగాలకు లోనై, దుఃఖం కలగడం సర్వసహజం. 

అప్పుడు కన్నీరు రావడం మనిషి లక్షణం. కన్నతల్లి కన్నుమూత తీరని శోకాన్ని రగల్చగా

‘నీవు మడిగట్టుకుని పోయినావు పండ్లు పుష్పములు తీసుకొని- దేవపూజ కెటకొ!

నేను నీకొంగు పట్టుకు నీదువెంట పోవుటకు లేక కన్నీటిబొట్లు రాల్తు’ 

అని విలపించారు నాయని సుబ్బారావు.

భార్యా వియోగ దుఃఖం నుంచి తేరుకునే క్రమంలో ‘వరలక్ష్మీ త్రిశతి’ని వెలువరించారు విశ్వనాథ.

‘తాజమహల్‌ అంటే ప్రియురాలు మరణింప ప్రియుడు కట్టించిన కన్నీటి తలపోత’గా వర్ణించారో వచన కవి. ‘భావోద్వేగాలు అలా ఏదోరకంగా బయటపడటమే ఆరోగ్యానికి మంచిది... ఏడవడం తప్పేం కాదు, 

మనసును తేలికపరచే మంచి మందు అది’ అంటున్నారు శాస్త్రజ్ఞులు. 

‘గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు అన్నమాట సత్యం...

భావోద్వేగాలను బలవంతంగా అణచిపెడితే ఆరోగ్యానికి చేటు’ అని హెచ్చరిస్తున్నారు.

‘రేయి కడుపున చీకటి చాయవోలె... నా విషాదమ్ములో దాగినాడ నేనె’ అనుకుంటూ 

తమలో తామే కుమిలిపోకుండా- కడుపారా బాహాటంగా ఏడ్చేయడమే సరైన పని’ అన్నది పరిశోధకుల సలహా. ‘ఏడిపిస్తే’ ఏడవమని కాదు, ‘ఏడుపొస్తే’ ఆపుకోవద్దన్నట్లుగా దీన్ని స్త్రీలు అర్థం చేసుకోవాలి.

దుఃఖం తన్నుకొస్తే భార్య ఒడిలో తలదాచి కాసిని కన్నీటి చుక్కలు రాలిస్తే మగతనానికి వచ్చిపడే లోటేమీ లేదని మగవారు గ్రహించాలి. అది అల్లిబిల్లిగానా ముద్దు ముద్దుగానా బావురుమనా... అనేది అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇక్కడ మోతాదు కాదు,

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!