" సూర్య భగవానుని చరిత్ర "


" సూర్య భగవానుని చరిత్ర "


సూర్యుని భార్య ' సంజ్ఞా దేవి '. త్వష్ట ప్రజాపతి కుమార్తె.


సంజ్ఞాదేవి గర్భవాసాన సూర్యునికి ముగ్గురు బిడ్డలు.


వారు మనువు,యముడు,యమున.


మనువుల చే పరిపాలించబడటం వలన మనం ' మానవులు


'అయినాము.


సూర్యుని కుమారుడు అయిన మనువు మొదటి మనువు.


ధర్మ స్వరూపుడైన 'యముడు' అష్టదిక్పాలకులలో ఒకడైనాడు.


యముడే ధర్మదేవత.జీవుల పాపపుణ్యాలను గుణించి,శిక్షించి,


కర్మ పరిహారం చేసే ' నరకలోకాధిపతి '.


ఇలా ఉండగా సంజ్ఞాదేవికి అమిత తేజోవంతుడైన తన భర్త కాంతిని


భరించడం సాధ్యం కానిదయ్యింది.కొంతకాలం తన పుట్టింటికి వెళ్ళి


విశ్రాంతి తీసుకోవనుకుంది.చెపితే భర్త ఒప్పుకోడని,బాగా


ఆలోచించి,తన శక్తితో తన ప్రతిరూపాన్ని సృష్టించింది.ఆ స్త్రీ మూర్తికి


'ఛాయ ' అని పేరు పెట్టింది.


తన భర్తని,పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి,ఎట్టి పరిస్థిలోనూ


ఈ రహస్యం భర్తకు తెలియరాదని మాట తీసుకుంది.


తనకు శాప భయం రానంత వరకు ఎవరికీ తెలియనివ్వనని


షరతుతో కూడిన మాట ఇచ్చింది ఛాయాదేవి.


సంజ్ఞాదేవి పుట్టింటికి చేరింది.


కానీ అక్కడ తండ్రి తన కూతురు భర్తకు తెలియకుండా వచ్చినదని


తెలిసి,ఆమె అక్కడ ఉండడానికి ఒప్పుకోలేదు.


వివాహం అయిన స్త్రీ భర్త అనుమతి లేకుండా పుట్టింటికి రావడం


ధర్మం కాదని,కారణమేదయినా సరే అందువలన రెండు కుటుంబాలకు


చెడ్డ పేరు వస్తుందని,అందువలన తిరిగి భర్త వద్దకు వెళ్ళిపొమ్మన్నాడు.


తండ్రి మాటలకు విచారించిన సంజ్ఞాదేవి చేసేది లేక,దుఃఖంతో వెను


తిరిగింది.ఇంత జరిగాక భర్త దగ్గరకు వెళ్ళడానికి ముఖం చెల్లక, '


ఉత్తర కురు భూములు 'చేరింది.


అక్కడ ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటానికై ' ఆడగుర్రం ' గా


మారి సంచరించ సాగింది.


ఇక్కడ ఇదేమీ తెలియని ' భాస్కరుడు ' ఇంట్లో ఉన్నది సంజ్ఞాదేవి


గానే భావించి కాలం గడపసాగాడు.


వారి అన్యోన్య ఫలితంగా చాయాదేవికి ' వైవస్వత మనువు,శని,


తపతి ' ముగ్గురు పిల్లలు కలిగారు.


వైవస్వంతుడు మనువు అయినాడు,శని నవగ్రహాలలో స్థానం పొందాడు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!